వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరమేథ యజ్ఞం

By Staff
|
Google Oneindia TeluguNews
ఎంతోఉత్కంఠతో సాగిన పాక్‌, భారత్‌ల టెస్టుమ్యాచ్‌ సిరీస్‌ ముగిసింది. కోల్‌కత్తాలోఓడిపోయి, బెంగుళూర్‌లో గెలిచి పాకిస్థాన్‌సిరీస్‌ను సమం చేసింది. మొహాలీలో జరిగినమొదటి టెస్టులో పాకిస్థాన్‌ ఓటమిని అక్మల్‌సాహసోపేతంగా అడ్డుకున్నాడు. సొంతగడ్డపై పాక్‌ను మట్టికరిపించాలనుకున్న భారత క్రికెట్‌ జట్టుకెప్టెన్‌ గంగూలీ ఆశలు వమ్ముకావడం మాట అటుంచితే, గంగూలీబ్యాటింగ్‌ వైఫల్యం అందరికీ కొట్టొచ్చినట్లుకనిపించింది. ఒక్క ఇన్నింగ్స్‌లోనూ గంగూలీతన బ్యాటింగ్‌ సత్తానుచాటుకోలేకపోయాడు. ఈ సిరీస్‌లో అత్యంతపేలవమైన ఆటను ప్రదర్శించిందిగంగూలీయే.మొత్తంసిరీస్‌లో ఇరు జట్ల ఆటతీరును, ఆ జట్టుప్రదర్శించిన ఆత్మవిశ్వాసాన్ని గమనిస్తేభారత్‌ జట్టు క్రమక్రమంగానీరసపడిపోతున్నట్లు కనిపించగా,పాకిస్థాన్‌ ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంటూబలం పుంజుకున్న దాఖలాలు స్పష్టంగాకనిపించాయి. మొదటి టెస్టులో అక్మల్‌ఆడిన తీరు బెంగుళూర్‌లో భారత్‌బ్యాట్స్‌మెన్‌లో ఒక్కరికి కూడా ఆదర్శంకాకపోవడం ఈ విషయాన్ని పట్టిస్తుంది.పాక్‌ఓపెనర్‌ ఆఫ్రిదీ, సెహ్వాగ్‌ పోటీగాకనిపించాడు. నిజానికి, ఈ మొత్తం సిరీస్‌లోఅత్యంత ప్రతిభావంతంగా ఆడినఆటగాడు సెహ్వాగ్‌ ఒక్కడే అని చెప్పాలి. సెహ్వాగ్‌ఒక్కడు లేకపోతే పాకిస్థాన్‌ ముందుభారత జట్టు కుప్పిగంతులు వేయాల్సివచ్చేది. రాహుల్‌ ద్రావిడ్‌ ఎప్పటి లాగేతన సత్తాను చాటుకున్నా కీలకమైనబెంగుళూర్‌ మ్యాచ్‌లో విఫలమైభారత అభిమానులకు నిరాశనుమిగిల్చాడు. హైదరాబాద్‌ ఆటగాడు వివియస్‌లక్ష్మణ్‌ తన విశిష్టతకు రంగువెలిసిపోతోందని స్వయంగాచెప్పుకున్నాడు. బెంగుళూర్‌ టెస్టుమ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో తప్పఅతను పెద్దగా ఒరగబెట్టిందేమీలేదు. ఇక సచిన్‌ టెండూల్కర్‌ విషయానికివస్తే చెప్పుకోవాల్సింది చాలా వుంది.అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగారికార్డు సృష్టిస్తాడని గట్టిగా నమ్మినఅభిమానులకు అతను మొండిచేయిచూపాడు. సునీల్‌ గవాస్కర్‌నుఅధిగమించడానికి అతనుభయపడుతున్నట్లుగా ఆటతీరు ఉంది. చివరిబెంగుళూర్‌ టెస్టులో సచిన్‌ ఆటనుచూసినవారు దాన్నిజీర్ణించుకోలేకపోతున్నారు. సచిన్‌ వికెట్‌తీయడాన్ని బౌలర్లు అత్యంత ప్రతిష్టగాభావిస్తారు. అంతటి మేటి బ్యాట్స్‌మన్‌బెంగుళూర్‌ టెస్టులో బేలగాకనిపించాడు. పాక్‌ బౌలర్ల ముందుఅతను చిన్నబోయాడు.ఇకపోతే,ఇంజమామ్‌, యూనిస్‌ఖాన్‌లను భారతబౌలర్లు అవుట్‌ చేయగలరా అనేఅనుమానం తలెత్తే పరిస్థితి వచ్చింది.