వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలో ఉచిత స్వేచ్ఛాయుత ఇంటర్నెట్ బలోపేతానికి.. ‘ట్రాయ్’ నెట్ న్యూట్రాలిటీ సిఫార్సులు

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ప్రిన్స్ మెటర్నిచ్ అనుకుంటాను.. 'ఈస్టర్న్ క్వశ్చన్' అని ఒక మాటన్నాడు. యూరోప్‌లో ఈ మాటను అర్థం చేసుకున్న ముగ్గురిలో.. ఒకరు ఈలోకంలోనే లేరు, మరో వ్యక్తి పిచ్చివాడైపోయాడు, ఇక నేనైతే అదేంటో కూడా చాలా వరకు మర్చిపోయాను! సారీ, ఈ మాటను అర్థం చేసుకోవాలంటే మీరు హిస్టరీ విద్యార్థి అయి ఉండాలి.

నెట్ న్యూట్రాలిటీ గురించి ఎవరు ఏం మాట్లాడినా నాకిలాగే అనిపిస్తూ ఉంటుంది. ఈ నెట్ న్యూట్రాలిటీ గురించి నాకేం తెలుసో, అది కాస్త మీతో పంచుకుంటాను.

TRAI’s Net Neutrality Recommendations Strengthens Free and Open Internet in India

మీరెప్పుడైనా మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్‌లోకి లాగిన్ అయి, మీ ఫేవరెట్ న్యూస్ ఛానెల్ డెమొక్రటిక్ చూస్తుండగా.. ''మేం ఇకముందు ఈ న్యూస్ ఛానెల్‌ను మీకు చూపించలేం, దయచేసి డిక్టేటర్ ఛానెల్‌ను చూడండి..'' అనే మెసేజ్ వచ్చిందా? మీరెప్పుడైనా గిఫ్ట్ కొందామని ఈ-కామర్స్ కంపెనీ అప్‌స్టార్ట్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే.. ఆ వెబ్‌సైట్ ఓపెన్ అవకుండా.. మరో ఈ-కామర్స్ సంస్థ వెబ్‌సైట్ 'కలీబాబా'ను చూడండి.. అంటూ మీ నెట్‌వర్క్ ప్రొవైడర్ నుంచి మీకు మెసేజ్ వస్తే? లేటెస్ట్ మూవీ ఏదైనా చూస్తున్నప్పుడు ఆ మూవీ 'క్విక్‌ఫ్లిక్స్' వెబ్‌సైట్‌లో కన్నా 'ఓజోన్' వెబ్‌సైట్‌లో ఎలాంటి బఫరింగ్ లేకుండా రన్ అవడాన్ని ఎప్పుడైనా గమనించారా? లేదంటే మీ ఇంటర్నెట్ నెట్‌వర్క్ ప్రొవైడర్ మెసెంజర్ యాప్ 'హైప్'కు బదులు 'డైక్'ను వాడుకోమని సూచిస్తే?

ఇంటర్నెట్ ద్వారా యూజర్లు చూసే, వాడుకునే కంటెంట్ విషయంలో సర్వీస్ ప్రొవైడర్లు టెలికం సంస్థలు, ఐఎస్‌పీలు ఇతరత్రా వివక్ష చూపకుండా సమానత్వాన్ని పాటించడమే నెట్ న్యూట్రాలిటీ. అంటే కంటెంట్ ప్రొవైడర్ల సేవలను వెబ్‌సైట్లు, యాప్‌ల వంటివి ఎలాంటి డేటా చార్జీలు వసూలు చేయకుండా ఉచితంగా అందించాలి. కొన్ని సైట్లను ఉచితంగా, మరికొన్ని సైట్లపై చార్జీలు వేయటమే కాకుండా, ఇంటర్నెట్ వేగంలో హెచ్చుతగ్గులు చేస్తూ సమానత్వహక్కుకు భంగకరంగా వ్యవహరించకూడదు.

ఇంటర్నెట్ అనేది ఏ ఒక్క టెలికాం కంపెనీ సొత్తు కాదు, గుత్తాధిపత్యం ప్రదర్శించడానికి. అది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఒకే మాధ్యమం. ఇంటర్నెట్ అనేది ఏ అడ్డంకులూ లేని, ప్రతిఒక్కరికీ సమానంగా లభించాల్సిన సదుపాయం. కొన్నిసార్లు ప్రజాస్వామ్య దేశాల ప్రభుత్వాలు సైతం ఇంటర్నెట్‌పై పరిమితులు విధించేందుకు ప్రయత్నాలు చేస్తుంటాయి. కానీ ఇది సరైన చర్య కాదు. రాజ్యంగం వ్యక్తులకు ఎలాంటి స్వేచ్ఛను అయితే ప్రసాదించిందో ఇంటర్నెట్‌ కూడా అలాంటి స్వేచ్ఛ ఉండి తీరాలి.

