• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాఠకులకు ఓ మాట

By Staff
|

ఖర్చుకు తగిన ప్రతిఫలంఉందా? కొత్త ప్రతిపాదనలేమిటి? వాటి వల్లవచ్చే ఫలితాలేమిటి? ఇప్పటి వరకు ఖర్చు అవుతున్నమొత్తాలలో ఏ మేరకు తగ్గించవచ్చు?అన్న అంశాలపై శాఖలవారిగా ప్రభుత్వం తర్జన భర్జనలు చేసి ఒకఅవగాహనకు వచ్చిందని ప్రభుత్వ వర్గాలకథనం. ఈ కసరత్తు వల్ల రెండు వేల కోట్లరూపాయల వరకు ఆదాచేయవచ్చని ఒక అంచనా. జీరోబేస్డ్‌ బడ్జెట్‌ సాధ్యమేనా?

జీరో బేస్డ్‌బడ్జెట్‌ రూపకల్పనపై కొందరు నిపుణులకుఅనుమానాలున్నాయి. గతంలో ఆర్ధిక శాఖనునిర్వహించిన మాజీ ఐఎఎస్‌ అధికారి బిపిఆర్‌ విఠల్‌జీరో బేస్డ్‌ బడ్జెట్‌ పై వ్యాఖ్యానిస్తూ మొత్తంఉద్యోగులందరినీ తొలగించి మొదలు పెడితే తప్పసాధ్యం కాకపోవచ్చని అన్నారు. ఇది ఆచరణ సాధ్యంకాదని గతంలో కొన్ని అనుభవాలు చెబుతున్నాయన్నదిఆయన అభిప్రాయం. ఈ అభ్యంతరాలను ప్రభుత్వం కొట్టిపారేయనప్పటికీ వృధా వ్యయం అరికట్టడానికి ఎక్కడో ఒకచోట ప్రయత్నం జరగాలని అభిప్రాయపడుతున్నది.అశోక గజపతి రాజు ఆర్ధిక మంత్రిగా ఉన్నకాలంలో మైక్రో సర్వే ఆధారంగా ప్రజలఅవసరాలను గుర్తించడానికి మైక్రో సర్వే ఆధారంగా ప్రజలఅవసరాలను గుర్తించిబడ్జెట్‌ తయారుచేస్తామని చెప్పారు. ఆ సర్వే ఒకప్రహసనంగా ముగిసింది.

ఎంతో ఉపయోగకరమైనజీరో బేస్డ్‌ బడ్జెట్‌ ప్రవేశపెడదామంటే ఆర్ధిక సంఘంసిఫార్సులు అడ్డు వస్తున్నాయని ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు గగ్గోలు పెడుతున్నారు. ఆర్ధిక సంఘంఅన్నాక దానికి కొన్ని మార్గ దర్శక సూత్రాలు ఉంటాయి.

అవి చేసేసిఫార్సుల వల్ల కొన్ని రాష్ట్రాలకు మేలుజరగవచ్చు, మరికొన్నిటికి నష్టం జరగవచ్చు. అంత మాత్రంచేత ఆర్ధిక సంఘం సిఫార్సులన్నిటినీ వ్యతిరేకించాలనిచంద్రబాబు నాయుడుకేంద్రంపై వత్తిడి చేయడం వెనుక దాగినలక్ష్యమేమిటో మరికొద్ది రోజుల్లో గానీ బయట పడకపోవచ్చు. ఆర్ధిక సంఘంసిఫార్సులను అంత అడ్డదిడ్డంగాకొట్టిపారేయడం వీలు కాదని కేంద్రంఇప్పటికే స్పష్టం చేసింది. తన లక్ష్యసాధన కోసంచంద్రబాబు నాయుడు మరికొందరు ముఖ్యమంత్రులనుకూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు. నాణేనికిమరో వైపు కూడా ఉంటుంది కాబట్టి ఆర్ధిక సంఘంసిఫార్సుల వల్ల కొంత లాభపడే రాష్ట్రాలన్నీఒకటై ఇదే మాదిరిగా వత్తిడి చేస్తే కొత్త సమస్యలు తలెత్తుతాయి.

ఆర్ధిక సంఘంసిఫార్సుల వల్ల రాష్ట్రానికి 900 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని,దాని ప్రభావం రాష్ట్ర బడ్జెట్‌ పై తీవ్రంగాఉంటుందని ప్రభుత్వ వర్గాల అంచనా. బాగా పని చేసే రాష్ట్రాలకు ఆర్ధిక సంఘంసిఫార్సులు నష్టం కలిగిస్తుండగా, పని తీరు బాగా లేని రాష్ట్రాలకుమేలు కలిగిస్తుందని ఇదిసహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమని చంద్రబాబు నాయుడువాదన. దీనిపై పార్లమెంటులోప్రభుత్వాన్ని నిలదీయవలసిందిగాతెలుగుదేశం ఎంపీలను ఆయన కోరారు. ఇంతమాత్రంచేత ఆయన కేంద్రంలో ఎన్డీఎ కూటమికి మద్దతుఉపసంహరించుకుంటారని అనుకోరాదు. విద్యుత్‌వంటి ముఖ్య సమస్యలను పక్క దారిపట్టించడానికికేంద్రంతో ఘర్షణ ధోరణి అవలంబిస్తున్నారన్నవిమర్శలులేకపోలేదు.

గతసంచికల్లో.......

పురాతన కళకు ఆధునిక రూపం

మొగలాయి కళ, రాజస్ధానీ పనితనం కలగలిస్తే తేవా ఆభరణాలవుతాయి. అరుదైన ఈ కళారూపాల ఎగ్జిబిషన్‌ హైదరాబాద్‌ లో ప్రారంభమైంది. గాజు, బంగారంతో తయారయ్యే ఈ హస్తకళా వస్తువులు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి.

దద్దోజనంహేయం! దున్నపోతు దివ్యం!!

దద్దోజనం, పులిహోరలప్రసాదమేమో పాపమా? దున్నపోతుల, మేకల, గొర్రె తలలు నరకడమేమో పుణ్యమా?ఇదేనా కంచె ఐలయ్య సంస్కారం అని ప్రశ్నిస్తున్నారుఎంవిఆర్‌ శాస్త్రి.

ఐలయ్య లీల

భారతదేశ నిజ జీవితానికి ఐలయ్య పట్టిన అద్దంఎటువంటిది? చలిదేశపు అమెరికా రాయబారిగారికే వణుకు పుట్టేంతటి భారతదేశపువాస్తవాలుఈ పుస్తకంలో ఏమి ఉన్నాయి?

సరస్వతికి చదువొచ్చా?!

పురాణగాథలను తలా తోకా లేకుండా వెర్రిమొర్రిగా వక్రీకరించే పామరత్వం గురించి వేణుగోపాల శతకకారుడు ఏనాడో చేసిన వ్యాఖ్య ఐలయ్యగారి ప్రవచనాలకు చక్కగా నప్పుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X