వీరిద్దరూ బ్యాటింగ్‌ చేసిన తీరు,భారత బౌలర్లను అవలీలగా ఎదుర్కున్నతీరు భారత బ్యాట్స్‌మెన్‌కు ఆదర్శంకాలేకపోయింది. వీరిద్దరూ సిరీస్‌ముగుస్తున్న కొద్దీ బలం పుంజుకుంటూవచ్చారు. బ్యాటింగ్‌లో తొట్రపాటు గానీ,అయోమయం గానీ ప్రదర్శించలేదు. ఆఫ్రిదీమెరుపు వేగంతో పాకిస్థాన్‌ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం, ఆతర్వాత దాన్ని పటిష్టం చేయడంఇంజమామ్‌, యూనిస్‌ఖాన్‌లు పనిగాపెట్టుకున్నారు. చివరి టెస్టుకు వచ్చేసరికిమరో ఓపెనర్‌ హమీద్‌ కూడా బలంపుంజుకున్న వైనాన్ని చూడవచ్చు.లోపాలను సరిదిద్దుకుంటూ ఒకక్రమపద్ధతిలో వారు బలాన్నిసంతరించుకున్న తీరు భారత్‌కుఆదర్శం కాకతప్పదు. బౌలర్లలోనూఅదే ఆత్మవిశ్వాసం పెరుగుతూ వచ్చింది.భారతబౌలర్లు క్రమక్రమంగాచేతులెత్తేసే స్థితికి చేరుకోవడాన్నికూడా సిరీస్‌ను పరిశీలిస్తేఅర్థమవుతుంది. మొదటి టెస్టులోతన ప్రతాపాన్ని చూపిన భారత బౌలర్‌లక్ష్మీపతి బాలాజీ తర్వాత్తర్వాతనీరసపడిపోయాడు. మరో వైపు పాక్‌ఫాస్ట్‌ బౌలర్‌ సమీ ఎంతటి ప్రతికూలపరిస్థితులోనూ భారతబ్యాట్స్‌మెన్‌ను ముప్పు తిప్పలు పెట్టేస్థాయికి చేరుకున్నాడు. స్పిన్నర్లబలాన్ని కూడా పాక్‌ పెంచుకుంది. భారతస్పిన్నర్లలో ఒకరు విఫలమైతేమరొకరు ఎక్కువ వికెట్లు తీయడం ఒకసంప్రదాయంగా వస్తోంది. అలా కాకుండాపాక్‌ స్పిన్నర్లు కనేరియా, అర్షద్‌,ఆఫ్రిదీ భారత బ్యాట్స్‌మెన్‌కు చెమటలుపట్టించారు. భారత స్పిన్నర్లబౌలింగ్‌లో పాక్‌ బ్యాట్స్‌మెన్‌ అవలీలగాపరుగులు తీస్తే భారత బ్యాట్స్‌మెన్‌వికెట్లను కాపాడుకునే ఆత్మరక్షణపోరాటంలో పడిపోయారు. దాన్ని కూడానిర్వర్తించలేక వైఫల్యాన్ని చవిచూశారు. భారత వికెట్‌ కీపర్‌గాపార్థివ్‌ పటేల్‌ కన్నా దినేష్‌ కార్తిక్‌నయమనిపించాడు.చూస్తే,భారత బ్యాట్స్‌మెన్‌ అందరూ కొమ్ములుతిరిగినవారే. ఇది వారి వైఫల్యమా, కెప్టెన్సీవైఫల్యమా అనేది తేలాల్సి ఉంది. ఒక్కవిజయంతోనే జూలు విదిల్చే గంగూలీ కెప్టెన్సీతీరు ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావంచూపుతున్న ఛాయలుకనపడుతున్నాయి. అతను విఫలంకావడంతో పాటు మిగతా ఆటగాళ్లవైఫల్యంలో అతని పాత్ర ఎంత అనేది కూడాఆలోచించాల్సి ఉంది. కెప్టెన్‌గా ఇంజమామ్‌ వుల్‌హక్‌ ఎంత నిబ్బరంగా వ్యవహరించాడో,అంత నిబ్బరంగా గంగూలీవ్యవహరించినట్లు కనిపించదు.కెప్టెన్‌గా గంగూలీ ఇంకా నేర్చుకోవాల్సినపరిస్థితిలోనే ఉన్నాడనిపిస్తుంది. రాహుల్‌ద్రావిడ్‌లో ఉన్న స్థయిర్యం, పెద్ద మనిషిలక్షణాలు గంగూలీలో లేవని చెప్పవచ్చు.ఏప్రిల్‌2వ తేదీ నుంచి ప్రారంభం కాబోయేవన్డే మ్యాచ్‌లపై టెస్టు మ్యాచ్‌లప్రభావం తప్పకుండా ఉంటుంది.లక్ష్మణ్‌ను, కుంబ్లేను వన్డేలకుదూరం చేసినంత మాత్రాన ఆస్థానంలో మరో ఇద్దరికి వేరేవారికిస్థానం కల్పించినంత మాత్రానభారత్‌ ఆటతీరులో కన్నా చూపించేఆత్మస్థైర్యంలో మార్పువస్తుందనుకోవడం అత్యాశేఅవుతుంది. ఓటమిలోనూ విజయంలోనూ ముఖంరంగులు మారని కెప్టెన్‌ మాత్రమేజట్టును ముందుకునడిపించగలడు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X