వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుల వాటాలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉత్తర అమెరికాలోని హైటెక్‌ ఉద్యోగావకాశాల ప్రయోజనాన్ని భారత్‌ పొందే అవకాశాలున్నాయి. ఒక దశాబ్ద కాలంలో అమెరికాలోని 60 లక్షల ఉద్యోగాలు విదేశీయులు చేజిక్కించుకునే అవకాశాలున్నాయి. ఈ అవకాశాల వల్ల భారత్‌ ఎక్కువగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

వ్యయాన్ని తగ్గించుకోవడానికి వచ్చే దశాబ్దకాలంలో ఇండియా, ఇతర దేశాల హైటెక్‌ సావీ ఇంగ్లీష్‌ స్పీకింగ్‌ యువతకు 60 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి అమెరికా కంపెనీలు సిద్ధపడుతున్నాయని గోల్డ్‌మాన్‌ సాచ్స్‌ గ్రూప్‌ ఇన్‌కార్పోరేషన్‌ ఇటీవల విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది. తక్కువ వేతనాలు గల ఇండియా వంటి దేశాలకు ఉత్తర అమెరికా టెక్నాలజీ ఉద్యోగాలు తరలిపోతాయని ఇండో- కెనడా ఛేంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రెసిడెంట్‌ ప్రదీప్‌ సూద్‌ అన్నారు. ఇండియా వంటి దేశాల్లోని హెటెక్‌ నిపుణులకు ఆ ఉద్యోగాలు ఇవ్వడం వల్ల మూడు వంతుల వ్యయాన్ని కంపెనీలు తగ్గించుకోగలుగుతాయి.

భారతీయ నిపుణులు అమెరికా నిపుణులు పొందే దానిలో పదో వంతు వేతనాలు మాత్రమే పొందుతారు. అంతేకాకుండా అమెరికాతో పోలిస్తే భారత్‌ యేటా 67 శాతం అధికంగా ఇంజనీర్లను, కంప్యూటర్‌ సైంటిస్టులను తయారు చేస్తోందని సూద్‌ చెప్పారు. తక్కువ వేతనాలు, నైపుణ్యం గల వర్క్‌ఫోర్స్‌ దృష్ట్యా ఈ అవకాశాలను భారత్‌ ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు.

భారత్‌లోని తక్కువ వ్యయం నుంచి లబ్ధి పొందే అవకాశాలను మైక్రోసాఫ్ట్‌, ఇంటెల్‌, అక్సెంచర్‌ లిమిటెడ్‌, జిఎం మోటార్స్‌ వంటి బహుళజాతి సంస్థలు వాడుకోవడం ప్రారంభించాయి. మైక్రోసాఫ్ట్‌ భారత్‌లో 250 మందిని నియోగించుకుంది. ఈ సంఖ్య 2005 నాటికి 500కు చేరుకోగలదని భావిస్తున్నారు. ఇంటెల్‌ దేశంలోని అతి పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఒకటైన సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ ఇండియన్‌ కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్‌లో 20 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఇంటెల్‌ భారత్‌లో వేయి మందిని నియమించుకుంది. అది బెంగుళూర్‌లో డిజైన్‌ సెంటర్‌ను నెలకొల్పింది. నాన్‌ యుయస్‌ ఇంటెల్‌ డిజైన్‌ సెంటర్‌లలో ఇదే పెద్దది. ఆటో మేకర్‌లో పేరెన్నిక గన్న జనరల్‌ మోటార్స్‌ కార్పోరేషన్‌ బెంగుళూర్‌లో వంది రిసెర్చర్స్‌ను నియమించుకునే ఆలోచనలో ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X