వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరకొరియాతో గండమే?: ముక్కలు చేస్తామని హెచ్చరిక.. పుతిన్ ఇలా!

ఉత్తరకొరియా దుందుడుకు చర్యల పట్ల ఏమాత్రం హనం కోల్పోయినా ఇంత కాలం ఎదురు చూస్తూ కొనసాగించిన శాంతి మార్గానికి విఘాతం కలుగుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.

|
Google Oneindia TeluguNews

సియోల్: మాట్లాడితే చాలు.. ఖండాంతర క్షిపణి ప్రయోగాలంటూ ఉత్తరకొరియా ప్రపంచ దేశాలను హడలెత్తించాలని చూస్తోంది. ఏకంగా అగ్రరాజ్యం అమెరికాకే సవాళ్లు విసురుతూ కొరకరాని కొయ్యలా తయారవుతోంది. ప్రపంచమంతా శాంతి మంత్రం జపిస్తుంటే.. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ మాత్రం.. యుద్దమంత్రం జపిస్తున్నారు.

నిన్న మొన్నటిదాకా అమెరికాపై ఉరిమిపడ్డ కిమ్ జాంగ్.. ఇప్పుడు పొరుగుదేశం దక్షిణ కొరియాకు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికానే లెక్క చేయలేదు, ఇక మీరెంత? అన్న తరహాలో ఆ దేశానికి హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే మీ దేశాన్ని ముక్కలు, ముక్కలుగా చేస్తామని తన అహంకార వైఖరిని చాటుకున్నారు.

మరోసారి క్షిపణి ప్రయోగం:

మరోసారి క్షిపణి ప్రయోగం:

అంతేకాదు, అమెరికా స్వాతంత్ర్య దినమైన జులై 4న మరోసారి బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం) ప్రయోగం జరిపి ఉత్తరకొరియా తన ఉద్దేశాన్ని పరోక్షంగా చాటి చెప్పింది. ఈ చర్య అమెరికాకు మరింత మంటపుట్టించేదిగా మారింది. తాజా క్షిపణి ప్రయోగంతో ఇప్పటివరకు ఉత్తరకొరియా 11క్షిపణులను ప్రయోగించినట్లయింది.

అమెరికాను ఎదుర్కొనేందుకు:

అమెరికాను ఎదుర్కొనేందుకు:

అమెరికాలోని అలస్కా వంటి ప్రాంతాలను సులువుగా చేధించే క్షిపణులు ఉత్తరకొరియా అమ్ముల పొదిలో ఉన్నాయి. ఈ ధైర్యంతోనే అమెరికా నుంచి పొంచి ఉన్న అణుయుద్ద ముప్పును ఆ దేశం ఏమాత్రం లెక్క చేయడం లేదు. ఖండాంతర క్షిపణులు ఉన్నందువల్లే చీటికీ.. మాటికీ.. యుద్దం అంటూ ఊగిపోవడం కిమ్ జాంగ్ కు అలవాటుగా మారిపోయింది. ఇప్పుడదే ధోరణిని దక్షిణ కొరియాపై కూడా ప్రదర్శించారు.

దాని ఉద్దేశం గురించి ప్రశ్నించినందుకు?:

దాని ఉద్దేశం గురించి ప్రశ్నించినందుకు?:

ఖండాంతర క్షిపణి ప్రయోగం గురించి దక్షిణ కొరియా అద్యక్షుడు మూన్ జే ఇన్ ఉత్తరకొరియాను ప్రశ్నించారు. అసలు దీని ఉద్దేశమేంటో చెప్పాలని నిలదీశారు. మూన్ ప్రశ్నకు సహనం కోల్పోయిన కిమ్ జాంగ్.. మా ముందు తోలుబొమ్మల్లాంటి మీ సైన్యం ఏ పాటిదని ప్రశ్నించారు. మీ సైన్యాన్ని ఓడించి దక్షిణ కొరియాను ముక్కలు, ముక్కలు చేయడం మాకు చాలా సులువైన పని అంటూ కయ్యానికి కాలు దువ్వే ప్రయత్నం చేశారు.

ఐరాస ఆగ్రహం:

ఐరాస ఆగ్రహం:


ఉత్తరకొరియా దుందుడుకు చర్యలపై అమెరికా తీవ్ర ఆగ్రహంతో ఉంది. అమెరికా భద్రతా మండలి రాయబారి నిక్కీ హేలీ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. ఐరాస భద్రతా మండలి సమావేశంలో.. ఉత్తరకొరియాపై సైనిక చర్య తప్పదని హేలీ హెచ్చరించడం గమనార్హం.

మరోవైపు కిమ్ జాంగ్ కు అసలు జీవితంలో ఒక్క మంచి పని అయినా చేసే ఉద్దేశం లేదా అంటూ ట్రంప్ కూడా మండిపడ్డ విషయం తెలిసిందే. ఉత్తరకొరియా దూకుడు బ్రేక్ వేసేందుకు తమతో చేతులు కలపాలని చైనాకు సైతం ట్రంప్ విజ్ఞప్తి చేశారు.

పుతిన్ ఇలా:

పుతిన్ ఇలా:

ఉత్తరకొరియా దుందుడుకు చర్యల పట్ల ఏమాత్రం హనం కోల్పోయినా ఇంత కాలం ఎదురు చూస్తూ కొనసాగించిన శాంతి మార్గానికి విఘాతం కలుగుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. జీ-20దేశాల సదస్సులో భాగంగా.. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ తో సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉత్తరకొరియా విషయంలో ఎవరూ సహనం కోల్పోవద్దని సూచించారు. ఉత్తరకొరియా అణు కార్యక్రమాలు తమ దేశాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయంటూ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే అభిప్రాయడటంతో.. పుతిన్ ఇలా స్పందించారు.

త్వరలో తానే స్వయంగా ఉత్తరకొరియా అధ్యక్షుడిని కలుసుకుని ఈ అంశంపై చర్చిస్తానని అన్నారు. అయితే దాని సమయం, సందర్భం ఎప్పుడనేది మాత్రం కచ్చితంగా చెప్పలేమన్నారు.

English summary
After North Korea launched an intercontinental ballistic missile, new South Korean president Moon Jae-in warned Kim Jong Un “not to cross the red line,” vowing a stern response should he step over it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X