• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దియా మిర్జా ఫోటో గ్యాలరీ

By Staff
|

భారతక్రికెట్‌ నియంత్రణ మండలి (బిసిసిఐ)సెలెక్టర్లను జోనల్‌ ప్రాతిపదికపైనియమించే పద్ధతికి స్వస్తి చెప్పేంతవరకు ఏ కోచ్‌ కూడా ఏమీ చేయలేడనిభారత క్రికెట్‌ జట్టు మాజీ కోచ్‌,న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ జాన్‌రైట్‌ అన్నారు. జట్టు ఎంపిక వ్యవహారంలోపూర్తి ప్రొఫెషనలిజం ఉండాలని ఆయనఅభిప్రాయపడ్డారు. సరైన పద్ధతిలోఫలితాలు రాబట్టడానికి సరైన వ్యక్తులుఉండాలని ఆయన అన్నారు. "మంచి కోచింగ్‌సిస్టమ్‌ ఉండవచ్చు, మంచి కోచ్‌లుఉండవచ్చు. కానీ అయితే ఎంపిక విధానంసరిగా లేకపోతే నీకు నువ్వే కష్టాలుతెచ్చి పెట్టుకోవడమవుతుంది అని ఆయనఅన్నారు.జోనల్‌ప్రాతిపదికపై జాతీయ సెలెక్టర్ల ఎంపిక ఏమాత్రం ఉపయోగపడదని, బిసిసి ఐ దీన్నిపునస్సమీక్షించుకోవాల్సి ఉందని, ఎంపికలోఅన్ని దేశాల్లో మాదిరిగా ప్రొఫెషనలిజం ఉండాలనిఆయన అన్నారు. రైట్‌ విజ్డన్‌ ఆసియాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనఅభిప్రాయాలను నిర్మొహమాటంగావెల్లడించారు. "రైట్‌ నెంబర్‌ ఏదిఅనేది నేను కచ్చితంగా చెప్పలేను. ఇదిచాలా కష్టమైన పని. కీలకమైన పనికూడా. అయితే ఇది సరైన వ్యక్తులనుఎంపిక చేయడం అని ఆయన అన్నారు.కోచ్‌లకుమాదిరిగానే సెలెక్టర్లకు నిర్దిష్టకాలపరిమితి ఉండాలని, ఫలితాలను రాబట్టనిపక్షంలో వారిని తొలగించే అవకాశం కూడాఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిపనితీరుకు సంబంధించినవ్యవహారమని, కోచ్‌గా విఫలమైతేతలుపులు మూసేస్తారని, అలాగే మంచిజట్టును ఎంపిక చేయకపోతే కూడా అదేపరిస్థితి ఉండాలని ఆయన అన్నారు.సెలెక్షన్‌ కమిటీ సమావేశాలకుహాజరయ్యే అవకాశం కోచ్‌గా ఉన్నప్పుడుతనకు ఉన్నప్పటికీ ఓటింగ్‌ హక్కులేదని, ఇది బాధాకరమని ఆయనఅన్నారు."నువ్వుసమావేశంలో ఉంటే నిర్ణయాల్లో నువ్వుకూడా భాగస్వామివని ఆటగాళ్లుఅనుకుంటారు. అయితే నాకు ఓటు హక్కులేనప్పుడు నేను సమావేశాలకు హాజరుకాకుండా ఉండాల్సింది అని జాన్‌ రైట్‌ అన్నారు.కెప్టెన్‌ బాధ్యతలను స్వీకరించడానికిరాహుల్‌ ద్రావిడ్‌ సిద్ధంగా ఉన్నాడని,అతనికి అవకాశం లభిస్తుందనేనమ్మకం తనకు ఉన్నదని, ఆఅవకాశం ఇస్తే మంచిదని ఆయన అన్నారు.భారత క్రికెట్‌ జట్టు కోచ్‌గా ఉండడంతనకు ఎంతో సంతృప్తినిచ్చిందనిఆయన అన్నారు. తాను ఆటగాళ్లను,దేశాన్ని, ఆ దేశ ప్రజలను మిస్‌ అవుతున్నఅనుభూతికి లోనవుతున్నానని ఆయనఅన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more