• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆంధ్రరైతుల చలో ఆఫ్రికా

By Staff
|

భారతక్రికెట్‌ పరిస్థితి చాలా దిగజారింది.న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ జాన్‌రైట్‌కోచ్‌గా పదవీ బాధ్యతలుచేపట్టినప్పటి దుస్థితికిచేరుకున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.పాకిస్థాన్‌పై ఆరు వన్డేల సిరీస్‌ను 2-4తేడాతో చేజార్చుకున్న తర్వాతభారత జట్టు బలహీనతలు మరింతగాబయటపడ్డాయి. జట్టు సభ్యుల మధ్యసమన్వయం లేకపోవడం,హేమాహేమీలనిపించుకున్న బ్యాట్స్‌మెన్‌అవసరం వచ్చినప్పుడు పస లేని ఆటప్రదర్శించడం, బౌలర్ల వైఫల్యంపాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోకొట్టొచ్చినట్లు బయటపడ్డాయి.జాన్‌రైట్‌ కోచ్‌ పదవిని చేపట్టి నాలుగున్నరఏళ్ల కాలమైంది. ఆయన కోచ్‌గా పదవీబాధ్యతల నుంచి తప్పించుకున్నారు.ఆయన కోచ్‌గా బాధ్యతలు చేపట్టినతర్వాత పలువురు కొత్తవాళ్లుజట్టులోకి వచ్చారు. జాన్‌ రైట్‌కు ఏమాత్రం సంతృప్తిని మిగిలించే పనినిభారత జట్టు సభ్యులుచేయలేకపోయారు.నిరాశాపూరితమైన వీడ్కోలును ఆయనఅందుకోవాల్సి వచ్చింది. ఆయనకు వీడ్కోలుపలకడానికి ఏర్పాటయిన కార్యక్రమంచాలా నిరాశాపూరితంగా జరిగింది. కెప్టెన్‌సౌరబ్‌ గంగూలీని ఈ కార్యక్రమానికిఆహ్వానించలేదు. ఆయన ఆటలో ఎంతగావిఫలమైన పిలవాల్సిన బాధ్యతమాత్రం ఉంది.వీరేంద్రసెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్‌, మహ్మద్‌కైఫ్‌, హర్బజన్‌ సింగ్‌లాంటివారినిపట్టుబట్టి గంగూలీ జట్టులోకి తీసుకున్నాడు.వారు కూడా గుంగూలీ గైర్హాజర్‌పైకార్యక్రమంలో ఒక్క మాటామాట్లాడకపోవడం శోచనీయం. గంగూలీవిషయమై మాట్లాడడానికి ప్రస్తుతకెప్టెన్‌ రాహుల్‌ ద్రావిడ్‌ పెదవివిప్పలేదు. రైట్‌కు 60 వేల రూపాయలుపెట్టి డిన్నర్‌ సెట్‌ ఒక్కటిబహూకరించారు. పాక్‌పై సిరీస్‌ను గెల్చిదాన్ని రైట్‌కు కానుకగా ఇచ్చి వుంటేరైట్‌కు మరిచిపోని జ్ఞాపకంగా మిగిలివుండేది. ఆ స్ఫూర్తిని భారత జట్టుప్రదర్శించలేకపోయింది.ఐసిసిరేటింగ్‌లో భారత్‌ కిందికి దిగజారింది.ఐసిసి రేటింగ్‌లో 97 పాయింట్లకు భారత్‌దిగజారింది. 2002లో ఈ రేటింగ్‌ ఇవ్వడంప్రారంభమైంది. అప్పటి నుంచి ఇంతతక్కువ పాయింట్లకు రేటింగ్‌లో భారత్‌ ఎప్పుడూదిగజారలేదు. అయితే ఎనిమిదో స్థానంలోభారత్‌కు చోటు దక్కింది. భారత్‌కుదిగువగా ఉన్న జట్లు జింబాబ్వే, కెన్యా,బంగ్లాదేశ్‌. అంటే భారత్‌ ఏ స్థాయిలో ఉందోఅర్థం చేసుకోవచ్చు.సచిన్‌టెండూల్కర్‌ సిరీస్‌లో చాలా నిరాశపరిచాడు.అతని స్థానం కూడా పదో స్థానం నుంచి13వ స్థానానికి దిగజారింది. బౌలర్లలోమొదటి 20 స్థానాల్లో హర్బజన్‌ ఒక్కడే చోటుచేసుకున్నాడు. ఒకప్పుడు టాప్‌లో ఉన్నహర్బజన్‌కు ఇప్పుడు 16వ స్థానందక్కింది. రాహుల్‌ ద్రావిడ్‌ 13 స్థానంనుంచి ఆరవ స్థానానికి ఎగబాకాడు.ఇదొక్కటే కొంత ఓదార్పు. ఇదే సమయంలోపాకిస్థాన్‌ జట్టు, జట్టు సభ్యులు తమస్థానాలను పెంచుకున్నారు.భారతజట్టు కోచ్‌గా పదవీ విరమణ చేసిన రైట్‌తన అసంతృప్తినేం దాచుకోలేదు.భారత జట్టు మరింత నిలకడైన ఆటతీరును ప్రదర్శించాల్సి ఉన్నదనేదిఆయన అభిప్రాయం. వన్డేల్లో భారత్‌పటిష్టమైన ఆటతీరునుప్రదర్శించలేకపోతున్నదని ఆయనఅంటున్నారు.ఇదిలావుంటే, తనపై విధించిన నిషేధంపైగంగూలీ పెట్టుకున్న అపీల్‌నుఅంతర్జాతీయ క్రికెట్‌ మండలి ( ఐసిసి)తిరస్కరించింది. మందకొడి బౌలింగ్‌కుగాను గంగూలీపై ఐసిసి ఆరు మ్యాచ్‌లనిషేధం విధించింది. ప్రస్తుతం గంగూలీకెరీర్‌పై నీలినడలు అలుముకున్నాయి.గంగూలీ ఏనాడు కూడా తన ఆటతీరునుమెరుగుపరుచుకోవడానికిప్రయత్నించలేదు. భారత జట్టుకునాయకత్వం వహించిన అందరిలోకిమెరుగైన కెప్టెన్‌గా పేరుతెచ్చుకున్నప్పటికీ గంగూలీభవిష్యత్తుపై చీకట్లు దట్టంగాకమ్ముకోవడమే విషాదకరం.గంగూలీ వ్యక్తిగత లోపాలే ఇందుకుకారణంగా చెప్పాలి.ప్రస్తుతస్థితిలో భారత క్రికెట్‌ జట్టు కోలుకోవడంఅంత సులభమేమీ కాదు. రాజకీయాలుపక్కన పెట్టి, జట్టు సభ్యులు వ్యక్తిగతరికార్డుల కోసం కాకుండా జట్టు విజయం కోసంఆడే స్ఫూర్తిని ప్రదర్శించినప్పుడేభవిష్యత్తు ఆశావహంగా ఉంటుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more