• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భయంకరమైన నిజాలు: భూతల నరకం ఉ.కొరియా, ప్రపంచానికి తెలియని అక్కడి బతుకు?

|

ప్యోంగ్‌యాంగ్: భూతల స్వర్గం అంటూ చాలా ప్రాంతాల గురించి మాట్లాడుకుంటుంటాం. కానీ భూతల నరకం అంటూ ప్రస్తావించే ప్రాంతాలు చాలా తక్కువగా ఉంటాయి. అసలు ఆ పదం కూడా అంతగా వ్యాప్తిలో లేదు.

ఉత్తరకొరియాతో గండమే?: ముక్కలు చేస్తామని హెచ్చరిక.. పుతిన్ ఇలా!

ప్రపంచంలో భూతల నరకం అన్న పదానికి ఒక దేశాన్ని కేరాఫ్‌గా చెప్పుకోవచ్చు. పుట్టుకే బానిసత్వమైన చోట.. తరాలుగా అక్కడి జీవితాలు సంకెళ్లను మోస్తూనే ఉన్నాయి.

కిమ్ జాంగ్‌కు రొడ్రిగో హెచ్చరిక: బొమ్మలతో ఆటలా?, పిచ్చోడా.. నువ్వో..?

హిట్లర్‌ను మించిన ఆ నియంత పాలనలో.. మానవ హక్కులు అన్న పదానికి కూడా అక్కడ తావే లేదు. నచ్చినట్లు మాట్లాడటానికి, నచ్చింది తినడానికి, నచ్చిన దుస్తులు వేసుకోవడానికి, ఆఖరికి నచ్చిన హెయిర్ కట్ చేయించుకోవడానికి కూడా అక్కడి రూల్స్ ఒప్పుకోవు.

కిమ్ ధ్వంస రచన?: అమెరికాపై అణుదాడి తప్పదని ఉ.కొరియా సంచలన ప్రకటన

రాచరికంలో ప్రజలను రాచి రంపాన పెట్టడమంటే ఏంటో ఉత్తరకొరియా ప్రజల జీవితాలను చూస్తేనే అర్థమవుతుంది. ప్రపంచ సమస్యలన్నింటిని చర్చకు పెడితే.. మిగతా ప్రపంచం ఒకెత్తు.. ఉత్తరకొరియా ఒక్కటి ఒకెత్తు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో?:

ఏడవనందుకు కూడా శిక్షలు:

ఏడవనందుకు కూడా శిక్షలు:

ఉత్తరకొరియా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తండ్రి కిమ్ జాంగ్-Il చనిపోయిన సమయంలో కొన్ని వందల మంది ప్రజలు తీవ్రమైన శిక్షలను ఎదుర్కొన్నారు. కారణం.. 'సరిగా ఏడవకపోవడం'.

అవును.. సంతాప దినాల సందర్భంగా ఎవరైతే సరిగా ఏడవరో.. ఏడ్చినట్లు నటిస్తున్నారో.. వారందరికీ శిక్షలు పడ్డాయి. నెలల తరబడి వారిని లేబర్ క్యాంపుల్లో నిర్బంధించి.. వారి చేత వెట్టి చాకిరీ చేయించే శిక్షలు విధించారు. ప్రజలు సరిగా ఏడుస్తున్నారా?.. లేక ఏడ్చినట్లు నటిస్తున్నారా? అన్నది నిర్దారించడానికి కొన్ని ప్రత్యేక టీమ్స్‌ను కూడా ఆ సమయంలో ఏర్పాటు చేశారట.

  North Korea vs US : Donald Trump issued an Ultimatum To Kim Jong-un
  మానవ వ్యర్థాల షాపులు:

  మానవ వ్యర్థాల షాపులు:

  2010లో దక్షిణ కొరియా-ఉత్తరకొరియా మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న తర్వాత.. ఉత్తరకొరియాకు ఎరువుల సరఫరా ఆగిపోయింది. దక్షిణ కొరియా నుంచి ఎరువుల సరఫరా నిలిచిపోవడంతో.. అధ్యక్షుడు కిమ్ జాంగ్.. దేశంలోనే ఎరువులను తయారుచేసుకోవాలని నిర్ణయించాడు.

  ఇందుకోసం మానవ మలాన్నే ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నాడు. దేశంలోని ప్రతీ పౌరుడు లేదా కుటుంబం విధిగా తమ మలాన్ని ఎరువుల తయారీ కోసం ఇవ్వాల్సిందిగా నిబంధన తీసుకొచ్చాడు.

  దీనికోసం ప్రత్యేకంగా కొన్ని దుకాణాలు కూడా అక్కడ పుట్టుకొచ్చాయి. ఎవరైనా తమ మలాన్ని దేశావసరాల కోసం ఇవ్వకపోతే వారికి కఠిన శిక్షలు తప్పవు. అందుకే ఇక్కడ మలాన్ని దొంగిలించే ఘటనలు కూడా జరుగుుతంటాయి.

