వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక డాక్టర్‌ అమితాబ్‌ బచ్చన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:నక్సల్స్‌ అణచివేతకు ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిపూర్తి స్థాయిలో సమాయత్తంఅవుతున్నారు. అదే సమయంలోప్రపంచ బ్యాంక్‌ కౌగిలికి కూడాదగ్గరవుతున్నారు. సంస్థాగతసర్దుబాటు రుణం కోసం ఆయనమంగళవారంనాడు న్యూఢిల్లీలోప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధులతో చర్చలుజరిపారు. ప్రపంచ బ్యాంక్‌ నుంచి సర్దుబాటురుణాన్ని తీసుకుంటే ప్రతిఘటిస్తామనిసిపియం రాష్ట్ర కమిటీ కార్యదర్శి బి.వి.రాఘవులు చేసిన హెచ్చరిక ఏ మాత్రంపని చేసే సూచనలు కనిపించడం లేదు.సంస్కరణల అమలు విషయంలో ఆయనప్రపంచ బ్యాంక్‌ కౌంటీ డైరెక్టర్‌మైఖెల్‌ కార్టర్‌ అభినందనలనుకూడా ఆయన అందుకున్నారు. రైతులకుఉచిత విద్యుత్‌ ఇచ్చే విషయంలో ఆయనఇప్పటికే కొన్ని మార్పులు చేసి దాన్ని కొంతమందికే పరిమితం చేశారు. అదేసమయంలో తెలుగుదేశం ప్రభుత్వహయాంలో ప్రైవేట్‌ విద్యుత్‌ కంపెనీలతోకుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోలుఒప్పందాలను సమీక్షిస్తామని చెప్పినవైయస్‌ ఆ తర్వాత వాటిని ముట్టుకోనేలేదు. దానికి తోడు ప్రైవేట్‌ కంపెనీలతోఆయన వ్యవహరిస్తున్న తీరుమరింత భారంగా పరిణమించే సూచనలుకనిపిస్తున్నాయి. తిరుపతిలో ఒక బడానాయకుడి విద్యుత్‌ కంపెనీకివిద్యుత్పాదన లేకుండానే కోట్లరూపాయలు ముట్టజెప్పుతున్న వైనంఅందుకు ఒక్క ఉదాహరణ మాత్రమే.బహుశా,ఈ సంస్కరణల అమలులో ప్రపంచ బ్యాంక్‌నిబంధనలను పాటించడంలోభాగంగానే రాజశేఖర్‌ రెడ్డిప్రభుత్వం చర్చలకు గండికొట్టిఉంటుంది. మాటలేమైనప్పటికీ రాష్ట్రప్రభుత్వం చేతలు నక్సలైట్‌సమస్యను శాంతి భద్రతలసమస్యగానే పరిష్కరించేందుకుపూనుకోవడానికిసర్వసన్నద్ధమవుతున్నసూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోఇప్పటి వరకు జరిగిన ఎన్‌కౌంటర్లు ఆవిసయాన్ని సూచనప్రాయంగాతెలియజేసినప్పటికీ న్యూఢిల్లీలోఆయన కేంద్ర హోం మంత్రి శివరాజ్‌పాటిల్‌కు చేసుకన్న విజ్ఞప్తులు దాన్నిమరింత స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంనుంచి వెనకకు తీసుకున్న సిఆర్‌పియఫ్‌ బలగాలను తిరిగి రాష్ట్రానికిఇవ్వాలని ఆయన కేంద్ర హోంమంత్రినికోరారు. దానికి తోడు నాలుగుహెలికాప్టర్లను కూడా ఇవ్వాలని ఆయనవిజ్ఞప్తి చేశారు. పోలీసు డైరెక్టర్‌జనరల్‌ (డిజిపి) స్వరణ్‌జిత్‌ సేన్‌హెలికాప్టర్లపై ఎడతెగని మక్కువప్రదర్శిస్తున్నారు. నల్లమల అడవుల్లోనక్సల్స్‌ స్థావరాలను లక్ష్యంగాఎంచుకుని గాలింపు చర్యలు చేపట్టినవిషయం తెలిసిందే. ఈ స్థితిలో గతచంద్రబాబునాయుడి పాలనలో కన్నాఎక్కువ కఠినంగా నక్సలైట్ల వైయస్‌ప్రభుత్వం వ్యవహరించబోతోందనిచెప్పడానికి నిదర్శనాలేమీ అక్కర్లేదు.వైయస్‌ వ్యవహార శైలి ఆ విషయాన్నిస్పష్టంగా చెబుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X