• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సర్పదోషమే సచిన్‌ శత్రువు

By Staff
|

భారత క్రికెట్‌ మేటి బ్యాట్స్‌మన్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఫామ్‌ కోల్పోవడానికి సర్పదోషమే కారణమట. భుజానికి లండన్‌లో శస్త్రచికిత్స చేసుకుని తిరిగి వచ్చిన సచిన్‌ టెండూల్కర్‌ మంగళూర్‌లోని ఆది సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో సర్పదోష నివారణ పూజలు నిర్వహించారు. సర్పదోషం వల్ల, గ్రహస్థితులు బాగా లేనందున సచిన్‌ ఫామ్‌ కోల్పోయినట్లు పూజారులు తేల్చారు. వాటి నివారణకు పూజలు కూడా మొదలు పెట్టారు. సచిన్‌ ఆదివారంనాడు ప్రత్యేక పూజలు నిర్వహించి, హారతి ఇచ్చారు. సర్ప సంస్కార సేవ కూడా చేశారు.

సర్పాలు ఆగ్రహం చెందడానికి సచిన్‌ కారకుడు కాడని, అతని పూర్వీకులెవరో నాగుపామును చంపి ఆచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించలేదని, ఆ దోషం సచిన్‌ను పట్టుకుందని దేవాలయ పూజారి వి.యస్‌. నాయక్‌ అంటున్నారు. అది సచిన్‌పై ప్రభావం చూపుతోందని ఆయన ఒక ఆంగ్ల దినపత్రిక ప్రతినిధితో అన్నారు. ఈ సర్పదోషాన్ని నివారించే ప్రక్రియ సుబ్రహ్మణ్య ఆలయంతో తప్ప మరో చోట జరగదని ఆయన దృఢంగా పలుకతున్నారు. ఈ దేవాలయ పవిత్రత, శక్తి ఎనలేదని అని చెబుతున్నారు. సచిన్‌ మరో రెండు సేవలు కూడా నిర్వహించాల్సి ఉండిందట. అయితే సమయం లేనందున రెండు మాత్రమే నిర్వహించారట.

సచిన్‌ దేవాలయంలో భక్తులు, అభిమానులు చుట్టుముట్టారు. వ్యక్తిగత భద్రతా సిబ్బంది, కొద్ది మంది పోలీసులు పరిస్థితిని చక్కదిద్దడానికి విపరీతంగా కష్టపడాల్సి వచ్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X