వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆగం కాదు జనగామ: జిల్లా ఏర్పాటు సాధ్యమేనా?

By Pratap
|
Google Oneindia TeluguNews

ప్రస్తుతం వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న జనగామాను జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. అగ్గి రగులుతున్నది. ఆందోళన తీవ్రరూపం దాల్చి బస్సుల దగ్ధగానికి దారి తీసింది. ఈ స్థితిలో జనగామా జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే దాని మనుగడ సాధ్యమేనా... అందుకు తగిన స్థాయి, స్థితి జనగామాకు ఉందా అనే పరిశీలనా వ్యాసం...

ప్రకృతి వైపరిత్యాలకు ఆమడ దూరం :సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉంది.భూకంపాలు,సునామీలకు చోటు లేదు.భవిషత్తులోనూ పూర్తి సురక్షిత ప్రాంతం. ఒకప్పుడు సమితి కేంద్రం.పాత తాలూకా కూడా. వరంగల్ జిల్లాలో రెండో పెద్ద మున్సిపాలిటి. జనగామా,అలేరు,పాలకుర్తి,స్టేషన్ ఘన్ పూర్,తుంగతుర్తి లోని కొంతభాగం కలుపుకొని సుమారుగా 23 మండలాలను కలుపుకొని కరువు జిల్లాగా ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం అభివృద్ది చెందుతుంది.వలసలు ఆగిపోతాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఇక్కడి ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

వనరులు, వసతులు :

1 )రవాణా :

2 జాతీయ రహదారులు ఉన్నాయి. ,బ్రిటిష్ కాలం లోనే రైల్వే లైన్ ఉంది. .మధ్యప్రదేశ్,కర్నాటక,మహారాష్ట్ర,చత్తీస్ ఘడ్,ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు రాష్ట్రాలను కలిపుతాయివి. రెండు జాతీయ రహదారులు కలిసే చోట ఉండడం జనగామా ప్రత్యేకత.

Reddy Ratnakar Reddy argues for the creation of Jangaon district

2 )భూమి :

- ప్రభుత్వ కార్యాలయల నిర్మాణానికి అనువుగా ప్రధాన రహదారికి ఆనుకొని 175 ఎకరల భూమి ఉన్నది.. కల్లెం లోనే 300 ఎకరాలు,చంపక్ హిల్ల్స్‌లో సుమారుగా 1000 ఎకరాల భూమి ఉన్నది.

3 ) నీళ్ళు :

చిటకోడూర్ ,తపాస్ పల్లి,అశ్వరావు పల్లి,మల్లన్న గండి ల గుట్టలను కలుపుకొని నిర్మించబడ్డ 4 సహజ సిద్ధ జలాశయాలున్నయి

4 )విద్యుత్తు :

చమపక్ హిల్ల్స్ లో100 ఎకరాల్లో.. 400 కె.వి.సబ్ స్టేషన్ నిర్మాణములో ఉన్నది. వరంగల్ జిల్లాలో ఇంతకన్నా పెద్దది మరొకటి లేదు.

5 )ప్రభుత్వ కార్యాలయాలు :

రెవెన్యూ,పోలీస్ కార్యాలయాలు,జిల్లా న్యాయ స్థానం ....

ఒక్క కలెక్టర్ కార్యాలయం తప్ప అన్ని కార్యాలయాలు నైజాం కాలం నించే ఉన్నాయి.సకల సౌకర్యాలతో 20 నూతన భవనాలు నిర్మించబడి ఉన్నాయి.ఇవేగాక 12 కమ్యూనిటి బిల్డింగ్స్ అందుబాటులో ఉన్నాయి.

