వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమెల్యేల బాధ

By Staff
|
Google Oneindia TeluguNews
మైక్రోసాప్ట్‌ సంస్థసిబ్బందిలో ఎంతో ఉత్కంఠ. కారణం వారు చూడబోయేప్రదర్శనకు ఎంతో ప్రత్యేకత ఉంది. రెండేళ్ళ బాలుడు 30మంది కంప్యూటర్‌ దిగ్గజాల ముందు లైవ్‌డెమో ఇవ్వబోతున్నాడు. అందరి ఎదురు చూపులు అతనిరాకకోసమే. అనుకున్న సమయానికి అర సెకను కూడా ఆలశ్యంచేయకుండా వచ్చాడా బాలుడు. తన ల్యాప్‌ టాప్‌ తీసి ఓవర్‌ హెడ్‌ ప్రొజెక్టర్‌ పైడెమాన్‌ స్ట్రేషన్‌ ఇచ్చాడు.అరగంట డెమోతో అందరూఅశ్చర్యపోయారు. చేతులను టేబుల్స్‌ మీద కొట్టి తమ సంతోషాన్నితెలియచేశారు. కొందరు చాక్లెట్లు ఇచ్చారు. మరికొందరుఐస్‌ క్రీంలు తినిపించారు.

ఇంతమందినితన్మయత్వానికి గురి చేసిన అతనే అజయ్‌.

రవిపురి, మమతాపురి దంపతులకు 1996లోహైదరాబాద్‌ లో జన్మించాడు. పువ్వుపుట్టగానే పరిమళిస్తుందనడానికి నిదర్శనం ఆ బాలుడు. కంప్యూటర్‌లో అతని ప్రతిభ అనన్య సామాన్యం.చిరుప్రాయంలోనే వర్డ్‌ 2000, ఎక్సెల్‌ 2000, పవర్‌ పాయింట్‌ 2000, ఔట్‌ లుక్‌ఎక్స్‌ ప్రెస్‌, ఇంటర్నెట్‌ ఎక్స్‌ ప్రెస్‌ లను అవలీలగా వాడుతున్నాడు.మైక్రోసాప్ట్‌ సంస్థ అజయ్‌ కి అవసరమైన సాప్ట్‌వేర్‌ ని ఉచితంగా అందజేస్తోంది. ముఖ్యమైనవిషయం ఏమిటంటే ఇతను సొంతంగా http://www.microsoftkid.com అనే వెబ్‌ సైట్‌ తయారుచేశాడు.క్లింటన్‌ ని కలిసి శెభాష్‌ అనిపించుకున్న ఈ బుడతడుత్వరలో బిల్‌ గేట్స్‌ ని కలిసేందుకు అమెరికా వెళ్ళబోతున్నాడు. ఈ కార్యక్రమానికిమైక్రోసాప్ట్‌, బ్యాంకాక్‌ కార్యాలయం ఏర్పాట్లుచేస్తోంది. అజయ్‌ కి ఎప్పటి నుంచో బిల్‌గేట్స్‌ ని కలవాలని ఉండేది. అయితే పరిస్థితులుఅనుకూలించక ఇంతకాలం పట్టింది. అని అజయ్‌ తాతబి.ఎన్‌.పురి ఇండియా ఇన్ఫో కి చెప్పారు. ఈయన ప్రస్తుతం బిర్లాగ్రూప్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ కి చీఫ్‌ కన్సల్టెంట్‌ గాపనిచేస్తున్నారు. అజయ్‌ బ్యాంకాక్‌ లో కె.జి. చదువుతున్నాడు. అతని తండ్రి రవి అక్కడేసెంచ్యురి టెక్స్‌ టైల్స్‌ కంప్యూటర్‌ విభాగంలోఆఫీసర్‌.

