వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భువనేశ్వరి యాగ లక్ష్యం?
స్పీకర్ పదవిని తెలుగుదేశం పార్టీ సూచించిన అభ్యర్ధికి కట్టబెట్టడానికి ఎన్‌డిఎ నేతలు సిద్ధంగా వున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కులం చెడ్డా సుఖం దక్కాలనే సామెతను గుర్తుచేస్తూ ఏకంగా ఎన్‌డిఎ సర్కారులోనే చేరాలన్నంత ఉబలాటంతో వున్న తెలుగుదేశం ఎంపీలకు అగ్రనేత వైఖరి మింగుడుపడటం లేదు. ఎన్‌డిఎ నేతలు ఇప్పటికే పలు దఫాలు స్పీకర్ అభ్యర్ధి విషయం చంద్రబాబు వైఖరిని స్పష్టం చేయాల్సిందిగా కోరారు. ఆయన మాత్రం ఇంకా ఆలోచించుకోవాలనే చెబుతున్నారు. లోక్‌సభలో కాంగ్రెస్‌కు చెందిన సయీద్ ( డిప్యూటీ స్పీకర్) సభాపతిగా వున్నకారణంగా, గుజరాత్‌పై చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా బయటపడాల్సి వచ్చిందని ఎన్‌డిఎ నేతలు వాపోతున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!