వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేదల గుండెలుదోచిన గజదొంగ - వీరప్పన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

పని చేయడానికి ముందుకు వచ్చే రచయితలను, కళాకారులను తమ చెప్పుచేతల్లో పెట్టుకుని తమకు అనుకూలంగా పని చేయించుకోవాలనే ముఠా తత్వం మరో ప్రధాన అడ్డంకి. ఈర్ష్య, ద్వేషాలు, అపనమ్మకాలు పెచ్చరిల్లిపోయిన తెలుగు సాహిత్య రంగంలో ఉమ్మడి కార్యక్రమాలంటూ అడపాదడపా జరిగే వీలుందే తప్ప ఒక నిర్దిష్ట మార్గంలో, నిర్దిష్ట లక్ష్యంతో, నిరంతరాయంగా పనిచేయడానికి తగిన వాతావరణం లేదు. ఈ వాతావరణం ఏర్పడాలంటే రచయితలు, కవులు తమ అహంకారపు వలువలను విడిచేయాల్సి వుంటుంది. ఆధిపత్యపు ధోరణులకు స్వస్తి చెప్పాల్సి వుంటుంది.

అభిప్రాయభేదాలను గౌరవిస్తూ అభిప్రాయాలు ఏకీభవించే చోట కలిసి పని చేసే అవకాశం ఉన్నదనే విషయాన్ని చాలా మంది సాహితీ పెద్దలు మాట వరుసకు అంగీకరిస్తారే తప్ప ఆచరణలో దానికి పూర్తి భిన్నంగా వ్యవహరించడమే ఈ దుస్థితి కారణం. తమతో చిన్న విషయాల మీద విభేదించినా సరే వారిని అరాచకవాదులుగా ముద్ర వేసి బద్నాం చేసి దెబ్బ తీయాలనే తెర వెనుక కుట్రలు ఆగిపోతే తప్ప తెలుగు సాహిత్యానికి నిష్కృతి లేదు. అప్పుడే ఐక్యవేదికలు పని చేసే వీలుంటుంది. కీర్తి కాంక్షలు, ఇతరుల రచనలు అచ్చవుతుంటే చూసి ఓర్వలేనితనాలు, అచ్చేయించుకోవడానికి, అచ్చు కాకుండా చూడడానికి దొడ్డి దారులు తొక్కడాలు ఆపితే తప్ప తెలుగు సాహిత్య ప్రక్షాళన జరగదు. అప్పటి వరకు ఐక్య వేదికలు,
ఉమ్మడి కార్యక్రమాలు గాలికి కొట్టుకుపోయే దూదిపింజలు మాత్రమే అవుతూ వుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X