వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దియా మిర్జా ఫోటో గ్యాలరీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:రెండు ప్రాంతాల విలీనం ద్వారాఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు అనే చారిత్రకతప్పిదాన్ని సరిదిద్ది తెలంగాణ రాష్ట్రఏర్పాటుకు సహకరించవలసిందిగాతెలంగాణ కళాకారులు, కవులు,రచయితలు రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్‌కలామ్‌ను కోరారు. ఈ మేరకు తమసంతకాలతో ఒక వినతిపత్రాన్ని ఆయనపంపారు. ఈ వినతిపత్రం ప్రతులనుప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌కు,ప్రధాన రాజకీయ పార్టీల నాయకులకుపంపించారు. ఈ వినతిపత్రంపై 159 మందిసంతకాలు చేశారు. తెలుగు చలనచిత్రదర్శకుడు, చిత్రకారుడు, కవి బి.నర్సింగరావుతో పాటు కేంద్ర సాహిత్యఅకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్యనవీన్‌, ప్రముఖ చిత్రకారులువైకుంఠం, ఏలె లక్ష్మణ్‌, ప్రముఖరచయిత బి.యస్‌. రాములు, కవి,రచయిత, పరిశోధకుడు జయధీర్‌తిరుమలరావు, కవి స్కైబాబ,కవయిత్రులు షాజహానా, సుభద్ర, ప్రముఖకథా రచయిత అల్లం రాజయ్య, ప్రముఖకవులు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి,పులిపాటి గురుస్వామి ఈ వినతిపత్రంపైసంతకాలు చేసినవారిలో ఉన్నారు.తెలంగాణరాష్ట్ర డిమాండ్‌ ఉద్యమంలో తాముతమ వంతు పాత్రనిర్వహిస్తున్నామని, రాజకీయాలతోసంబంధం లేకుండా తాము తెలంగాణప్రజల ఆకాంక్షలను తమ కళారూపాల్లోప్రతిబింబిస్తున్నామని వారు చెప్పారు.తెలంగాణ ఏర్పాటు డిమాండ్‌ కేవలంఆర్థికపరమైందే కాదని, దాని వెనకసామాజిక, సాంస్కృతిక, భౌగోళిక అస్తిత్వంఇమిడి ఉందని వారన్నారు. ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రంలో తెలంగాణ భాష, సాహిత్యం,ఇతర కళారూపాలు వక్రీకరణకుగురయ్యాయని, ఈ విషయాలనుఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాఆధిపత్య ఆంధ్ర సాహిత్యకారులు వాటినిపట్టించుకోలేదని వారన్నారు.రాజకీయఉద్యమాలకు అతీతంగా తాము తెలంగాణపట్ల చూపుతున్న వివక్షను, దోపిడీనిఎప్పటికప్పుడు ఎత్తిచూపుతున్నామనివారు తెలియజేశారు. తెలంగాణఉద్యమం ఒక కీలకమైన,నిర్ణయాత్మక దశకు చేరుకున్నప్రస్తుత తరుణంలో ప్రజల ఆకాంక్షలకుఅద్దం పడుతున్న రచయితలుగా,కళాకారులుగా తమ విజ్ఞప్తిని పరివీలించాలనివారు కోరారు. తెలంగాణ ఏర్పాటు అనేదికేవలం రాజకీయపరమైనడిమాండ్‌ మాత్రమే కాదని స్థానిక ప్రజలఆకాంక్ష అని వారు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X