వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘనమైన హామీల జాడెక్కడ?

By Staff
|
Google Oneindia TeluguNews

అధికారంలోకివచ్చింది మొదలు ఎప్పుడు పడితేఅప్పుడు ఎక్కడ పడితే అక్కడముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుప్రజలకు అడ్డుగోలుగా చేసిన వాగ్ధానాలనురూపాయల్లోకి మారిస్తే కొన్ని వేల కోట్ల రూపాయలవుతుంది.ముఖ్యమంత్రివన్నీ గాలి మాటలని ఇచ్చినహామీలన్నీ నీటి మూటలని తేటతెల్లంచేసేందుకు సిఎల్‌పి భారీ ఎత్తున ఉద్యమంప్రారంభించింది. ఊరూరు తిరుగుతూ హామీలపైప్రభుత్వాన్ని నిలదీయాల్సిందిగా ప్రజలనుప్రొత్సహిస్తున్నది. ఈ ఉద్యమానికిలభిస్తున్న ప్రచారంతో ప్రభుత్వం పరువుబజార్నపడే ప్రమాదం ఏర్పడింది. వచ్చే అసెంబ్లీలోఈ హామీలపైనే ప్రభుత్వం దుమ్ము దులిపేఆలోచనలో సిఎల్‌పి వుంది. దాంతోతెలుగుదేశం అగ్రనేత అద్భుతమైనఉపాయం ఆలోచించారు. వేల సంఖ్యలో ఇచ్చినహామీల్లో తాను పట్టించుకోవడం వల్లలేదా తన ప్రమేయం లేకుండానే నెరవేరినహామీలు కొన్ని వున్నాయి. వాటన్నింటినీ క్రొడీకరించివెబ్‌సైట్‌లో వుంచారు. రాష్ట్రంలో ప్రజలుఏమనుకున్నా రాష్ట్రం ఆవల వున్న (ముఖ్యంగాఅమెరికాలో వున్న) ఆంధ్రులు తన గురించిఘనంగా మాత్రమే చెప్పుకోవాలనే ఆకాంక్షగట్టిగా వున్న చంద్రబాబు ప్రత్యేకశ్రద్ధ తీసుకుని ఈ వెబ్‌పేజీలను డిజైన్‌చేయించారు. కాంగ్రెస్‌ గట్టిగా నిలదీస్తే హామీలనునెరవేర్చడమే కాదు వెబ్‌సైట్‌లో డిస్‌ప్లేకూడా చేశామని దబాయిస్తే సరిపోతుందని ఆయనఉద్దేశ్యం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X