వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తణికెళ్ల భరణి 'సామాన్య సూక్తం': వరవిక్రయం

By Pratap
|
Google Oneindia TeluguNews

మహాకవి శ్రీ కాళ్ళకూరి నారాయణరావుగారు వరవిక్రయం అన్జెప్పి అత్యద్భుతమైన నాటకం రాశారు. సబ్జెక్టు వరకట్నం!... అందులోని ఒక్కొక్క డైలాగూ కట్నం పుచ్చుకునేవాళ్ళ మొహంమీద చెప్పుచ్చుకుని కొట్టినట్టుంటుంది. ఏంలాభం... ''సిగ్గా... ఎగ్గా?... ఎన్ని తిట్లు తిన్నా.. ఎన్ని శాసనాలు చేసినా ఇచ్చేవారు ఇస్తున్నారు... పుచ్చుకునేవారు పుచ్చుకుంటున్నారు.

''కన్యాశుల్కం'' రోజుల్లో మీరు ముక్కుకు తాడేసి పుచ్చుకోలేదూ... ఇప్పుడు మా చాన్సొచ్చింది... అంటారు పిల్లాడి తరపువారు అదేదో హక్కు అయినట్లు... సరే! వాళ్ళెవరో గడ్డి తిన్నారని చెప్పి మనమూ తినలేముగా...

Tanikella Bharani

<strong>తణికెళ్ల భరణి 'సామాన్య సూక్తం: స్టార్ డమ్!</strong></a><a href=
" title="తణికెళ్ల భరణి 'సామాన్య సూక్తం: స్టార్ డమ్!

" />తణికెళ్ల భరణి 'సామాన్య సూక్తం: స్టార్ డమ్!

<strong>తణికెళ్ల భరణి 'సామాన్య సూక్తం': రిపేరు చేయబడును </strong>తణికెళ్ల భరణి 'సామాన్య సూక్తం': రిపేరు చేయబడును

<strong>తణికెళ్ల భరణి 'సామాన్య సూక్తం: బిచ్చగాళ్ళొస్తున్నారు!</strong>తణికెళ్ల భరణి 'సామాన్య సూక్తం: బిచ్చగాళ్ళొస్తున్నారు!

ఒక ఆడపిల్ల తల్లితండ్రుల్నీ... బంధువుల్నీ... స్నేహితుల్నీ... తను పుట్టిపెరిగిన పరిసరాల్నీ.... ఆ మధురానుభూతుల్నీ శాశ్వతంగా వదిలేసి ముక్కు మొహం తెలీనివాడితో జీవితాంతం కలిసి వుండేందుకు వొస్తోందంటే ఎంత త్యాగం!... అలా రావడానిక్కూడా ఇంత టాక్స్‌ కట్టాలనిజెప్పి వాళ్ళ ప్రాణలు తోడితే ఇంక మానవత్వానికి అర్థం ఏవిటీ...?

అప్పుడే అయిందా... అయినకాడికి పిల్లని దారొయ్యాలి... బోల్డుకట్నం... ఎన్నో లాంఛనాలు... పండగలకీ పబ్బాలకీ బట్టలు... అల్లుడు అలిగితే బండి కొనివ్వటం ఏమిటి తంతు అంతేనూ...

యవ్వనంలో వున్న యువకుడు ఆవేశంకొద్దీ... కట్నమా గిట్నమా?... నాన్‌సెన్స్‌... నాది ఆదర్శవివాహం అన్నా... పెద్దవాళ్ళు చెంపలు వాయించి మరీ పుచ్చుకుంటారు... ''పెద్దోళ్ళమాటంటే గౌరవం''

English summary
Tollywood actor and writer Tanikella Bharani has opposed the dowry in his Samanya Suktam column.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X