వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో తెలంగాణ పిక్నిక్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ఈ పిక్నిక్‌కు వందకు పైగా కుటుంబాలు హాజరయ్యాయని తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరమ్‌ (టిడిఎఫ్‌) సభ్యుడు కరుణాకర్‌ నేరవెట్ల దట్స్‌ తెలుగు డాట్‌ కామ్‌కు తెలియజేశారు. ఆడుతూ పాడుతూనే తెలంగాణ పాట పాడాలనేది ఈ పిక్నిక్‌ ఉద్దేశంలా కనిపిస్తోంది. పరుగుపందెం, టగ్‌ ఆఫ్‌ వార్‌, వాటర్‌- బెలూన్‌ టాసింగ్‌ వంటి పోటీలను నిర్వహించారు. ఈ పిక్నిక్‌లో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ పాల్గొన్నారు.

పనిలో పనిగా రిటైర్డ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగి లక్ష్మారెడ్డి తన అనుభవాలను వినిపించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణకు వ్యతిరేకంగా 1955లో నడిచిన విద్యార్థి ఉద్యమంలో తన అనుభవాలను ఆయన వివరించారు. తనను, తన సహచరులను పోలీసులు ఎలా చితకబాదింది ఆయన చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాజకీయ పార్టీలు, నాయకులు, వ్యక్తులు ఒకే గొడుగు కిందికి రావడానికి అమెరికాలోని తెలంగాణవారు ఏకమై, కార్యాచరణకు దిగడం ద్వారా మార్గం చూపాలని ఆయన కోరారు.

పిక్నిక్‌లో తెలంగాణ గేయాలు మారుమ్రోగాయి. వచ్చే పిక్నిక్‌కు ప్రతి ఒక్క కుటుంబం మరో మూడు కొత్త కుటుంబాలను తెస్తామని హామీ ఇచ్చాయి. పిక్నిక్‌కు హాజరైన వారందరికీ టిడిఎఫ్‌ కో ఆర్డినేటర్‌ మధు రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. సుధాకర్‌ పైళ్ల, కరుణాకర్‌ నేరవెట్ల, సురేందర్‌ మద్ది, సుధీర్‌ కోదాటి, అర్జున్‌ రెడ్డి, రవి మేరెడ్డి, వెంకట్‌ మారోజులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

టిడిఎఫ్‌ స్థానిక కోఆర్డినేటర్లు చికాగో, బోస్టన్‌, వాషింగ్టన్‌ డిసి, శాన్‌ఫ్రాన్సిస్కోలలో ఇటువంటి పిక్నిక్‌లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X