వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మరో అపకార బ్యాంక్
ఎన్‌టిఆర్‌కు వైద్యునిగా వున్న ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ సోమరాజుతో కలసి ఆయన తరుచు ఎన్టిఆర్ ఇంటికివెళ్లేవారు. ఎన్టిఆర్ తన ఆరోగ్యాన్ని గురించి కుటుంబ సన్నిహితునిగా వున్న కాకర్లతో చర్చించేవారు తప్ప ఆయన స్వయంగా వైద్యం చేసిందేమీ లేదు. ఈ విషయం కాకర్ల కూడా అంగీకరిస్తున్నారు. కాకర్లను అమెరికా నుంచి రప్పించి ఎన్టిఆర్ ప్రతిష్టాత్మకమైన నిమ్స్ పదవిని కట్టబెట్టిన నాటినుంచి ప్రొఫెషనల్ వ్యవహారాల్లో మాత్రమే కాకుండా తెలుగుదేశంతో రాజకీయంగా కూడా ఆయన సన్నిహితంగా మసలడం ప్రారంభమయింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!