అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్ 108 అడుగుల విగ్రహం: నాలుగు డిజైన్లు ఇవే..

|
Google Oneindia TeluguNews

నవ్యాంధ్ర రాజధానిలో ఎపి ప్రభుత్వం 108 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొదట ఎన్టీఆర్ విగ్రహాన్నికృష్ణా నది ఒడ్డున కోర్ క్యాపిటల్‌కు అభిముఖంగా ఏర్పాటు చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడా నిర్ణయాన్ని మార్చుకొని ఫైనల్ గా నీరుకొండ వైపు ఏర్పాటు చేయాలని మంత్రివర్గంలో డిసైడ్ చేసేశారు. దీనివల్ల విగ్రహం ఎదుట భారీ జలాశయం ఉండడంతో విగ్రహం నీడ నీటిలో ప్రతిబింబించే అవకాశం ఏర్పడింది.

ఈ నిర్మాణం కోసం నాలుగు ఆకృతులను సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆ డిజైన్లను పరిశీలించిన చంద్రబాబు వాటికి మరింత మెరుగులు దిద్ది వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి సిద్ధం చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి పరిశీలించిన ఆ నాలుగు డిజైన్లు ఇవే....

 డిజైన్ 1...స్వాతిముత్యం...

డిజైన్ 1...స్వాతిముత్యం...

ఎన్టీఆర్ విగ్రహం కట్టడం కోసం రూపొందించిన నాలుగు డిజైన్లలో ఒకటి...స్వాతిముత్యం ఆకృతి...ఈ డిజైన్ లో ఎన్టీఆర్ విగ్రహం పాదాల కింద ఉండే పీఠం ఎత్తే 24 మీటర్లు ఉంటుంది. దాని పైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు...ఆ పీఠం దాని చుట్టూ ఉండే అనుబంధ కట్టడాలు అన్నీ కలసి స్వాతిమత్యం ఆకారంలో రూపుదిద్దుకుంటాయి.

 డిజైన్ 2...ముత్యపు చిప్ప ఆకృతి...

డిజైన్ 2...ముత్యపు చిప్ప ఆకృతి...

ఎన్టీఆర్ స్టాట్యూ కోసం సిఎం చంద్రబాబు పరిశీలించిన రెండో డిజైన్...ముత్యపు చిప్ప ఆకృతి...ఇందులో కూడా ఎన్టీఆర్ విగ్రహం కింద ఉండే పాద పీఠం ఎత్తు 24 మీటర్లే ఉంటుంది. అయితే అనుబంధ కట్టడాలతో కలిపి ఈ డిజైన్ ను ముత్యపు చిప్ప ఆకృతిలో తీర్చిదిద్దడం జరిగింది.

 డిజైన్ 3...ప్రదక్షణ ఆకృతి

డిజైన్ 3...ప్రదక్షణ ఆకృతి

ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించిన నాలుగు ఆకృతుల్లో ఇది మూడోది...పరిక్రమ ఆకృతిగా పేర్కొంటున్న ఈ డిజైన్ లో ఎన్టీఆర్ విగ్రహం కొండ శిఖరంపై ఉండగా...అక్కడకు చేరుకోవాలంటే కొండ చుట్టూ ప్రదక్షణ చేస్తూ...పైకి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకునే విధంగా మార్గం ఉంటుంది. అందుకే దీన్ని పరిక్రమ లేదా ప్రదక్షణ ఆకృతి గా పేర్కొనవచ్చు. ఈ మోడల్ లో ఎన్టీఆర్ కింద ఉండే పీఠం ఎత్తు 35 మీటర్లు...పీఠం చుట్టూ గ్రీనరీ ఉంటుంది. మొత్తం కట్టఢం 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది.

 డిజైన్ 4...కమలం ఆకృతి...

డిజైన్ 4...కమలం ఆకృతి...

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహం కోసం పరిశీలించిన ఆకృతుల్లో ఇది నాలుగవది. ఈ డిజైన్ మొత్తం పరిక్రమ ఆకృతినే పోలివున్నాఎన్టీఆర్ విగ్రహానికి దిగువన ఉండే పీఠం మాత్రం కమలం ఆకృతిలో ఉంటుంది. అంటే కమలం లో నుంచి ఎన్టీఆర్ ఉద్బవించినట్లుగా ఈ డిజైన్ ను రూపొందించడం జరిగింది. ఇందులో కూడీ పీఠం ఎత్తు 35 మీటర్లుగా తెలుస్తోంది...సో...ఇవండీ...నవ్యాంధ్ర రాజధానిలో తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు...దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం కోసం రూపొందించిన ఆకృతులు...

English summary
AP Government decided to construct 108 feet NTR Statue on a hill at Neerukonda of Amaravati, the Capital city of Andhra Pradesh. Regarding Statue, in Yesterday's cabinet meeting.. CM Chandrababu Naidu have seen 4 models.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X