• search

మంచినీటితోసహా భారత్‌ వస్తున్న క్లింటన్‌

By Staff
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్‌: తెలుగుదేశం విజయరహస్యం ఏమిటి? ఒకవేళ తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే అందుకు తోడ్పడే కారణాలేమిటి? తెలుగుదేశం పార్టీ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బలం ఏమిటి? చంద్రబాబును ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌ టిఆర్‌ఎస్‌, వామపక్షాలతో పొత్తు పెట్టుకోవల్సిన అనివార్యతలో ఎందుకు పడింది? ఇవన్నీ ప్రశ్నలు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో డబ్బులు వెదజల్లుతుందనేది ఒక సాధారణ విమర్శ. అందులో నిజం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. నిజమేనని చెప్పడానికి సిద్ధిపేటలో గతంలో తెలుగుదేశం నాయకులు డబ్బుల మూటలతో పట్టుబడడాన్ని నిదర్శనంగా చూపవచ్చు. కానీ అంతకు మించినదేదో తప్పకుండా ఉండి ఉండాలి.

    తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌ నుంచి అధికార పగ్గాలు చేపట్టడం దగ్గరి నుంచి ఇప్పటి దాకా ఒక ప్రణాళిక ప్రకారం నడుచుకుంటూ పోతున్నారు. ఎదిరిపక్షం బలహీనతల మీద మాత్రమే ఆధారపడకుండా తన బలం పెంచుకునే వ్యూహరచన చేయడం, దాన్ని అమలు పరచడం చంద్రబాబులో ఉన్న ప్రధాన లక్షణం. కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా చంద్రబాబు పార్టీకి ఒక పకడ్బందీ నిర్మాణాన్ని ఇచ్చారు.

    వివిధ ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రతి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు లబ్ధి పొందే లాబీని తయారు చేసుకున్నారు. తద్వారా తమకు గుర్తింపు ఉన్నదనే భావనను కార్యకర్తల్లో, కింది స్థాయి నాయకుల్లో ఆయన కలిగించారు. జన్మభూమి కార్యక్రమం ద్వారా చేపట్టిన పనుల లబ్ధిని కింది స్థాయి నాయకులు పొందే అవకాశాలను కల్పించారు. దీని ద్వారా బడా కాంట్రాక్టర్ల స్థానంలో చోటా మోటా కాంట్రాక్టర్లు తయారయ్యారు. అదే పద్ధతిలో పనికి ఆహారం పథకం ద్వారా చేపట్టిన పనుల్లో ఈ విధమైన ప్రయోజనాన్ని ఆయన చూపించారు. దీంతో ప్రతి గ్రామంలోనూ తెలుగుదేశం పార్టీకి నమ్మకమైన కార్యకర్తల బలం చేకూరింది.

    జన్మభూమి, పనికి ఆహారం పథకం, ప్రజల ముంగిటకు పాలన, ఆకస్మిక తనిఖీలు వంటి కార్యక్రమాల ద్వారా ఆయన ప్రజలకు దగ్గర కావడానికి ప్రయత్నించారు. ఇదే సమయంలో తమ ప్రభుత్వం ఎంతో కొంత పని చేస్తుందనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించగలిగారు. కాంగ్రెస్‌ హయాంలో పనులేవీ జరగలేదని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాస్తో కూస్తో పనులు జరుగుతున్నాయని ఆయన ప్రజలను నమ్మించగలిగారు.

    దీనికి తోడు ఆయన ప్రచార సరళిని కాపీ కొట్టడం ఎవరి తరమూ కాదు. సమయానకూల ప్రచారాన్ని మీడియా ద్వారా చేపట్టడంలో ఆయనది అందె వేసిన చేయి. ఇదే పద్ధతి తెలుగుదేశం నాయకులకు వంటబట్టింది. మీడియాను మేనేజ్‌ చేసే పద్ధతిలో తెలుగుదేశం వారికి ఆయన శిక్షణా తరగతులు కూడా ఏర్పాటు చేశారు. తమకు ఎదురయ్యే విమర్శలకు హేతుబద్దమైన సమాధానాలు ఇవ్వడంలో వారి ఆరితేరి వుంటారు. వారితో వాదించి దారి మళ్లించడం చాలా కష్టమైన పని.

    ప్రతికూల పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవడం చంద్రబాబును మించినవారు లేరు. స్వాతంత్ర్యానంతరం ఎదిగివచ్చిన రాజకీయ నాయకుల్లోని లక్షణాలకు చంద్రబాబు ఒక మోడల్‌. ఆధునిక రాజకీయాలకు కొత్త అర్థం చెప్పినవాడు. అందువల్ల చంద్రబాబుపై గెలుపు సాధించగలమనే నమ్మకాన్ని ఇతర పార్టీల్లోని ఎంతటి నాయకుడైనా అలవోకగా ప్రదర్శించలేడు. ఒకవేళ రేపటి ఎన్నికల ఫలితం ఆయనకు వ్యతిరేకంగా వస్తే ప్రజలు చాలా గొప్పవారని అనుకోవాల్సి వుంటుంది. ఎన్టీఆర్‌ లాంటి నాయకుడినే ఓడించగలిగిన ప్రజలు ఎవరైనా ఓడించగలరు. ఇదొకటే ప్రతిపక్షాల ఆశ.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more