వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తనికెళ్ల భరణి 'సామాన్యసూక్తం': చదువు చారెడు...

By Pratap
|
Google Oneindia TeluguNews

పూర్వం తాళపత్రాల మీద గ్రంథాలు రాసిపోయేవారు... ఇప్పుడంటే తాటాకులు కేవలం నాలిగ్గీసుకోడానికి ఉపయోగిస్తున్నామనుకోండి. అదీ పల్లెటూళ్ళలో... కానీ ఆ పద్ధతే గనక కంటిన్యూ అయ్యుంటే... బాగుండేది... హాయిగా పెరట్లో నాలుగు తాటిచెట్లు పెంచుకుని... ఆదివారాలు కుర్రాళ్ళకి నోటుబుక్కులు కుట్టిపెట్టేవాణ్ణి!

స్కూళ్ళు తెరుస్తున్నారంటే వొణుకు పుట్టుకొస్తోంది... ఒక్కొక్క కుర్రవెధవకీ బండెలు పుస్తకాలు... అందులో వెరైటీలు సింగల్‌రూళ్ళు... డబుల్‌రూళ్ళు... బ్రాడ్‌రూళ్ళు వీళ్ళ పిండాకూడు రూళ్ళు... సరే ఎల్లాగో చచ్చీచెడీ అప్పుచేసో లోన్‌కి అప్లేయ్‌ చేసో కొందామన్నా అన్నీ ఒక్కచోట దొరికవ్‌... సరే ఇంక డ్యూటీ వేసుకుని అన్ని దుకాణాలూ వెతికి పట్టుకున్నాక... వాటికి అట్ట... వాటిమీద లేబుల్స్‌... ఇవన్నీ కూరి తీసికెళ్ళడానికి ఓ బ్యాగు... సిపాయివాడు యుద్ధానికెళ్తున్నట్టు వెళ్ళారు పిల్లలు స్కూళ్ళకి...

Tanikella Bharani

సరే మళ్ళీ కొనకపోతే గోలెత్తుతారనీ జెప్పి కొంటావా... పిల్లలు ఆ పుస్తకాల్ని గవర్నమెంటు ఆఫీసు ఫైళ్లకన్నా అధ్వాన్నంగా తయారుచేస్తారు... వాటినిండా కొట్టివేతలు... గీతలు... పిల్లిబొమ్మలూ కుక్కబొమ్మలూనూ... వీళ్ళ ప్రజ్ఞంతా ఉపయోగించి కాగితపు బాణాలు చేస్తారు... మరీ కుర్రాడయితే ఆ బాణాల్ని మేస్టార్లమీదకీ... ఓ మాదిరి కుర్రాడయితే అమ్మాయిల మీదికీ విసురుతారు.. వానాకాలం వొస్తే... చక్కగా పుస్తకాలు చింపి కాగితం పడవలుచేసి కేరింతలు కొడుతుంటారు.. నీళ్ళలో ఆ కాగితం పడవలు చూసినప్పుడల్లా... అవి రూపాయి కాయితంతో చేసిన పడవల్లా కనిపించి కళ్ళు మూసుకుంటాను.

ఈ విషయంలో మా పెద్దాడే బెటరు... వాడు కేవలం ఒకటే నోటు బుక్కు తీసుకుని ఏదో షికారుకెళ్లినట్లు వెళ్ళొస్తాడు కాలేజీకి... అయితే ఏ మాటకామాటే చెప్పుకోవాలి వాడు ఒక్కపూటన్న ముచ్చటకి నోట్సు రాసుకున్న పాపాన పోడు... లవ్‌లెటర్స్‌... ప్రేమలేఖలు చెక్కడానికి మాత్రమే పవిత్రంగా వాడుకుంటాడు!

ఈ మధ్య మా ఆవిడకూడా మొదలెట్టింది నోట్సు కొనడం... కొంప తవ్వి రచియిత్రి అవుతుందేమో అని హడలిపోయాను... అబ్బే కాదుట ఎడంవేపు ఇంటిపద్దు... కుడివేపు చాకలిపద్దుట! మా ఆవిడ కొంచెం పొదుపులెండి!

బుక్స్‌... బుక్స్‌... బ్లడీబుక్స్‌... అన్న కవిపుంగవుడెవరోగానీ ఇలాంటి బాధపడ్లేకే అనుంటాడు.

English summary
Tollywood actor and eminent writer Tanikella Bharani speaks about education system.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X