• search

నిస్సిగ్గు సమర్థన వెనక...

By Staff
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీని పట్టిన గ్రహణం అంత సులభంగా వీడేట్లు లేదు. ఆయన చుట్టూ వివాదాలు అల్లుకుంటూనే ఉన్నాయి. రంజీ మ్యాచ్‌ల్లో గంగూలీ పాల్గొనకపోవడంపై పెద్ద దుమారమే చెలరేగింది. గంగూలీ రంజీ మ్యాచ్‌లు ఆడకపోవడంపై బిసిసిఐ సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ కిరణ్‌మోరే తీవ్ర విమర్శలు చేశారు. మొదట గంగూలీకి అండగా నిలబడినట్లు కనిపించిన బిసిసిఐ ఆ తర్వాత తన వైఖరిని మార్చుకుంది.

    ఇప్పుడు తాజాగా పాక్‌ పర్యటనకు వెళ్లే ముందు అతని ఎంపికపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. గంగూలీ ఎంపిక తమ జట్టుకు నైతిక బలాన్ని చేకూర్చిందని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్లు వకార్‌ యూనిస్‌, ఇమ్రాన్‌ఖాన్‌ వంటివారు సెలవిస్తున్నారు. గంగూలీ ఎంపిక భారత జట్టు కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌, జట్టు కెప్టెన్‌ రాహుల్‌ ద్రావిడ్‌కు ఇష్టం లేదని, దీని వల్ల గంగూలీ ఎంపికతో భారత జట్టులో అనారోగ్యకరమైన వాతావరణం నెలకొంటుందని వారంటున్నారు. ఇందులో వాస్తవం లేకపోలేదు. గంగూలీ ఆధిపత్య ధోరణి, ఎవరితోనూ కలివిడిగా ఉండలేకపోవడం వంటి కారణాలు చాలా కాలంగా భారత జట్టులోని కొంత మందికి మింగుడు పడడం లేదు. గంగూలీ వల్ల ఇబ్బందుల పాలైనవారు కూడా ఉన్నారు. అటువంటివారిలో హైదరాబాద్‌ క్రికెటర్‌ వివియస్‌ లక్ష్మణ్‌ను ప్రధానంగా చెప్పుకోవాలి.

    గంగూలీ జట్టు కెప్టెన్‌గా మంచి ఫలితాలే సాధించాడు. అయితే అతని బ్యాటింగ్‌ మాత్రం ఘోరంగా దెబ్బ తిన్నది. తన బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకోవడానికి అతను ప్రయత్నాలు చేసినట్లు కూడా కనపడదు. శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో అతని బ్యాటింగ్‌ ఫరవాలేదనిపించినా, అది ఒక సీనియర్‌ క్రికెటర్‌ కాంట్రిబ్యూషన్‌కు సరిపోయేది కాదని ఎవరైనా చెప్పగలరు. ఇదే సమయంలో గంగూలీ శిష్యుడు యువరాజ్‌ సింగ్‌ టెస్టుల్లో కూడా రాణించడం సెలెక్టర్లను ఆలోచనలో పడవేసింది. గంగూలీ కన్నా యువరాజ్‌ బెటర్‌ అనే ఆలోచనకు వారు వచ్చినట్లు కనిపిస్తుంది. దానివల్లనే శ్రీలంకతో జరిగిన మూడో టెస్టుకు గంగూలీని తప్పించారు.

    గంగూలీని తప్పించిన విషయంలో చెలరేగిన వివాదం అంత మంచిదేం కాదు. సిపియం నాయకులు చేసిన హడావిడి ఆశ్చర్యం కలిగించక మానదు. ఇతర రాష్ట్రాలకు చెందిన క్రికెటర్లకు గంగూలీకి జరిగినటువంటి అన్యాయం (ఒక వేళ గంగూలీకి నిజంగానే అన్యాయం జరిగి వుంటే) చాలా జరిగింది. అటువంటి సందర్భాల్లో బృందా కారత్‌ వంటి సిపియం నాయకులు, బుద్ధదేవ్‌ బట్టాచార్య వంటి ముఖ్యమంత్రులు ఎవరూ నోరెత్తలేదు. ఇది ఒక రకంగా పశ్చిమ బెంగాల్‌ ఆధిపత్యమని చెప్పాలి. అదే సిపియం మాటగా, చేతగా బయటకు వచ్చింది.

    గంగూలీతో ప్రస్తుత భారత జట్టులోని సీనియర్లకెవరికీ మానసికంగా సాన్నిహిత్యం చెదిరిపోయిన ఛాయలే కనిపిస్తున్నాయి. దీన్నే పాక్‌లోని మాజీ క్రికెటర్లు దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతూ ఉండాలి. ఇంగ్లాండుపై సిరీస్‌ విజయం సాధించి మంచి ఊపుతో ఉన్న పాక్‌ క్రికెటర్లను వారి స్వదేశంలో ఎదుర్కోవాలంటే జట్టు ఒకటిగా కూడి ఉండాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిలో టీమ్‌ స్పిరిట్‌ను ప్రదర్శించాల్సి ఉంది. ఈ స్థితిలో గంగూలీ ఎంపిక ఏ మేరకు ఉపయోగపడుతుందనేది పక్కన పెడితే నష్టం చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పరిశీలకుల అంచనా.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more