• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డాక్టర్‌ రెడ్డికి మరో అరుదైన గౌరవం

By Staff
|

హైదరాబాద్‌: ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌)తో కాంగ్రెస్‌ పొత్తు కుదిరింది. సీట్ల వద్ద ఇరు పార్టీలు దిగి రావడంతో పొత్తు సాధ్యమైంది. ఈ పొత్తును తెలుగుదేశం పార్టీ తీవ్రంగా తప్పు పడుతోంది. అవకాశవాద పొత్తుగా దీన్ని అభివర్ణిస్తోంది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) తన పొత్తుకు మాత్రం హేతుబద్దతను కల్పించుకుంటోంది. కాంగ్రెస్‌ పార్టీకి అధికార యావ తప్ప మరోటి లేదని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అంటున్నారు. కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మద్దతు అవసరం కావడంతో బిజెపి ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని పక్కన పెట్టింది. తెలుగుదేశంతో పొత్తు అవసరం లేనినాడు, స్నేహం బెడిసి కొట్టిననాడు ఆ పార్టీ ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని ఒరలో దాచి పెట్టి ఉంచింది. అయితే అది ఏ ఒక్కరి సొత్తో కాదు కదా! కె. చంద్రశేఖర్‌ ఏకంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ పార్టీనే స్థాపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమానికి అంతకు ముందే పడిన పునాది చంద్రశేఖర్‌ రావుకు కలిసి వచ్చింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌ను తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుకు ముందే తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు ముందుకు తెచ్చారు. అధిష్ఠానానికి విజ్ఞప్తులు చేస్తూ పోయారు. వీరి విజ్ఞాపనలను కాంగ్రెస్‌ పెడచెవిన పెట్టింది. ఫలితంగా చంద్రశేఖర్‌ రావుకు తెలంగాణలో అనూహ్యమైన ఆదరణ లభించింది. దీంతో తెలంగాణ రాష్ట్ర సమితితో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవాల్సిన అనివార్యతలో పడిపోయింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కాంగ్రెస్‌కు అలవాటే కదా!

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంపై నిప్పులు చెరిగిన ఉభయ కమ్యూనిస్టులు కూడా క్రమక్రమంగా మెత్తబడుతూ వచ్చారు. తెలుగుదేశం పార్టీని ఓడించడానికి తెలంగాణ రాష్ట్ర సమితి చేయూత తప్పనిసరి అయింది. ఫలితంగా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉంటూనే తెలంగాణ రాష్ట్ర సమితితో ఏదో మేరకు ఇచ్చిపుచ్చుకునే ధోరణికి వారు సిద్ధపడ్డారు. అయితే కమ్యూనిస్టులతో కలిసి పని చేసేది లేదని చంద్రశేఖర్‌ రావు అంటున్నారు.

తెలంగాణలోని 107 అసెంబ్లీ స్థానాల్లో 42 స్థానాలను తెలంగాణ రాష్ట్ర సమితికి ఇవ్వడానికి కాంగ్రెస్‌ అంగీకరించింది. తెలంగాణలోని 107 స్థానాల్లో కాంగ్రెస్‌ వామపక్షాలకు కొన్ని సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఈ పరిస్థితిలో కాంగ్రెస్‌ తెలంగాణలో కాంగ్రెస్‌ పోటీ చేసే సీట్ల సంఖ్య దాదాపుగా సగానికి కుదించుకుపోతుంది. దీని వల్ల తమ

పార్టీలో తలెత్తే అసంతృప్తులను, తిరుగుబాట్లను కాంగ్రెస్‌ పరిష్కరించుకోవాల్సి వుంటుంది. టిఆర్‌ఎస్‌తో సీట్ల సర్దుబాటు ద్వారా కాంగ్రెస్‌ తొలి మెట్టు ఎక్కినట్లయింది. రెండో మెట్టు అత్యంత కీలకమైంది. అసమ్మతులు, అసంతృప్తులు బయలుదేరి తిరుగుబాటు అభ్యర్థుల బెడదను మిత్రులు పోటీ చేసే స్థానాల్లో కాంగ్రెస్‌ నివారించాల్సి ఉంటుంది. ఈ నివారణ చర్యలు పకడ్బందీగా అమలు చేయకపోతే మిత్రభేదం తలెత్తి మొదటికే మోసం రావచ్చు. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌ ఈసారి కొంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. సీనియర్‌ నాయకుల మధ్య విభేదాలు తలెత్తకుండా పార్టీ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌ చురుకైన పాత్ర నిర్వహిస్తున్నారు. అన్నింటికీ ఆయన ముందు ఉంటుండం వల్ల సీనియర్‌ నాయకుల్లో అసంతృప్తులకు చోటు ఉండదనే వాతావరణ నెలకొంది. దీనికి తోడు వివిధ నాయకుల కార్యక్రమాల మధ్య సమన్వయం సాధిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.

టికెట్లు లభించనివారికి కాంగ్రెస్‌ ఇచ్చే హామీలపైనా, ఆ హామీలు అమలవుతాయనే నమ్మకం కలిగించడం మీద తిరుగుబాట్ల బెడద స్థాయి వుంటుందనేది రాజకీయ పరిశీలకుల అంచనా. పదవులు చాలా వుంటాయని ఇప్పటికే ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ చెప్పారు. దీన్ని మరింత స్థిరంగా నాయకత్వం చెప్పబోతుందా? నియోజకవర్గ స్థాయిలో సమన్వయంపై వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ మిత్ర పక్షాల విజయావకాశాలు ఆధారపడి వుంటాయి. తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు ఆంధ్రలో వ్యతిరేక ప్రభావం చూపదనే నమ్మకానికి కాంగ్రెస్‌ నాయకత్వం వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకున్నవారు ఇప్పటికే వెళ్లిపోయారని, కొత్తగా వెళ్లేవారు తక్కువగా ఉంటారని కాంగ్రెస్‌ నాయకులు భావిస్తున్నారు.

ఏమైనా మిత్రపక్షాల మధ్య విశ్వాసాన్ని పాదుకొల్పి, పరస్పర సహకారానికి బాటలు వేయాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ మీదే ఎక్కువగా ఉంటుంది. ఇదే రేపటి ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించవచ్చు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more