వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనశక్తి- కిడ్నాప్‌- ఓ ప్రశ్న

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ఃవిశాఖపట్నం జిల్లాలో కె. మాధురి అనే ఒక ప్రభుత్వ లేడీ డాక్టరు ఒకపేషెంట్‌ బంధువు నుంచి పదిహేను వందల రూపాయల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులుఅరెస్టు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పు కోసం చేరిన ఒకపేద మహిళకు సిజేరియన్‌ ఆపరేషన్‌ చేయడానికి మహిళా డాక్టర్‌ లంచం డిమాండ్‌ చేసింది. లంచం డబ్బులు తేవడంలో ఆలస్యమైనందుకు కోపగించుకుని ఆ గర్భిణీని చూడడానికి కూడా నిరాకరించింది.

పేషెంట్‌ కు ప్రాణాపాయం జరగవచ్చని బంధువులు ప్రాధేయపడ్డారు. ముందు ఆపరేషన్‌ చేస్తే డబ్బు రెండు రోజుల్లో ఇచ్చుకుంటామని బతిమాలారు. కానీ ఆమె డబ్బు చేతిలో పడేవరకు ఆపరేషన్‌ థియేటర్‌ లోకి వెళ్ళలేదు. ఒకపేద దేశంలో మంచి జీత భత్యాలు పొందుతున్న డాక్టర్లు ఇలా నిరుపేదలను లంచం డిమాండ్‌ చేయడం చిన్న నేరం కాదు. తోటి మహిళ చావుబతుకుల్లో ఉన్నా లంచం చేతిలో పడేవరకు ఆపరేషన్‌ చేయనన్న మహిళా డాక్టరుకు ఏ శిక్ష వేసినా చిన్నదే అవుతుంది. కనీసం పదేళ్ళ జైలు శిక్షపడేలా చట్టం చేయాల్సిన అవసరం ఉంది.

లంచాన్ని, అవినీతిని మన సమాజం తీవ్రంగా పరిగణించడం లేదు. క్షీణవిలువలకు ఇది నిదర్శనం. అదనపు సంపాదన లేని ప్రభుత్వ ఉద్యోగులను ఇంట్లో వాళ్ళే కాదు బంధువులు కూడాఅసమర్ధులుగా చూస్తున్నారంటే పరిస్ధితులు ఎంత దారుణంగా మారాయోఅర్ధం చేసుకోవచ్చు. మన రాష్ట్రంలో ఒక చిన్న సబ్‌ రిజిస్ట్రారు అక్రమంగా ఐదారు కోట్లు సంపాదిస్తాడు. ఒక వెల్ఫేర్‌ ఆఫీసరు ఏకంగా నగరంలో సినిమా థియేటర్‌ కొనుక్కునే స్ధాయికి ఎదుగుతాడు. దీనిమీద జనంలో కూడాపెద్దగా నెగిటివ్‌ రెస్పాన్స్‌ ఉండదు. ఎన్నికల సమయంలో డబ్బు తీసుకునే ఓటరు దగ్గర నుంచే అవినీతి మొదలవుతోందని ప్రజా ప్రతినిధులుఅంటున్నారు.

హైదరాబాద్‌ ప్రశాసన్‌ నగర్‌ లో ఐఎఎస్‌ అధికారులు సొంతంగా కట్టుకున్న బంగళాలను ఒకసారి చూసిరండి. వాళ్ళు జీతాలతోనే అటువంటి ఇళ్ళ కట్టుకోవాలంటే కనీసం 200 ఏళ్ళ పాటుసర్వీసులో ఉండాలి. రాష్ట్రంలో అవినీతి అధికారుల గుండెల్లోరైళ్ళు పరుగెత్తించిన గౌతం కుమార్‌ అనే సీనియర్‌ ఐపిఎస్‌ అధికారినివిజిలెన్స్‌ కమిషనర్‌ పోస్టు నుంచి తప్పించి అప్రధాన పోస్టుకి బదిలీ చేయడం తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధి ఏ పాటిదో తెలియజేస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X