వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభా పర్వం..... అంతారాజకీయం!

By Staff
|
Google Oneindia TeluguNews

కాలం నిరంతరం ప్రవహించే మహానదిలాంటిది. ఆగకుండా పరుగెట్టడం దాని లక్షణం. పరుగెత్తేకాలంతో పాటు అలుపూ సొలుపూ లేకుండా పరుగెడుతూ, కాలాన్నిశాసిస్తూ, దాన్ని చెప్పుచేతల్లో పెట్టుకునేవాళ్ళేపురుషులందు పుణ్యపురుషులు. వాళ్ళే నిజమైనవిజేతలు.

వంద చెప్పండి, వెయ్యి చెప్పండి -మనకంటే మన పూర్వీకులే తెలివైన వాళ్ళు.వాళ్ళకే కాలజ్ఞానం ఎక్కువ. ప్రకృతిధర్మాలకు తలవొగ్గుతూనే కాలానుగుణంగా పనిపాటలు చేసుకుంటూ ప్రగతికిపునాదులు వేసుకోవడానికి, ఉన్నత లక్ష్యాలు సాధించడానికినేర్పుగా కాలాన్ని విభజించారు.

ఇంగ్లీషువాళ్ళు జనవరి మొదలుడిశెంబర్‌ దాకా పన్నెండు నెలలకూ పన్నెండుపేర్లు పెడితే మనవాళ్ళు వాటిని చైత్ర,వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ, భాద్రపద,ఆశ్వయుజ, కార్తీక, మార్గశిర, పుష్య, మాఘ, ఫాల్గుణమాసాలని పిలుస్తున్నారు. ఇంగ్లీషులో సెకన్లూ నిముషాలూవున్నట్లే, మనకు విఘడియలు,ఘడియలు వున్నాయి. ఐదు రెప్పపాట్ల కాలాన్ని ఒక విఘడియఅంటాం. అరవై విఘడియల్ని ఒక ఘడియగాపిలుస్తాం. ఏడున్నర ఘడియల్ని జాము అని,ఎనిమిది జాముల్ని ఒక పగలూ రాత్రితో కూడినరోజని,పదిహేను రోజుల్ని ఒక పక్షమని, రెండు పక్షాల్ని ఒకనెల అని, రెండు నెలలు కలిస్తే రుతువని, మూడు రుతువులు కలిస్తేఆయనమనీ, రెండు ఆయనాలు (ఉత్తరాయనం,దక్షిణాయనం) కలిస్తే ఒక సంవత్సరమనీ వ్యవహరిస్తాం.

మనవాళ్ళు మొత్తం అరవైసంవత్సరాల్ని ఏర్పరిచారు. ప్రభవతో మొదలైఅక్షయతో ముగుస్తాయవి. 1987-88 సంవత్సరంలోఅక్షయతో ఒక అరవై ఏళ్ళ భ్రమణం పూర్తయి ప్రభవతోమరో అరవై ఏళ్ళ భ్రమణం మొదలైంది. ఈసారివస్తున్న సంవత్సరం విక్రమ నామవత్సరం. ఈ వరుసలో ఇది పద్నాలుగో సంవత్సరం.రెండువేల నలభై ఆరు- నలభై ఏడుసంవత్సరానికి ప్రస్తుత అరవై ఏళ్ళ కాలభ్రమణం పూర్తవుతుంది.

అనంతకాలగమనంలోఅరవై ఏళ్ళుచాలా తక్కువ కాలమే కావచ్చు గాని కష్టసుఖాలుకావడికుండల్లా మోసే బడుగు జీవులకి, అల్ప జీవులకిఅరవైఏళ్లకాలం చాలా ఎక్కువ అనిపించి వుండాలిమనవాళ్ళకి, లేదా ఒక తరానికి కొలమానంగా అరవై ఏళ్ళనునిర్దేశించి ఉండాలి. అందుకే తెలుగు సంవత్సరాలుఅరవై అన్నారు.

చైత్ర శుక్ల ప్రతి పది వత్సరారంభః అనినిర్ణయ సింధు వచనంలో వుంది. చైత్రశుద్ధ పాడ్యమి నాడు బ్రహ్మ సృష్టినిప్రారంభించాడట. అందుకని ఆరోజును యుగాదిఅంటారు. వ్యవహారంలో అది ఉగాది అయింది. శిశిరంలోంచి వసంతంలోకి కాలం అడుగిడుతున్నఅపురూప ఉషస్సమయమిది. చెట్లకున్న ఎండుటాకులన్నీ టపటపా రాలినేలమీద పడే లోపలే మోళ్ళన్నీలేలేత పత్రాల్ని చిగురిస్తాయి. పచ్చటి ఆకులు గుంపులు గుంపులుగాపుట్టుకొస్తాయి. కొమ్మలూ, రెమ్మలూ చెట్టుతల్లిపిల్లలై కోయిలతో జతకడతాయి. మామిడి విరగకాస్తుంది.వేప పులకిస్తుంది. కానుగ కళకళలాడుతుంది. అదీ - చైత్రమన్నా, వసంతమన్నా! అదిగో భద్రాద్రి -ఇదిగో గౌతమి అన్నట్టుగా, ఉగాది సంబరాలతోపాటు చైత్రశుద్ధపాడ్యమి నుంచి వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X