ఈ స్వేచ్ఛాయుత ఇంటర్నెట్ విధానాన్ని ఉల్లంఘించే ప్రయత్నాలు తొలుత అమెరికాలోనే జరిగాయి. అక్కడి అతిపెద్ద ఇంటర్నెట్ కంపెనీలు, టెలికాం నెట్‌ వర్క్ ప్రొవైడర్లు ఇంటర్నెట్‌ను వ్యాపారాత్మక కోణంలో చూస్తూ అదనపు ఆర్జనకు ప్రణాళికలు రచించాయి. ఇదేగనుక జరిగితే ఇంటర్నెట్ ఇప్పుడున్నట్లుగా ఉండదు. కొన్ని సైట్లు వేగంగా ఓపెన్ అయితే, కొన్ని సైట్లు అసలు తెరుచుకోనే తెరుచుకోవు.

ప్రస్తుత టెక్ ప్రపంచంలో అమెరికాకు జలుబు చేస్తే.. ఇండియాకి తుమ్ములొస్తున్నాయి. ఇక్కడ ఏకకాలంలో రెండు విషయాలు జరుగుతున్నాయి. ఎ) కొన్ని పెద్ద ఇంటర్నెట్ సంస్థలు కొన్ని టెలికాం నెట్‌వర్క్ ప్రొవైడర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఇదే అదనుగా టెలికాం కంపెనీలు కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని మరింత ఆదాయాన్ని ఆర్జించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే అటు అమెరికా, ఇటు ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా నెట్ న్యూట్రాలిటీ అనే అంశం వెలుగులోకి వచ్చింది. ప్రజా సంఘాలు, చిన్న చిన్న ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కూడా పెద్ద ఎత్తున ఉద్యమించి కొన్ని పెద్ద కంపెనీలు ఇంటర్నెట్‌ను తమ గుప్పిట్లోకి తీసుకోవడాన్ని వ్యతిరేకించాయి. నిజానికి ఈ విషయంలో టెలికాం కంపెనీలను కూడా తప్పు పట్టలేం. ఎందుకంటే ఆయా కంపెనీల నడుమ నెలకొన్న తీవ్ర పోటీ వాతావరణం, కాల్ ఛార్జీలు బాగా తగ్గించాల్సి రావడం వంటి చర్యలతో కనీసం డేటా అమ్ముకునైనా నష్టాల నుంచి గట్టెక్కుదామని భావంచి ప్రజాగ్రహానికి గురయ్యాయి.

ఈ నెట్ న్యూట్రాలిటీకి సంబంధించి విధి విధానాలు తయారు చేసే క్రమంలో అమెరికా, ఇండియా చేరో దారిలో పయనించాయి. అమెరికాలో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆధ్వర్యంలో ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్(ఎఫ్‌సీసీ) స్వేచ్ఛాయుత ఇంటర్నెట్ కు సంబంధించి కొన్ని నిబంధనలు రూపొందించింది. దీని ప్రకారం టెలికాం కంపెనీలు గతంలో మాదిరిగానే ఇంటర్నెట్‌కు కేవలం మౌలిక సదుపాయాలు మాత్రమే కల్పించాల్సి ఉంటుంది. అదే మన ఇండియాకు వచ్చేసరికి ప్రధానమంత్రి చాలా తెలివిగా ఈ నెట్ న్యూట్రాలిటీ అమలు బాధ్యతను టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) భుజస్కందాలపై ఉంచారు. దీంతో ట్రాయ్ అన్ని టెలికాం కంపెనీలతో సమావేశమై ఇంటర్నెట్ ఓపెన్ ప్లాట్‌ఫాం అన్న సూత్రా న్ని సమర్థిస్తూ సర్వీస్ ప్రొవైడర్లకు విధి విధానాలను నిర్దేశించింది. కేవలం వినియోగదారులు చెల్లించే టారిఫ్ ఆధారంగా కంటెంట్ యాక్సెస్ విషయంలో ఎలాంటి వివక్షను చూపకూడదని ఆదేశించింది. ఏదైనా ఎంపిక చేసిన కంటెంట్‌ను బ్లాక్ చేసినా, డీగ్రేడ్ చేసినా, స్పీడ్‌ను తగ్గించినా అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై నిషేధం విధించాలని సూచించింది.

