• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దద్దోజనంహేయం! దున్నపోతు దివ్యం!!

By Staff
|

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌)కు ఇచ్చే సీట్ల సంఖ్య విషయంలో కాంగ్రెస్‌ మెలిక పెట్టింది. పొత్తు ఖరారైనప్పటికీ టిఆర్‌ఎస్‌కు ఇచ్చే సీట్ల సంఖ్య విషయంలో కాంగ్రెస్‌ పెదవి విప్పలేదు. అయితే తమకు 42 శాసనసభా స్థానాలు, 6 లోక్‌సభ స్థానాలు ఇవ్వడానికి కాంగ్రెస్‌ అంగీకరించిందని టిఆర్‌ఎస్‌ ప్రకటించింది. దీంతో కాంగ్రెస్‌లో అలజడి మొదలైంది. టిఆర్‌ఎస్‌కు ఇచ్చే సీట్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉందంటూ కొందరు నాయకులు పార్టీలో విమర్శలు చేస్తూ వచ్చారు. ఫలితంగా టిఆర్‌ఎస్‌కు ఇచ్చే సీట్ల సంఖ్యను ఖరారు చేసేందుకు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) మాజీ అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ రావు నేతృత్వంలో కాంగ్రెస్‌ ఒక ఉప సంఘాన్ని నియమించింది.

ఆ ఉపసంఘం టిఆర్‌ఎస్‌కు ఇవ్వదగిన స్థానాలను గుర్తించింది. ఉప సంఘం టిఆర్‌ఎస్‌కు ఇచ్చే 32 శాసనసభా స్థానాలను గుర్తించింది. టిఆర్‌ఎస్‌కు 35 శాసనసభా స్థానాలకు, నాలుగు లోక్‌సభ స్థానాలకు మించి ఇవ్వకూడదనేది ఉప సంఘం అభిప్రాయం. దీనికి తోడు ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా కొంత మంది నాయకులు టిఆర్‌ఎస్‌కు ఇచ్చే స్థానాలపై ఫిర్యాదు చేశారు. సిట్టింగ్‌ స్థానాలను వదులుకోకూడదని సత్యనారాయణ రావు నేతృత్వంలోని ఉప సంఘం అంటున్నట్లు సమాచారం. 42 శాసనసభా స్థానాలు, ఆరు లోక్‌సభ స్థానాలు ఇవ్వదగినంత బలం టిఆర్‌ఎస్‌కు లేదని సత్యనారాయణ రావు అంటున్నారు. అన్ని స్థానాల్లో నిలబెట్టడానికి టిఆర్‌ఎస్‌కు అభ్యర్థులు కూడా లేరని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఓట్లు చీలిపోకుండా చూడడానికి టిఆర్‌ఎస్‌తో పొత్తు ఉండాలనే తాను కోరుకుంటున్నానని, అయితే అంత పెద్ద మొత్తంలో సీట్లు ఇవ్వడానికి అంగీకరించడం సరికాదని ఆయన అంటున్నారు.

వామపక్షాలతో సీట్ల సర్దుబాటుపై ఏర్పడిన ప్రతిష్టంభనకు తోడు టిఆర్‌ఎస్‌కు ఇచ్చే సీట్ల విషయంలోనూ వివాదం మొదలు కావడంతో కాంగ్రెస్‌ ఇరకాటంలో పడింది. ఉభయ కమ్యూనిస్టులకు కలిపి 16 సీట్లకు మించి ఇవ్వబోమని కాంగ్రెస్‌ ప్రకటించింది. దీంతో సిపిఐ, సిపిఎంలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సిపిఎం ఏకంగా తన అభ్యర్థుల జాబితానే ప్రకటించింది. సీట్ల సంఖ్యతో పాటు ఖమ్మం, మిర్యాలగుడా లోక్‌సభ స్థానాలపై కాంగ్రెస్‌తో అవి గొడవ పడుతున్నాయి. ఖమ్మం సీటు విషయంలో ఉభయ కమ్యూనిస్టుల మధ్య వివాదం నడుస్తోంది. ఖమ్మం నుంచి తాము పోటీ చేయడం

ఖాయమని సిపిఐ ప్రకటించింది. ఈ సీటుకు సిపిఎం ఇప్పటికే ఖమ్మం సీటుకు అభ్యర్థిని ఖరారు చేసింది.

తెలుగుదేశం, బిజెపిల మధ్య సీట్ల సర్దుబాటు సజావుగా జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు గొడవలు ఎక్కడికి దారి తీస్తాయనేది చెప్పడం కష్టంగానే ఉంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more