వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొలి తెలుగు తీర్పు ప్రేరణ

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి:నాలుగు నెల విరామం తర్వాత సచిన్‌టెండూల్కర్‌ మైదానంలోకి అడుగుపెట్టాడు. ముంబాయి శివారులో ఉన్న యంఐజిక్రికెట్‌ క్లబ్‌ మైదానంలో ఆయనమంగళవారంనాడు కొద్దిపాటిబ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. జింబాబ్వేతోజరిగే టెస్టు మ్యాచ్‌లకు ఎంపిక చేసినజట్టులో సచిన్‌ పేరు కూడా ఉంది. అయితే ఆయనఫిట్నెస్‌పైనే ఆ టెస్టు మ్యాచ్‌ల్లో పాల్గొనేఅవకాశం ఉంటుంది.నిన్న30, 40 బంతులు ఆడానని టెండూల్కర్‌ముంబాయిలో ఏర్పాటైన ఒకప్రమోషనల్‌ ఈవెంట్‌లోబుధవారంనాడు చెప్పాడు. క్రమంగాక్రికెట్‌ బంతితో ప్రాక్టీస్‌ను మొదలుపెడతానని ఆయన చెప్పాడు. ప్రస్తుతంతాను ఉపయోగిస్తున్న బంతి టెన్నిస్‌ బంతికన్నా బరువైనది, క్రికెట్‌ బంతికన్నాతేలికైనది అని ఆయన చెప్పాడు.జింబాబ్వేలో జరిగే టెస్టు సిరీస్‌కు తానుఫిట్నెస్‌ సాధించుకుంటానా, లేదా అనేదిఇప్పుడే చెప్పడం కష్టమని ఆయనఅన్నాడు.మెల్లగావిసిరే బంతులను కొట్టే చిన్న బ్యాటింగ్‌సెషన్‌లో మాత్రమే పాల్గొన్నానని,గంటకు 90 మైళ్ల వేగంతో వచ్చేక్రికెట్‌ బంతిని ఎదుర్కున్నప్పుడు తనఎల్బో తట్టుకుందా, లేదా అనేది చెప్పలేనని,అయితే దాన్ని ఎదుర్కోవడానికిసిద్ధపడుతున్నానని ఆయన చెప్పాడు.తనకు దీర్ఘకాలిక ప్రణాళిక ఉందని,అందుకే సమస్య తిరిగి తలెత్తకుండాశస్త్రచికిత్స చేయించుకున్నానని, అదిపూర్తిగా నయం కావడానికే జాగ్రత్తలుతీసుకుంటున్నానని ఆయన వివరించాడు.తానుతొందరపడదలుచుకోలేదని, అయితేఆటగాడు ఎప్పుడూ ఆడాలనే అనుకుంటాడని, జట్టుకుఉపయోగపడడానికి కొన్ని సార్లు నిన్నునువ్వు ముందుకు తోసుకోవాల్సివుంటుందని, వేలి గాయంతోనే తానుప్రపంచ కప్‌ మ్యాచ్‌లన్నీ ఆడానని, కొన్నిసార్లు అది పనికి వస్తుంది కొన్నిసార్లుపనికి రాదని ఆయన అన్నారు. తిరిగిమైదానంలోకి దిగడానికి ముందు చాలాజాగ్రత్తగా ఆలోచించుకోవాల్సి వుంటుందని,లండన్‌ వైద్యులతోనూ భారతక్రికెట్‌ జట్టు ఫిజియోతో తాను టచ్‌లో ఉన్నాననిఆయన చెప్పాడు. మే 25వ తేదీనసచిన్‌ లండన్‌లో శస్త్రచికిత్సచేయించుకున్నారు. నాలుగు వారాలువిశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులుసలహా ఇచ్చారు.జింబాబ్వేలోముక్కోణపు వన్డే పోటీలు ఈ నెల 22వతేదీన ప్రారంభమవుతాయి. జింబాబ్వే,న్యూజిలాండ్‌, భారత్‌లు ఈ పోటీల్లోపాల్గొంటున్నాయి. ఆ తర్వాత టెస్టు సిరీస్‌ఉంటుంది. జింబాబ్వేతో భారత్‌ రెండు టెస్టుమ్యాచ్‌లు ఆడుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X