ఢిల్లీలోనేను పని చేసేప్పుడు ఒకసారి అజయ్‌ ని నాతో తీసుకెళ్ళాను. నా పని చేసుకుంటు అతనికి బోర్‌ కొట్టకుండా కంప్యూటర్‌ముందు కూర్చో పెట్టాను. తాతా తోడా బతావో అన్నాడు. ఎ బి సిడిలు కూడా రాని అతనికి రెండేళ్ళ ప్రాయంలో కంప్యూటర్‌మీద అవి నేర్పించాను. అతని జ్ఞాపకశక్తి కి నాకు మతిపోయింది. అలా వరసపెట్టి ఒకదాని తర్వాత మరొకటి నేర్చుకుంటున్నాడు. అనిబి.ఎన్‌.పురి తెలిపారు. తండ్రి రవిపురి సాఫ్ట్‌వేర్‌ రంగం లో ఉండటం అజయ్‌ కి ఎంతోఉపయోగపడుతోంది. ఆయన అజయ్‌ విషయంలో ప్రత్యేకశ్రద్ధ తీసుకుంటున్నారు. ఇండియాలో కన్నా బ్యాంకాక్‌లో అజయ్‌ కి ఎక్కువ ప్రచారం లభిస్తోంది.దీనివల్ల పలు కంపెనీలు తమ అడ్వర్టైజ్‌మెంట్‌ లలో మోడల్‌ గా చేసేందుకు ఆఫర్‌ఇస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఆ అవకాశాల్ని రవి తిరస్కరిస్తున్నారు.

ఇటీవల బిల్‌క్లింటన్‌ హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఆయన్నికలిసేందుకు అజయ్‌ కి అవకాశం లభించింది.బిజీలో సైతం క్లింటన్‌ కొద్ది క్షణాల పాటు అజయ్‌ తో మాట్లాడారు. ప్రధానివాజ్‌ పేయి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలువురు ఇతరప్రముఖులు ఈ బాలుడ్నిఅభినందించారు. సి.ఎన్‌.ఎన్‌, బి.బి.సి, సి.ఎన్‌.బి.సి, జీటీవి, స్టార్‌ ఫ్లస్‌, ఈ టీవి, జెమిని టీవీలు అజయ్‌ గురించి ప్రత్యేక స్టోరీల్నిటెలికాస్ట్‌ చేశాయి.

భవిష్యత్తులో బిల్‌గేట్స్‌ అంతటి వాడిని కావడమే తన లక్ష్యం అని చెప్పే ఈహైదరాబాద్‌ బాలుడు వెబ్‌ సైట్‌ లో తన గురించిఅన్ని వివరాల్ని పొందుపరిచాడు.

ఎంతో ఆకర్షించే ఈసైట్‌ లో యానిమేషన్లు కూడా అతను రూపొందించినవే కావడంవిశేషం.

-ఉండవల్లిపవన్‌ కుమార్‌

గతసంచికల్లో.......

పురాతన కళకు ఆధునిక రూపం
మొగలాయి కళ, రాజస్ధానీ పనితనం కలగలిస్తే తేవా ఆభరణాలవుతాయి. అరుదైన ఈ కళారూపాల ఎగ్జిబిషన్‌ హైదరాబాద్‌ లో ప్రారంభమైంది. గాజు, బంగారంతో తయారయ్యే ఈ హస్తకళా వస్తువులు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి.


దద్దోజనంహేయం! దున్నపోతు దివ్యం!!
దద్దోజనం, పులిహోరలప్రసాదమేమో పాపమా? దున్నపోతుల, మేకల, గొర్రె తలలు నరకడమేమో పుణ్యమా?ఇదేనా కంచె ఐలయ్య సంస్కారం అని ప్రశ్నిస్తున్నారుఎంవిఆర్‌ శాస్త్రి.


ఐలయ్య లీల
భారతదేశ నిజ జీవితానికి ఐలయ్య పట్టిన అద్దంఎటువంటిది? చలిదేశపు అమెరికా రాయబారిగారికే వణుకు పుట్టేంతటి భారతదేశపువాస్తవాలుఈ పుస్తకంలో ఏమి ఉన్నాయి?


సరస్వతికి చదువొచ్చా?!
పురాణగాథలను తలా తోకా లేకుండా వెర్రిమొర్రిగా వక్రీకరించే పామరత్వం గురించి వేణుగోపాల శతకకారుడు ఏనాడో చేసిన వ్యాఖ్య ఐలయ్యగారి ప్రవచనాలకు చక్కగా నప్పుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X