వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తనికెళ్ల 'సామాన్యసూక్తం': అభినవ పూటకూళ్ళు

By Pratap
|
Google Oneindia TeluguNews

రాకుమారుడు పులిపాలు తెచ్చుటకు వెళ్ళుట... మజ్జలో పూటకూళ్ళమ్మ వద్దకు వెళ్ళుట... ఆవిడ పంచభక్ష పరవాణ్ణములు పెట్టుటయేకాక రాకుమారిని లేవదీసుకుపోవుటకు సులభమార్గమును సూచించుట! ఇదీ జానపద గాథాక్రమం... పేదరాసి పెద్దమ్మ పోతూ పోతూ పూటకూళ్ళ ఇళ్ళని తీసుకుపోయిందేమో హోటళ్ళు వెలిశాయ్‌.

కాకా హోటళ్ళు... బాకా హోటళ్ళు... ఇరానీ, ఉడిపి... మలబారు, చైనా..... బ్రాహ్మణ... మిలిటరీ... అలా వర్ణాక్రమ ధర్మాల్ని గూడా పాటించి జాతికోటీ, వర్గానికోటీ ఇంకానయం కాంగ్రెస్‌ హోటళ్ళనీ కమ్యూనిస్టు హోటళ్ళనీ మొదలెట్టలేదు...

Tanikella Bharani

మేలుజాతి హోటళ్ళని చుక్కల హోటళ్ళందురు... అందు చుక్కా... పక్కా గూడా లభిస్తాయంటారు మరి నిజం మనకి తెలీదు...

మా కొంప దగ్గర ఓ హోటలుంది... నారాయణ... నారాయణ... అందులో భోంచేస్తే రౌరవాది నరకాల్ని సందర్శించినంత అనుభూతి కలుగుతుంది... అది సోల్‌ట్రేడర్‌ బిజినెస్సు... ప్రొప్రైటర్‌ అతనే మేనేజర్‌ అతనే క్లీనర్‌ సర్వర్‌ కుక్కు అలా పాత్రల్ని తోవడము కాకుండా పాత్రోచితంగా నటిస్తాడు... ఆ చుట్టుప్రక్కల రెండు కిలోమీటర్లవరకూ 'అన్నదాత' వాడే! అంచేతే తప్పక వెళ్ళడం... అదీ ఎప్పుడో! పిండాలెట్టినట్టు మూడు ముద్దలెడ్తాడు... ఓ లిక్విడ్‌ పోసి అది ''రసం'' అంటాడు... ఇంకో పదార్ధం సామూహిక సాంబార్‌, అందులో కందమూలములతో పాటు కొంత పచ్చిగడ్డి వేస్తాడు... మరో జేగురురంగు పదార్థం పేరు చట్నీ... నాలిక అతుక్కుపోతుంది... పండుగలకి 'స్వీటు' అని పేరెట్టి మైసూరుపాకం చేస్తాడు... ఆ రోజు దాన్ని దంతక్షయం లేకుండా నమలగలిగితే పండగ చేసుకున్నట్టే!

అన్నం పలుకయిందేమిరా అన్నామా మర్నాడు జావ... మెత్తబడిందేరా అంటే మేకులు... ఈ హోటల్‌ పక్కనే ఓ క్లినిక్కుంది... ఈ హోటల్‌వల్ల అది బాగుపడ్తోంది... అంచాత భావిభారత యువకులకి కుక్కింగ్‌లో ట్రైనింగ్‌ ఇస్తే సుఖపడ్తారు వాళ్ళయినా... స్వయంపాకమంత ఉత్తమం లేదని శాస్త్రమే వుందీ!

English summary
An emeinent writer and Tollywood actor Tanikella Bharani desribed the food serving hotels.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X