వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డాక్టర్‌ రెడ్డికి మరో అరుదైన గౌరవం

By Staff
|
Google Oneindia TeluguNews

బ్రిస్‌బేన్‌: ఢిల్లీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌పై ఆశలు పెట్టుకోవచ్చా? ఆస్ట్రేలియాతో గురువారం తొలి టెస్ట్‌మ్యాచ్‌లో భారత్‌ తలపడబోతోంది. ఆస్ట్రేలియా పర్యటన భారత జట్టుకు ఏ రకంగా చూసినా కీలకమే. వరుస విజయాలతో అజేయమైన జట్టుగా పేరుపొందిన కంగారూలను వారి సొంత గడ్డ మీద ఢీకొనడం కొండను ఢీకొనడంలాంటిదే. ఈ భయాందోళనలు భారత క్రికెట్‌ జట్టునే కాదు, క్రికెట్‌ పెద్దలను కూడా ఆవరించినట్లు తోస్తోంది. భారత జట్టు వైఫల్యానికి ఎప్పుడూ బౌలర్లను నిందించడం మనవాళ్లకు అలవాటై పోయింది. బ్యాటింగ్‌ ఆర్డర్‌ను బలోపేతం చేయడానికి 11 మందితో జట్టులో బ్యాట్స్‌మెన్‌ను పెంచుకుంటూ పోవడం కూడా అలవాటైపోయింది. ఇతర దేశాలతో ఫాస్ట్‌బౌలర్లతో పోలిస్తే మన బౌలర్లు కొంత వెనకబడి ఉంటారనే విషయం నిజమే. కానీ ఇతర దేశాల ఫాస్ట్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో మన బ్యాట్స్‌మెన్‌ విఫలమవుతున్న తీరును తక్కువ చేసి చూడడం ఎందుకనేది ప్రశ్న.

మన బ్యాట్స్‌మెన్‌ వ్యక్తిగత రికార్డులకేం కొదవలేదు. ఈ వ్యక్తిగత రికార్డులు జట్టును గెలిపించడానికి ఉపయోగపడుతున్నాయా, లేదా అనే ఆలోచన ఎప్పుడూ చేయం. వీరేంద్ర సెహ్వాగ్‌ తన కెరీర్‌ తొలినాళ్లలో వీరంగం ప్రదర్శించాడు. వన్డే మ్యాచ్‌ల్లో అతని ఆటతీరు చూసి మురిసిపోని ఘడియలు ఆ రోజుల్లో లేవు. అటువంటి వీరేంద్ర సెహ్వాగ్‌ తన ఆటతీరును మెరుగుపరుచుకున్నాడా, లేదా అనేది పరిగణనలోకి తీసుకోం. వీరేంద్ర సెహ్వాగ్‌ ఆటతీరు ఇటీవలి కాలంలో మరీ ఘోరంగా ఉంది. అయినప్పటికీ భారత జట్టు కోచ్‌ జాన్‌ రైట్‌ సెహ్వాగ్‌ తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నాడు. నిజానికి, సెహ్వాగ్‌ మంచి బ్యాట్స్‌మన్‌కు ఉండాల్సిన లక్షణాలేవీ లేవు. పైగా తన ఆటతీరును మెరుగుపరుచుకునే ప్రయత్నం అతను చేసినట్లు కూడా కనిపించడం లేదు. ఒకసారి ఉద్వాసనకు గురైన లక్ష్మణ్‌లో ఆ మార్పు కనిపిస్తోంది. తపనా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

సెహ్వాగ్‌ ఎనలేని సమర్థతను తాము గౌరవిస్తామని జాన్‌రైట్‌ మంగళవారం విలేకరులతో అన్నారు. సెహ్వాగ్‌ మంచి ప్రారంభాన్ని ఇవ్వగలడని, అతను సమర్థుడని రైట్‌ కితాబు ఇచ్చారు. గురువారం ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్ట్‌మ్యాచ్‌లో సెహ్వాగ్‌ ఆడుతాడని తేల్చి చెప్పారు. అయితే సెహ్వాగ్‌ ఆట ఈ మధ్యకాలంలో ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌లో సెహ్వాగ్‌ 20, 23, 6, 5 పరుగులు చేశాడు. భారత్‌లో జరిగిన టివిసి కప్‌ ముక్కోణనపు పోటీల్లో కూడా సెహ్వాగ్‌ ఏ మాత్రం వికెట్ల వద్ద నిలదొక్కుకోలేక పోయాడు. ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కునే విషయంలో సెహ్వాగ్‌ బేలతనం కొట్టొచ్చినట్లు కనిపించింది. సెహ్వాగ్‌ మంచి ప్రారంభాన్ని ఇవ్వగలడంటున్న రైట్‌ నిలబడితే కదా ప్రారంభం ఇవ్వడానికి అనే విషయాన్ని ఆలోచించడం లేదు.

ఆస్ట్రేలియాతో భారత జట్టు సరితూగిన సందర్భాలు ఏనాడు లేవు. విదేశాల్లో ఆడిన 67 టెస్టుల్లో ఆరు మాత్రమే భారత్‌ గెల్చుకుంది. ఆస్ట్రేలియాలో జరిగిన 27 మ్యాచ్‌ల్లో మూడింటిలో
మాత్రమే భారత్‌ విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై భారత్‌ 22 ఏళ్ల క్రితం 1980-81లో మెల్‌బోర్న్‌లో విజయం సాధించింది. ఈ పర్యటనలో గంగూలీ సేన కంగూరూలను ఒక్క టెస్టులో ఓడించినా రికార్డే అవుతుంది. అయితే వైస్‌ కెప్టెన్‌ రాహుల్‌ ద్రావిడ్‌ మాత్రం తాము ఏమీ తీసిపోలేదని అంటున్నాడు. మూడో స్పిన్నర్‌గా సచిన్‌ టెండూల్కర్‌ను వాడుకుంటామని జాన్‌రైట్‌ చెబుతున్నాడు. వ్యూహాలు ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా గంగూలీ సేన ఈ పర్యటన న్యూజిలాండ్‌ పర్యటనలాంటి చేదు అనుభవాన్ని మిగిలించకూడదని ఆశిద్దాం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X