వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్పులతో దశ తిరుగుతుందా?

By Staff
|
Google Oneindia TeluguNews

వధూవరులమధ్య కానీ, ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ వారిజాతకాల ఆధారంగా పొంతన కుదురుతుందా?లేదా?అనేవిషయాన్ని నిర్దారించే అవకాశం వుంది. వివాహానికిముందు జాతకాలు చూడడం అనవాయితీ.అయితే వ్యాపారంలో, ఉద్యోగాలలో భాగస్వామ్యంకుదురుతుందా? అనే విషయాన్ని కూడా ఈ రోజుల్లోజాతకాల ద్వారా నిర్థారిస్తున్నారు. ఉదాహరణకు మనరాశితో సరిపడని రాశికి చెందిన వారిని వ్యాపారభాగస్వామిగా తీసుకున్నాం అనుకోండి. వారి కారణంగాకష్ట నష్టాలు ఎదురయ్యే అవకాశం వుంది.

అదే విధంగాఒక సంస్థలో కీలకమైన ఉద్యోగంలో ఒక వ్యక్తినినియమించేటప్పుడు అతని జాతకాన్నిపరిశీలించి మరీ ఉద్యోగంలోకి తీసుకోవడంకూడా ఈ రోజుల్లో జరుగుతున్నది. జాతకం ద్వారాలేక వారి జన్మ రాశి ద్వారా ఆ వ్యక్తి స్వభావాన్ని,వైఖరిని కొంత వరకు గ్రహించే అవకాశంవుంటుంది. అప్పగించిన బాధ్యతలనుఎంత వరకు సమర్థవంతంగా నిర్వర్తించగలడు?పని పట్ల అంకిత భావం వున్నదా?లేదా?అనే అంశాలనుజాతకం ద్వారా పూర్తిగా, రాశి ద్వారా కొంత వరకుతెలుసుకోవచ్చు. గ్లోబలేజేషన్‌పుణ్యమా అని సంబంధాల విస్తృతి అనూహ్యంగాపెరిగిపోతున్న ఈ రోజుల్లో జాతకం ద్వారా వ్యక్తిగురించి తెలుసుకొని, వారిని ఉద్యోగం లోకితీసుకోవడం లేదా వ్యాపార భాగస్వామిగా చేసుకోవడంబహుళప్రచారంలో వుంది.

నక్షత్రంఆధారంగా మీది ఏ రాశి అనే విషయంతెలుసుకోవచ్చు. అలా కాని పక్షంలో పుట్టినతేదీ అధారంగా మీ సూర్య రాశినితెలుసుకోవచ్చు. జాతకం వున్న వారిసంగతి సరేసరి. వారిది ఏ రాశి?సూర్యుడు ఏ రాశిలోవున్నాడు? లగ్నం ఏరాశిలో వున్నది? అనే విషయాలుజాతకం ద్వారా ఇట్టే తెలిసి పోతాయి. ఇంత వరకుబాగానే వుంది. మొత్తం 12 రాశులలో ఏ రాశి వారికిఏ రాశివారితో పొంతన కుదురుతుంది?ఏ రాశి వారితోసరిపడదు? ఏరాశి వారితో మధ్యమంగా వుంటుందిఅనే విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

మేషరాశిః
అనుకూలరాశులుః సింహం, ధనుస్సు, మేషం, మిథునంరాశుల వారు.
మధ్యస్థంగావుండే రాశులుః తుల, వృషభ రాశుల వారు.
ప్రతికూలరాశులుః కర్కాటక, మకర, కన్య, మీన, కుంభరాశుల వారు.

వృషభ రాశిః
అనుకూలరాశులుః కన్య, మకర, వృషభ, కర్కాటక మీనరాశుల వారు.
మధ్యస్థంగావుండే రాశులుః వృశ్చిక, మిధున రాశుల వారు.
ప్రతికూలరాశులుః మేష, సింహ, కుంభ, తుల,ధనుస్సు రాశుల వారు

మిథున రాశిః
అనుకూలరాశులుః మేష, మిథున, సింహ, తుల,కుంభ రాశుల వారు.
మధ్యస్థంగావుండే రాశులుః కర్కాటక, ధనుస్సు రాశుల వారు.
ప్రతికూలరాశులుః వృషభ, కన్య, వృశ్చిక, మకర, మీనరాశుల వారు.

కర్కాటక రాశిః
అనుకూలరాశులుః వృషభ, కర్కాటక, కన్య, వృశ్చిక, మీనరాశుల వారు.
మధ్యస్థంగావుండే రాశులుః సింహ, మకర రాశుల వారు.
ప్రతికూలరాశులుః మేష, మిధున, తుల, ధనుస్సు,కుంభ రాశుల
వారు.

