వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్‌ పై ప్రవాసాంధ్రుల స్పందన

By Staff
|
Google Oneindia TeluguNews

సైబరాబాద్‌ యువకుల్లో ముఖ్యంగా ఐటి తరంలో చాలా మందికి మేడే గురించి పెద్దగా తెలియదనిపించింది. వివిధ రాజకీయ పక్షాలు, సంఘాలు నిర్వహించిన కార్యక్రమాల్లో కూడా యువతరం జాడలేదు. హోలీనాడు, వాలెంటెన్స్‌డే నాడు నగర వీధుల్లో వొళ్లు మరచి చిందులు తొక్కిన యువతీయువకులు మేడే నాడు మాత్రం హాలిడేను ఎంజాయ్‌ చేసే మూడ్‌లో బిజీఅయిపోయారు. మేడే గురించి కొందరు యువకులను ప్రశ్నించినప్పుడు, నిజాయితీగానే దాని గురించి తమకు తెలియదని ఒప్పుకున్నారు. కార్మికుల కోసం ఇలాంటి రోజు ఒకటి వుండటం సబబేనని నవీన్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అభిప్రాయపడ్డారు. కంప్యూటర్‌ సంస్థలో పనిచేస్తున్న మరో ఉద్యోగి గీతాంజలి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు పెద్దఎత్తున వేతనాలు ఇచ్చే సంస్థలు కార్మికుల విషయంలో మాత్రం అన్యాయం చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

జీవితం, జీవితంలోని సమస్యలు, భవిషత్తు, భవిషత్‌మీద భయమూ రోజురోజుకూ అధికమైపోతున్న పరిస్ధితుల్లో... సంపన్న దేశాలైన జర్మనీ, బ్రిటన్‌, అమెరికాలలోసైతం కార్మికులు వేలాదిగా రోడ్ల మీదకు వచ్చి పాలకులకు వ్యతిరేకంగా వీధి పోరాటాలకు సిద్దమైన నేపద్యంలో.... కడుపుకింత కూడు దొరకని దౌర్భాగ్యులు మొత్తం ప్రజలలో మూడొంతులున్న మనదేశంలో, రైతులు, కార్మికులు రోజులకు పదుల సంఖ్యలో ఆకలి చావులకు, ఆత్మహత్యలకూ బలవుతున్న మనరాష్ట్రంలో శక్తులు నిండి, నెత్తురు మండే యువతరం మేడేపై ఇంతటి నిరాసక్తతను ప్రదర్శించటమేమిటి? మేడే గురించి పట్టించుకోకపోవటమేమిటి? అస్సలు అది మనకు సంబంధించిన విషయం కాదన్నట్టుప్రవర్తించటమేమిటి?...

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X