  హెయిర్ కట్స్:

  హెయిర్ కట్స్:

  తమకు నచ్చినట్లు హెయిర్ కట్స్ చేసుకోవడం ఉత్తరకొరియాలో నిషిద్దం. దేశాధ్యక్షుడు సూచించిన 15 రకాల హెయిర్ కట్స్‌కు మాత్రమే ఇక్కడ అనుమతి ఉంటుంది. అవి కాదని వేరే హెయిర్ కట్ చేయడానికి, చేయించుకోవడానికి ఇక్కడ ఎవరూ సాహసించరు.

  వితంతువులకు, వివాహితులకు, టీనేజర్లకు, వృద్దులకు ఇలా ఒక్కో ఏజ్ గ్రూపు వారికీ ఒక్కో తరహా హెయిర్ కట్స్ ఉంటాయి. విధిగా ఆ తరహా హెయిర్ కట్ చేయించుకోకపోతే.. వారికి తీవ్రమైన శిక్షలు తప్పవు.

  టైమ్ జోన్, క్యాలెండర్ రెండూ వేరు:

  టైమ్ జోన్, క్యాలెండర్ రెండూ వేరు:

  ఉత్తరకొరియాకు ప్రపంచంతో సంబంధం లేని టైమ్ జోన్, క్యాలెండర్ రెండూ ఉన్నాయి. జపనీస్ కంటే 30నిమిషాల ముందుకు వీరు సమయాన్ని మార్చుకున్నారు. అలాగే ప్రపంచం అంతటికీ ఇప్పుడు 2017సంవత్సరం నడుస్తుంటే ఉత్తరకొరియాలో మాత్రం 104వ సంవత్సరం నడుస్తోంది. మాజీ అధ్యక్షుడు కిమ్ జాంగ్-Il జయంతిని వీరు కొత్త సంవత్సరంగా పరిగణిస్తారు.

  నో ఇంటర్నెట్, నో మొబైల్స్,.. నథింగ్:

  నో ఇంటర్నెట్, నో మొబైల్స్,.. నథింగ్:

  ఇక్కడికి వెళ్లే పర్యాటకులు స్థానికులెవరితోను మాట్లాడకూడదు. ఇందుకోసం కొంతమంది పర్యవేక్షకులు ఉంటారు. ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ తిరగనివ్వరు. అంతేకాదు.. ఎయిర్ పోర్టులో దిగగానే తమ మొబైల్ ఫోన్లను అక్కడ ఇచ్చేయాలి. దేశంలోకి ఫోన్లను అనుమతించరు.

  ఇక దుస్తుల విషయంలోను ఆంక్షలు ఉంటాయి. ఇక్కడ జీన్స్ వేసుకోవడం నిషిద్దం. అలాగే ఇంటర్నెట్ కూడా కొంతమంది వీఐపీలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కార్లు కూడా కొంతమందికి మాత్రమే అనుమతిస్తారు.

  మూడే చానెల్స్:

  మూడే చానెల్స్:

  ఉత్తరకొరియా ప్రజలకు బాహ్యా ప్రపంచంతో ఎటువంటి సంబంధం ఉండదు. అసలు బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే అవకాశం వీరికి లేదు. కారణం సమాచార వ్యవస్థను కిమ్ జాంగ్ తన గుప్పిట్లో బంధించడమే. ఇక్కడ కేవలం మూడు న్యూస్ చానెల్స్ కు మాత్రమే అనుమతి ఉంది. అవి కూడా ప్రభుత్వం నిర్దారించిన వార్తలనే ప్రసారం చేస్తాయి. నిబంధనలు అతిక్రమిస్తే ఇక అంతే సంగతులు.

  పేదలను ఫోటోలు తీయడం,

  పేదలను ఫోటోలు తీయడం,

  బైబిల్, హాలీవుడ్ సినిమాలు నిషిద్దం:

  ఉత్తరకొరియాలోని పేదలను ఫోటోలు తీయడం నిషిద్దం. కాదని ఎవరైనా ఆ పనికి పూనుకుంటే.. జైలు శిక్షలు తప్పవు. పేదలను ఫోటోలు తీయడం తమ దేశ ప్రతిష్టకు మచ్చ తెచ్చే విషయమని వారు భావిస్తుంటారు. ఇక్కడ బైబిల్ చదివినా.. హాలీవుడ్ సినిమాలు చూసినా మరణశిక్షలు తప్పవు.

  క్షమాభిక్ష అన్న పదం ఉత్తరకొరియా చరిత్రలో లేదు. నిబంధనలు అతిక్రమిస్తే నిర్దాక్షిణ్యంగా శిక్షలు వేయడమే. అందుకే ఈ దేశంలో దాదాపు 3లక్షల మంది ప్రజలు జైళ్లలో బంధీలుగా ఉన్నారు.

  ఖైదీల మీద ప్రయోగాలు:

  ఖైదీల మీద ప్రయోగాలు:

  ఇక్కడ జైళ్లలో మగ్గుతున్నవారి జీవితాలు అత్యంత దుర్భరం. వారి మీద మెడికల్ ప్రయోగాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. వారి శరీరాలను ఎలాంటి అవసరాలకైనా వాడుకోవచ్చు. అలా కొన్ని వేల మంది ప్రజలు మెడికల్ ప్రయోగాలకు బలైపోతుంటారు. అలాగే బుద్ది మాంద్యం ఉన్న పిల్లలపై సైతం వైద్య ప్రయోగాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.

