వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామస్వామికికీలకపదవి

By Staff
|
Google Oneindia TeluguNews

ప్రొఫెసర్‌ కొత్తపల్లిఆంజనేయులు (ఏరోనాటిక్స్‌ తదితరరంగాల్లో విశిష్ట సేవలు)

ఏరోనాటిక్స్‌, స్పేస్‌ఇంజినీరింగ్‌, ఎడ్యుకేషన్‌ రంగాల్లో విశిష్ట సేవలకు గుర్తింపుగాతానా అవార్డు పొందారు. ఫ్లోరిడా స్టేట్‌ యూనివర్సిటీలోమెకానికల్‌ ఇంజినీరింగ్‌ డిపార్ట్‌ మెంట్‌ వ్యవస్ధాపక సభ్యులు.నూట యాభై పరిశోధన వ్యాసాలు రాశారు.ఏరోనాటిక్స్‌, స్పేస్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీరంగాల్లో అనేక సంస్ధలను స్ధాపించారు.

డాక్టర్‌ కాకర్ల సుబ్బారావు (వైద్య, ఆరోగ్య రంగాల్లో విశిష్ట సేవలు)

హైదరాబాద్‌ లో నిమ్స్‌డైరెక్టర్‌ గా సేవలు అందిస్తున్న డాక్టర్‌ కాకర్ల సుబ్బారావు అమెరికా వెళ్ళినతొలి తరం వైద్య నిపుణులలో ఒకరు. 1986 లో ఇండియావచ్చేవరకు ఆయనఅమెరికాలోని ఐన్‌ స్టీన్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో రేడియాలజీ ప్రొఫెసర్‌ గా ఉన్నారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌ టి రామారావుఆహ్వానం మేరకు ఆయన హైదరాబాద్‌ వచ్చినిజామ్స్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ను స్ధాపించారు.

1993 నుంచి 98 వరకు ఇండియన్‌ కాలేజ్‌ఆఫ్‌ రేడియాలజీ అండ్‌ ఇమేజింగ్‌ అధ్యక్షుడిగాఉన్నారు. భారత దేశంలో కంటిన్యూడ్‌మెడికల్‌ ఎడ్యుకేషన్‌ కార్యక్రమాలను ప్రారంభించింది డాక్టర్‌కాకర్లే. భారత రేడియాలజిస్టుల సంఘం ఆయనకు'రేడియాలజిస్ట్‌ ఆఫ్‌ ది మిలీనియం' అవార్డుఇచ్చింది. వైద్యంలో విశిష్ట సేవలు అందించినందుకుఆయనకు భారత ప్రభుత్వం 'పద్మశ్రీ' పురస్కారంఇచ్చింది. కృష్ణాజిల్లాపెద ముత్తేవి గ్రామంలో సామాన్య రైతుకుటుంబంలో 1925 లో కాకర్ల సుబ్బారావు పుట్టారు. 1977లోఆయన తానా వ్యవస్ధాపక అధ్యక్షుడు.

డాక్టర్‌ జాస్తివెంకట రత్తయ్య ( వితరణశీలిగావిశిష్ట సేవలు)

దానశీలిగాసమాజాభివృద్ధికి కృషి చేసినందుకు తానాఅవార్డుకు డాక్టర్‌ జాస్తి వెంకట రత్తయ్యను ఎంపికచేశారు. తెనాలి సమీపంలోని బోడపాడుగ్రామంలో 1928 లో పుట్టిన రత్తయ్యమద్రాసు ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచిఏరోనాటిక్స్‌ లో ఇంజినీరింగ్‌ పట్టా పొందిన తొలి విద్యార్ధులబృందంలో రత్తయ్య ఒకరు. 1952 లోనే అమెరికావచ్చి స్ధిర పడిన ఆయన యాభై ఏళ్ళుగాప్రవాసాంధ్రుల కోసం వివిధ రంగాల్లో విశిష్ట సేవలు చేశారు.హైదరాబాద్‌ లోని ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రికిఇతోధికంగా విరాళం అందజేశారు.

ఇంకా ఎక్స్‌ లెన్స్‌ ఇన్‌లీడర్‌ షిప్‌, బిజినెస్‌ అచీవ్‌ మెంట్స్‌కేటగిరిలో పువ్వాడ వెంకటపతి రావు, కమ్యూనిటీసర్వీసులో వెంకయ్య దామా, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో రాధాకృష్ణ చెట్టిపండిపాటి, బెస్ట్‌ ఉమన్‌ ఎగ్జిక్యూటివ్‌ గా మీనాముత్యాల, ఉత్తమ మహిళా హక్కుల కార్యకర్తగా డాక్టర్‌ శ్యామలారాజేందర్‌, మెడిసిన్‌ లో అప్పారావు ముక్కామల,న్యాయ రంగంలో ఆషా రెడ్డి, సమాజ సేవలో రామ్‌నున్నా, శిల్ప కళారంగంలో లక్ష్మీ నారాయణ గిడుతూరి,సమాజసేవ, వైద్యంలో రమేష్‌ బాబు రాయపు,సమాజసేవ, రసాయన శాస్త్రంలో గుత్తికొండరవీంద్ర నాథ్‌ అవార్డులు పొందారు. తానా మ్యాన్‌ ఆఫ్‌ దిఇయర్‌ గా టి. సుబ్బరామి రెడ్డి, ఉమన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ గామార్గదర్శి ఎండి శైలజా కిరణ్‌, లైఫ్‌ టైమ్‌అచీవ్‌ మెంట్‌ అవార్డుకు ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్‌ ఎంపికైన విషయం తెలిసిందే.

(తానా సావనీర్‌'కౌముది' సౌజన్యంతో)

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X