వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హాట్‌ కేక్‌ లాహార్డ్‌ వేర్‌ పార్కు

By Staff
|
Google Oneindia TeluguNews

ఒక గ్రహంనుంచి వేరొక గ్రహం 120 లేదా 60 డిగ్రీల దూరంలోవుంటే శుభప్రదం. దీనిని కోణ దృష్టి లేదాట్రైన్‌ అంటాము. రెండు గ్రహాల మధ్యదూరం 90, 135, 150,180 డిగ్రీలు వుంటే ప్రతికూలదృష్టి ఏర్పడి అశుభ ఫలితాలు వస్తాయి. రెండుగ్రహాలు ఒకే రాశిలో దగ్గరగా వుంటే దానినిసంయోగం లేదా కన్‌ జంక్షన్‌ అంటాము. రవి, చంద్ర, బుధ,గురు, శుక్రులలో ఏ రెండు గ్రహాలు సంయోగంచెందినా అది శుభప్రదమే. ఇంద్ర లేదాయురేనస్‌, కుజ, శనులు సంయోగం చెందినా, ఈగ్రహాలతో మిగిలిన ఏ గ్రహాలైనా సంయోగంచెందినా అది అశుభం.

ఒకరి జాతకంలోనిగ్రహానికి 120 లేదా 60 డిగ్రీల దూరంలో వేరొకరి జాతకంలోగ్రహం వుంటే ఆ దృష్టి సఖ్యతకు, ఆకర్షణకు దారితీస్తుంది.వధువు జాతకంలోని గ్రహం వరుని జాతకంలోనిగ్రహంతో 90,135,150,180 డిగ్రీల దూరంలో వుంటేఇద్దరి మధ్య సఖ్యత, సామరస్యంలోపిస్తుంది. ఉభయుల జాతకాలలోను వున్నగ్రహాలకు పరస్పరం శుభదృష్టుల సంఖ్యఅధికంగా వుంటే ఇద్దరి మధ్య పొంతనకుదురుతుంది. అశుభ దృష్టుల సంఖ్య అధికమైతే అభిప్రాయ బేధాలు,కీచులాటలు, భిన్న స్వభావాలు, ఘర్షణలకు దారితీసేప్రమాదం వుంటుంది.

వివాహానికి కీలకగ్రహాలైన చంద్ర, శుక్ర, కుజ, సూర్య గ్రహాల మధ్యవధూవరుల జాతకంలో శుభదృష్టులు వుండడంఎంతైనా అవసరం.

ఉభయుల జాతకాలను పరిశీలించి ఒకరిజాతకంలోని ప్రతిగ్రహానికి, మరొకరి జాతకంలోని ఒకొక్క గ్రహానికి మధ్యఅనుకూల దృష్టి వున్నదా లేక ప్రతికూల దృష్టివున్నదా అని గుర్తించాలి. అనుకూల దృష్టులుఅధికంగా వుంటే వధూవరుల మధ్య సఖ్యతబాగుంటుంది అని గ్రహించాలి. ప్రతికూల దృష్టులుఅధికంగా వుంటే ఇద్దరికీ సరిపడదనే నిర్థారణకురావాలి.

గ్రహ దృష్టులు-వివరాలుః

కేంద్ర దృష్టి, కోణదృష్టి, సంయోగం, సమసప్తకం, షష్టాష్టకం అనేమాటలు జ్యోతిష పండితుల నుంచి మనం తరచువింటూ వుంటాం. ఈ దృష్టులు ఏలా ఏర్పడతాయోపరిశీలిద్దాం.

1. సంయోగంః ఉభయగ్రహాలు ఒకే రాశిలో, దగ్గర డిగ్రీలలో వుంటే ఆ రెండుగ్రహాలు సంయోగం చెందాయని గ్రహించాలి.సూర్య, చంద్ర, గురు, శుక్ర, బుధులలో ఏ గ్రహాలైనాఒకే రాశిలో వుంటే ఆ సంయోగం చాలా అనుకూలం.ఇంద్ర, కుజ, శనులతో సంయోగం ప్రతికూలం.వరుణ, యమ, రాహు, కేతువులతో సంయోగంమధ్యమం.