  ఐదేళ్లకొకసారి ఎన్నికలు:

  ఐదేళ్లకొకసారి ఎన్నికలు:

  చాలా దేశాల్లో లాగే ఉత్తరకొరియాలోను ఐదేళ్లకొకసారి ఎన్నికలు జరుగుతాయి. అయితే ఎన్నికల్లో మాత్రం ఒక్కరే నిలుచుంటారు. సదరు అభ్యర్థి గనుక నచ్చకపోతే.. ప్రజలు ఓటింగ్ సమయంలో వేరే అభ్యర్థి పేరు బహిరంగంగా చెప్పాలి. ఆ తర్వాత వాళ్లకు విధించే శిక్షలు మామూలుగా ఉండవు.

  ఇళ్లు బూడిద రంగులోనే, రేడియో ఆపవద్దు:

  ఇళ్లు బూడిద రంగులోనే, రేడియో ఆపవద్దు:

  ఉత్తరకొరియాలో ప్రతీ ఇల్లు బూడిద రంగులోనే ఉండాలన్న నిబంధన ఉంది. దాంతో పాటు ప్రతీ ఇంట్లోను కిమ్ జాంగ్ పాలకుల ఫోటోలు తప్పనిసరిగా ఉండాలి.

  డిసెంబరు 17న ఉత్తరకొరియా ప్రజలు ఎలాంటి వేడుకలు చేసుకోవద్దు. పుట్టినరోజు ఉన్నా సరే.. చేసుకోకూడదు. ఎందుకంటే.. ఆరోజు కిమ్ సంగ్ 2 చనిపోయిన రోజు.

  ఇక ఉత్తరకొరియా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక రేడియో ఛానెల్ నడుస్తుంటుంది. కాబట్టి ప్రతీ ఇంట్లోను విధిగా ఆ ఛానెల్ వార్తలను వినాలి. రేడియో ఎప్పుడూ ఆన్ లోనే ఉండాలన్న నిబంధన ఉంది. దాన్ని ఉల్లంఘిస్తే కఠిన శిక్షలే.

  మూడు తరాలకు జైలు శిక్షలు:

  మూడు తరాలకు జైలు శిక్షలు:

  ఉత్తరకొరియా విధించే శిక్షలు అత్యంత దారుణంగా ఉంటాయి. ఏ కుటుంబంలో అయిన ఒక వ్యక్తికి శిక్ష పడితే.. అతనితో పాటు అతని తర్వాతి రెండు తరాలు కూడా శిక్షను అనుభవించాలి. ఈవిధంగా కొన్ని తరాలు జైల్లోనే కనుమరుగవుతుంటాయి.

  స్కూల్స్ కూడా అంతే:

  స్కూల్స్ కూడా అంతే:

  ఉత్తరకొరియాలో ప్రపంచ చరిత్రను బోధించరు. కేవలం కిమ్ జాంగ్, కిమ్ జాంగ్-2ల పాఠాలను మాత్రమే బోధిస్తారు. విద్యార్థుల ఫీజు విషయంలోను విచిత్రమైన నిబంధనలున్నాయి. విద్యార్థి ఫీజు మాత్రమే కాదు.. పాఠశాలలో మౌలిక వసతులకు కూడా వీరే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. చాక్ పీసులకు, బోర్డులకు, బెంచ్ లకు ఇలా రకరకాల ఫీజులు వసూలు చేస్తారు.

  అంతేకాదు, వారంలో కొన్ని రోజులు పిల్లలతో పని కూడా చేయిస్తుంటారు. ఆ శ్రమ నుంచి తమ పిల్లలను కాపాడుకోవడానికి కొంతమంది తల్లిదండ్రులు టీచర్లకు లంచాలు కూడా ఇస్తుంటారు.

  నచ్చింది తినే వీల్లేదు,

  నచ్చింది తినే వీల్లేదు,

  ఏడు రోజులు పనిదినాలే:

  ప్రపంచంలో ఎక్కడైనా సరే.. వారంలో ఒకరోజు విశ్రాంతి దినంగా పరిగణిస్తారు. కానీ ఉత్తరకొరియాలో ఆ మాట చెల్లదు. ఇక్కడ ఆరు రోజులు కుటుంబం కోసం పనిచేస్తే.. ఒకరోజు దేశం కోసం వాలంటీర్ గా పనిచేయాలి. ఆవిధంగా ఇక్కడి ప్రజలు నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. అలాగే ఇక్కడ తిండి మీద కూడా దేశాధినేత ఆంక్షలు విధించినట్లు చెబుతారు. ఆయన సూచించిన ఆహార పదార్థాలను మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉంటాయి.

  English summary
  North Korea remains among the world’s most repressive countries. Under the Kim family’s rule, basic freedoms and access to needs have been severely restricted and continue to get frighteningly worse.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more