సింహ రాశిః
అనుకూలరాశులుః మేష, సింహ, మిథున, తుల,ధనుస్సు రాశుల వారు.
మధ్యస్థంగావుండే రాశులుః కన్య, కుంభ రాశుల వారు.
ప్రతికూలరాశులుః వృషభ, కర్కాటక, వృశ్చిక, మకర, మీనరాశుల వారు.

కన్యా రాశిః
అనుకూలరాశులుః వృషభ, కర్కాటక, కన్య, వృశ్చిక, మకరరాశుల వారు.
మధ్యస్థంగావుండే రాశులుః తుల, మీన రాశుల వారు.
ప్రతికూలరాశులుః మేష, మిథున, సింహ, ధనుస్సు,కుంభ రాశుల వారు.
తులా రాశిః
అనుకూలరాశులుః మిధున, సింహ, తుల, ధనుస్సు,కుంభరాశుల వారు.
మధ్యస్థంగావుండే రాశులుః మేష, వృశ్చిక రాశుల వారు.
ప్రతికూలరాశులుః వృషభ, కర్కాటక, కన్య, మకర, మీనరాశుల వారు.

వృశ్చిక రాశిః
అనుకూలరాశులుః కర్కాటక, కన్య, వృశ్చిక, మకర, మీనరాశుల వారు.
మధ్యస్థంగావుండే రాశులుః వృషభ, ధనూ రాశుల వారు.
ప్రతికూలరాశులుః మేష, మిధున, సింహ, తుల,కుంభ రాశుల వారు.

ధనుస్సు రాశిః
అనుకూలరాశులుః మేష, సింహ, తుల, ధనుస్సు,కుంభరాశుల వారు.
మధ్యస్థంగావుండే రాశులుః మిధున, మకర రాశుల వారు.
ప్రతికూలరాశులుః వృషభ, కర్కాటక, కన్‌, వృశ్చిక, మీనరాశుల వారు.

మకర రాశిః
అనుకూలరాశులుః వృషభ, కన్య, వృశ్చిక, మకర, మీనరాశుల వారు.
మధ్యస్థంగావుండే రాశులుః కర్కాటక, కుంభ రాశుల వారు.
ప్రతికూలరాశులుఃమేష, మిధున, సింహ, తులధనుస్సు రాశుల వారు.

కుంభరాశిః
అనుకూలరాశులుః మేష, మిధున, తుల, ధను,కుంభ రాశుల వారు.
మధ్యస్థంగావుండే రాశులుః సింహ, మీన రాశుల వారు.
ప్రతికూలరాశులుః వృషభ, కర్కాటక, కన్య, వృశ్చిక, మకరరాశుల వారు.

మీన రాశిః
అనుకూలరాశులుః వృషభ, కర్కాటక, వృశ్చిక, మకర, మీనరాశుల వారు.
మధ్యస్థంగావుండే రాశులుః మేష, కన్యా రాశుల వారు.
ప్రతికూలరాశులుః మిధున, సింహ, తుల, ధనుస్సు,కుంభ రాశుల వారు.

ఉదాహరణః మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 20 మధ్య జన్మించినవారు, అశ్వని, భరణి, కృత్తిక మొదటి పాదంలోజన్మించిన వారిది మేష రాశి. ఈ రాశిలోజన్మించిన వారికి మేష, మిధున, సింహ,ధనుస్సు, కుంభ రాశులలో జన్మించిన వారితోసఖ్యత బాగా కుదురుతుంది. అదే విధంగావృషభ, తులా రాశులకు చెందిన వారితోమధ్యస్థంగా వుంటుంది. ఇక కర్కాటక, కన్య,మకర, మీన రాశుల వారితో సరిపడదు.

వధూవరులపొంతన విషయంలో ఈ విధంగా రాశుల మధ్యపొంతనతో పాటు ఇంకా పలు విషయాలనుసరిచూసుకున్న తరువాత వారి మధ్యసఖ్యత ఎంతవరకు వుంటుందో నిర్ధారించే వీలుంటుంది.మన భాగస్వామి లేదా పై అధికారులు, మనసహోద్యోగులు, సిబ్బంది వైఖరిని, స్వభావాన్నిఅర్థం చేసుకొని, వారితో మన సంబంధాలు ఎలావుంటాయనేందుకు ఈ వివరాలు కొంత వరకుఉపయోగ పడతాయి. వ్యక్తి స్వభావాన్ని గురించిపూర్తిగా అధ్యయనం చేయాలంటే అతనిజాతకచక్రం వుండాల్సిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X