వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ చిన్నారిని ఆదుకుందాం

By Staff
|
Google Oneindia TeluguNews
హైదరాబాద్‌:సానియా మీర్జా పేరు ఇవాళ్లప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది.మెల్‌బోర్న్‌లో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌లోసానియా సెరీనా విలియమ్స్‌ చేతిలోఓడిపోయినప్పటికీ గెలిచినంత కీర్తివచ్చేసింది. పద్దెనిమిదేళ్ల హైదరాబాదీసానియా మీర్జా టెన్సిస్‌ తార కావడానికిపడిన శ్రమ చిన్నదేమీ కాదు.ఇప్పుడామె భారత యువతలకు రోల్‌మోడల్‌ అయింది.ఆస్ట్రేలియాఓపెన్‌ టెన్సిస్‌ టోర్నమెంట్‌లో మూడోరౌండ్‌కు చేరిన తొలి భారతమహిళగా సానియా రికార్డుసృష్టించింది. రెండు వేల మూడులో ఆమెవింబుల్డన్‌ డబుల్స్‌లో విజయంసాధించినప్పుడే అందరి కండ్లు ఆమెపైపడ్డాయి. తన కలలను సాకారంచేసుకోవడానికి సానియా మీర్జానిరంతరం పాటు పడుతూ ఉంటుంది.సానియామీర్జాతో సినిమా తీయడానికి ఒక తెలుగుచలన చిత్ర నిర్మాత ఆసక్తి చూపాడు.అయితే సానియా తల్లి సున్నితంగానేతిరస్కరించింది. సానియాకు నాన్‌ వెజ్‌ అంటేఇష్టం. ఆమెకు ఫ్రెండ్స్‌ కూడా తక్కువేనట.మ్యూజిక్‌ వినడానికి ఆమె ఎక్కువఇష్టపడుతుంది. ర్యాప్‌, హిందీ రీమిక్స్‌ అంటేసానియా చెవులు కోసుకుంటుంది. స్విమ్మింగ్‌ఆమెకు చాలా ఇష్టం.పందొమ్మిదివందల ఎనబై ఆరు నవంబర్‌పదిహేనవ తేదీన సానియా మీర్జాజన్మించింది. ఒక్క రోజు ముందయితే భారతప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూపుట్టిన తేదీ సానియా పుట్టిన తేదీఒక్కటే అయ్యేది. ఆరేళ్ల నుంచే సానియాటెన్నిస్‌ బ్యాట్‌ పట్టడం మొదలు పెట్టింది.ఆమె కోచ్‌ సికె భూపతి. ఈయనెవరోకాదు, భారత్‌ టాప్‌ టెన్సిస్‌ స్టార్‌మహేష్‌ భూపతి తండ్రి. తండ్రిఇమ్రాన్‌ మీర్జాకు, తల్లి నాసిమాకుతమ కూతురు సానియానకు స్టెఫీగ్రాఫ్‌లా చూడాలనేది కల. సానియా రోల్‌మోడల్‌ కూడా స్టెఫీ గ్రాఫ్‌. అయితేభారత క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌అంటే ఆమెకు అభిమానం. ఈ విషయాన్ని ఆమెమీడియాతో చెప్పింది కూడా.సానియాకుఏడాదికి నలబై లక్షల రూపాయల దాకా ఖర్చువస్తుందట. రాష్ట్ర ప్రభుత్వమే ఆమెఖర్చును భరిస్తోంది. ఇప్పుడుఅడ్వర్టయిజర్లు కూడా ఆమె కోసం క్యూకడుతున్నారు. బోరిస్‌ బెకర్‌కుశిక్షణ ఇచ్చిన బాబ్‌ బ్రెట్‌ వద్ద శిక్షణతీసుకోవాలని సానియా ఆరాటపడుతోందట.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X