( 1 ) ఢాక్ బంగ్ల( ఆర్ & బి గెస్ట్ హౌజ్)1331 ఫస్లీ, ( 2 )డివిజనల్ మెజిస్టేట్ కోర్ట్ 1334 ఫస్లీ,( 3 ) తహసీల్దార్ కార్యాలయం 1365 ఫస్లీ, ( 4 ) 1950 లో మున్సిపాలిటీ , ( 5 )1947 లో డా.నర్సిమ్హా రావు గారి అద్యక్షతన యువజన గ్రంధాలయం,( 6 ) 1953లొ శాఖా గ్రంధాలయం ఏర్పాటైనాయి,( 7 ) 1958 లో కొలిపాక బాల లింగం అనే బట్టల వ్యాపారి ఇంట్లో మొదటీ బుగ్గ వెలిగింది.ఎన్.రామయ్య.ఇంటినెంబరుకు 3-9-10 లో 23-07-1958లో తొమ్మిదో విద్యుత్ కనెక్సన్ ఇవ్వబడింది.(8 )1962 లో రాజస్రీ సినిమా థియేటర్,(9 ) 1975 లో ఇండస్ట్రియల్ పార్క్(అప్పటి విదేశాంగ మంత్రి పి.వి.నరసిమ్హా రావు గారు ప్రరంబోత్సవం చేసారు) ( 10 )1978 లో బస్టాండ్ నిర్మించబడింది.

Reddy Ratnakar Reddy argues for the creation of Jangaon district

6) చరిత్ర :

మధ్య శిలా యుగం, నవీన, బృహద్ శిలాయుగం మొదలుకొని ,శాతవాహన,రాష్ట్రకూట, చాళుక్య, కాకతీయ సామ్రాజ్యాలు ఇక్కడ మనుగడ సాధించినై. సర్వాయి పాపన్న వీరోచిత ఘట్టాలు ఎలా మరువగలం. సాయుధ పోరాట చరిత్ర జాతీయ స్థాయి నాయకులనూ,తొలి అమరుడు దొడ్డి కొమురయ్యనూ.తొ లి ఎన్ కౌంటర్ అయిన గబ్బెట తిరుమల్ రెడ్డిని అందించింది. తొలి,మలి దశల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేసింది. సిద్దిపేట, నర్సంపేటల తరువాత ఎక్కువగా రిలే నిరాహార దీక్షలు చేసింది. ఇక్కడి మట్టి సత్యాగ్రం నేటి ఆంద్ర ప్రదేశ్ రాష్ట నూతన రాజధానికి స్పూర్తిగా నిలిచింది.

7 )విద్యా సంస్థలు :

ఒక్క మెడికల్ కళాశాల తప్ప అన్నీ ఉన్నై.బ్రిటిష్ కాలం నుండే ఇక్కడ విద్యా సంస్థలు పురుడు పోసుకున్నయి .

1901 లో క్రైస్తవ మిషనరీ జనగామాకు సేవలందించింది.1907 లో విద్యా బోధన చేసింది.అమెరికా లోని వైట్ హౌజ్ ని పోలిన రెండంతస్తుల భవనం 1934 నుండి విద్యా బోదనకు అంకితమైంది.1937 లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఏర్పాటైంది.1981 లో వరంగల్ జిల్లా లోనే మొదటిదైన సి.బి.ఎస్.సి పాఠశాల ఏర్పాటైంది.

D.Ed,B.Ed,M.Ed,T.P.T,H.P.T.T., విద్యా కళాశాలలతోపాటు, ఇంజనీరింగ్, ఫార్మాసూటికల్, పాలీ టెక్నిక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొదలైన కళాశాలలతో విద్యారంగానికి కేంద్ర బిందువైంది.

8 ) వైద్యశాలలు :

రెండు ప్రభుత్వ ఆరోగ్య శాలలు, 100 పడకల సాధారణ ఆరోగ్య శాల,100 పడకల ప్రసూతి ఆరోగ్య శాల ,రక్తనిధి కేంద్రం,మొదలైనవి ఉన్నాయి. వీటికి అనుబందంగా .మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసుకోవచ్చు.

9) దేవాలయాలు :

కొమురవెల్లి, కొలనుపాక, జీడికల్ రామాలయం, పాలకుర్తి సోమన్న దేవాలయం, సిల్పూర్ దేవాలయం, కొడవటూర్ దేవాలయం, బెక్కల్, దేవాలయం నిడిగొండ త్రికూటాలయం ..చుట్టూ దేవాలయలే..యాదగిరి గుట్టా మనకు సమీపమే.