2. సమసప్తకంః ఒక జాతకంలోని లగ్న రాశికిగాని, రవి చంద్రులకు గానీ రెండవ జాతకంలోని రవిచంద్రులు 180 డిగ్రీలలో వుంటే (ఏడవ లేదాఎదురుగా వున్నా రాశిలో) వుంటే అనుకూలం.గురు,శుక్ర,బుధులు సమసప్తకంలో వుంటేమధ్యమం. ఇంద్ర, వరుణ, యమ, శని,కుజ, రాహు, కేతువులు 180 డిగ్రీల దూరంలోవుంటే వ్యతిరేకం.

3. కోణ స్థితిః ఒకరి జాతకంలోని లగ్నంకానీ, మరేదైనా గ్రహం కానీ రెండవ జాతకంలోనిగ్రహాలతో 120 డిగ్రీల దూరంలో వుంటే దానిని కోణ స్థితిఅంటారు. ఇది చాలా మంచిది. ఒకరి రాశి నుంచి రెండవ జాతకంలోని రాశి 3,5,9,11వ స్థానం అయినప్పుడు ఈ స్థితి ఏర్పడుతుంది.

4. కేంద్ర స్థితిః ఒకరి జాతకంలోని లగ్నం లేదాగ్రహాలకు, మరొకరి జాతకంలోని గ్రహాలకు మధ్య 90, 270డిగ్రీల దూరం వుంటే దీనిని కేంద్ర స్థితి అంటాము.ఇది చాలా ప్రతికూలం. ఒకరి రాశిచక్రంలోని గ్రహాలనుంచి 4,10 స్థానాలలో మరొకరి రాశిచక్రంలోని గ్రహాలు వున్నప్పుడు ఈ స్థితి సంభవం.

5. షష్టాష్టకంః ఒకరి జాతకంలోనిలగ్నానికి, గ్రహాలకు రెండవ జాతకంలోనిగ్రహాలకు సుమారు 150 డిగ్రీల దూరం వుంటేదానిని షష్టాష్టకం అంటాము. ఇది ప్రతికూలం. ఒకరిగ్రహాల నుంచి మరొకరి గ్రహాలు 6 లేదా 8 వస్థానాలలో వున్నప్పుడు ఈ దృష్టి ఏర్పడుతుంది.ఉభయుల జాతకాలలోని గ్రహాలు పరస్పరం సుమారు 45,135, 210,225,315డిగ్రీల దూరంలో వుంటే ప్రతికూలంగా గ్రహించాలి.

జాతక చక్రంరూపొందించుకున్న తరువాత తొలుత వారితత్వాన్ని, స్వభావాన్ని గ్రహాలు వున్న రాశులను బట్టిగ్రహించడం ద్వారా ఎదుటి వ్యక్తి గురించి కొంతవరకేఅవగాహనకు రాగలుగుతాం. అయితే ఉభయుల జాతకాల మధ్య పొంతన ఏవిధంగా వుంటుందని మరింత లోతుగాపరిశీలించేందుకు ఈ దృష్టులు ఉపయోగ పడతాయి.

వివాహానికి కీలకమైన స్థానం సప్తమ (ఏడవ)స్థానం. అసలు ఈ సప్తమ స్థానం ఎలా వుంటే ఎటువంటిభాగస్వామి లభిస్తాడు. సప్తమ స్థానంలో వున్నగ్రహాలను, వాటికి ఏర్పడిన దృష్టులను బట్టిభాగస్వామి గురించి ఎలా తెలుసుకొనేందుకు వీలుకుదురుతుందనే విషయాలు వచ్చే వ్యాసంలోపరిశీలిద్దాం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X