నెట్ న్యూట్రాలిటీ సిద్ధాంతంపై పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో గత వారమే తీసుకున్న కొన్ని సిఫార్సుల గురించి చెప్పుకోబోయే ముందు ఒకసారి మళ్లీ అమెరికాలో ఈ మధ్యన ఏం జరిగిందో చెబుతాను. అక్కడ ఒబామా ప్రభుత్వం పోయి ట్రంప్ ప్రభుత్వం వచ్చాక ఈ నెట్ న్యూట్రాలిటీకి సంబంధించి మళ్లీ కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఒబామా ప్రభుత్వ హయాంలో రూపొందించిన నెట్‌ న్యూట్రాలిటీ నిబంధనలను రద్దు చేయాలని భావిస్తున్నారు. ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ (ఎఫ్‌సిసి) కొత్త అధిపతి ఆలోచనలు చూస్తుంటే అక్కడి టెలికాం కంపెనీలు, ఇంటర్నెట్ కంపెనీల మధ్య ఇప్పటి వరకు ఉన్న పోటీ వాతావరణం తగ్గేలా కనిపిస్తోంది. మళ్లీ అక్కడ వ్యాపారాత్మక ధోరణి ప్రబలేలా కనిపిస్తోంది. దీనివల్ల మళ్లీ పెద్ద, చిన్న ఇంటర్నెట్ కంపెనీల మధ్య పోటీ వాతావరణం ఏర్పడవచ్చు. సిలికాన్ వ్యాలీలోని కొన్ని కంపెనీలపై ఎఫ్‌సీసీ అధిపతి బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. మళ్లీ నెట్ న్యూట్రాలిటీకి తూట్లు పడే ప్రమాదం కనిపిస్తోంది. అయితే గతంలో ఎలాంటి వివక్ష ప్రదర్శించడానికి టెలికాం కంపెనీలకు అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఎఫ్‌సీసీ అధినేత ధోరణి చూస్తుంటే నెట్ న్యూట్రాలిటీ విషయంలో వివక్ష కూడా చట్టబద్ధం అవుతుందేమో అనిపిస్తోంది.

ఇక మన దేశానికొస్తే.. నెట్ న్యూట్రాలిటీకి సంబంధించి ఇక్కడ ట్రాయ్ కొన్ని నిబంధనలు సిద్ధం చేసి ఉంచింది. వాటి ప్రకారం.. ఎ) ఇంటర్నెట్ లో కంటెంట్ కు సంబంధించి ఎలాంటి వివక్ష ఉండకూడదు. బి) టెలికాం కంపెనీలకు వాటి నెట్‌వర్క్‌లను ఎప్పటికప్పుడు ఆప్టిమైజ్ చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది. సి) నెట్ న్యూట్రాలిటీని అస్తవ్యస్థం చేసే ఎలాంటి మినహాయింపులు ఉండరాదు. అన్నిటి కంటే ముఖ్యంగా ట్రాయ్ సిఫార్సులు చూశాక నాకు ఏమనిపించిందంటే.. ఇప్పటి వరకు టెలికాం కంపెనీల మధ్య ఉన్న పోటీ వాతావరణం మున్ముందు కూడా కొనసాగుతుంది, ట్రాఫిక్ పెంచుకునేందుకు పెద్ద పెద్ద ఇంటర్నెట్ కంపెనీలు ఇతర దార్లు ఎంచుకుంటాయి. ట్రాయ్ సిఫార్సులు సాధారణ ఇంటర్నెట్ వినియోగదారులను కూడా అలరించేవిగా ఉన్నాయి. అవును, ఇవి కేవలం సిఫార్సులే. కానీ లా పుస్తకాల్లో ఉండే కఠినమైన చట్టాలకంటే ఇలాంటి చిన్న చిన్న నిబంధనలే మేలని వ్యక్తిగతంగా నాకు అనిపిస్తుంది. మొత్తంమీద నెట్ న్యూట్రాలిటీ విషయంలో ట్రాయ్ చేసిన సిఫార్సుల వల్ల ఇక మనకెలాంటి ఇబ్బందీ కలుగదు.

- సుభో రే, ప్రెసిడెంట్, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా

English summary
I think it was Prince Metternich who had said of the “Eastern Question,” “There were only three people in Europe who understood it, one of them is dead, the other has gone mad, and I have forgotten most of it”! Sorry, you have to be a student of history to understand this little aside. Any talk of Net Neutrality has the same effect on me. But for once let me remember whatever little I learned about it and share it with you.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X