Reddy Ratnakar Reddy argues for the creation of Jangaon district

10) పర్యాటక ప్రాంతాలు :

ఇక్కడి గుట్టలన్నీ గొప్ప పర్యాటక ప్రాంతాలైతయి.రిజర్వాయర్లు 4 గుట్టల నడుమనే ఉన్నయి.ఆది మానవుల ఆవాసాలు, నిలువురాళ్ళు ఈ గుట్టలల్లనే ఉన్నయి. గబ్బెట మంచం గుట్ట ,గోపరాజుపల్లి లోని ఆది మానవుల చిత్రాలు,కొడవటూర్ దేవాలయం,నిడిగొండ లోని త్రికూటాలయం,పొట్టిగుట్ట నుండి బోటింగ్ చేస్తూ ఆవలి ఉన్న సర్వాయి పాపనిగుట్ట,పక్కనే ఉన్న అందమైన నిలువురాళ్లను, రాకాసి గూల్లను,ప్రేమికుల బండను చూడవచ్చు.గోవర్ధనగిరి లోని గుట్టపై ఉన్న గోపాల స్వామి దేవాలయం,రోల్ల మదిరె గా పిలువబడే ఆది మానవుల రాతి గొడ్డల్ల పరిశ్రమనూ చూడవచ్చు. కొలను పాక ఎలాగూ ఉన్నదె. పదెకరాల విస్తీర్ణం కలిగిన బతుకమ్మ కుంట (పట్టణ జనగామ)పార్క్ నిర్మాణములో ఉన్నది.

11 )రెవెన్యూ :

ఆదాయములో ముందున్నది.

12 ) వ్యాపార కేంద్రం :

ఒకప్పుడు ఇటు సిద్దిపేట,అటు సూర్యాపేట,ఇటు స్టేషన్ ఘన్ పూర్ అటు భువనగిర దాకా ఏదైనా కొనాలన్న అమ్మాలన్నా జనగామాకే వచ్చేవారు.గతములో ఎంత ఉజ్జ్వలంగా వెలిగేదో ఈ ఉదాహరణలు చాలనుకుంటా.
*విశాలమైన గ్రైన్ మార్కెట్ ఉంది.పచ్చి ధాన్యాన్ని సైతం కొనేందుకు వీలుగా డ్రయ్యర్(అత్యాధునిక యంత్రం) ఉంది.ఆసియా లోనె పేరెన్నిక గన్న పశువుల సంత నవాబు పేట లో ఉంది.

13) చేతి వృత్తులు,కళా రంగాలు :

ప్రభుత్వ ,ప్రైవేట్ రంగాల్లోని ప్రముఖులను గుర్తించి,గౌరవించి,బహుమతులనందించే పెంబర్తి బ్రాస్ వర్క్ , అమేజాన్ ద్వారా ప్రపంచానికి పరిచయమవుతున్న చేర్యాల నకాసి చిత్ర కల జనగామా కీర్తి ప్రతిష్టలను ద్విగుణీకృతం చేస్తున్నాయి.

14 ) మత సామరస్యం, శాంతి : అన్ని మతాలవారున్నప్పటికీ మత సహనం ఉన్నది.సాయుధ పోరాట చరిత్ర ఉన్నా ఎంతో సహనం ఇక్కడి ప్రజల్లో ఉన్నది.ఇక్కడి బొడ్రాయి వద్దే పీరీలు కొలువు దీరుతై. క్రైం రేట్ సున్న.ఇగ జనగామా జిల్లా ఎందుకు కాదో చెప్పన్నా!

- ఫస్లీ: ఉర్దూ సంవత్సరానికి 600 సంవత్సరాలు కలిపితే ఆంగ్ల సంవత్సరం వస్తుంది.

- రెడ్డి రత్నాకర్ రెడ్డి
( చరిత్ర పరిశోధకుడు )

English summary
Reddy Ratnkar Reddy, a writer argues for the creation of Jangaon district in Telangana. It falls under Warangal district at present.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X