వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతాప్‌పై నోయల్‌ మండిపాటు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఒకప్పటి తన క్రికెట్‌ సహచరుడు వంకా ప్రతాప్‌పై మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ నోయల్‌ డేవిడ్‌ తీవ్రంగా మండిపడుతున్నట్లు సమాచారం. ప్రతాప్‌పై న్యాయపోరాటానికి దిగాలనుకుంటున్నట్లు హైదరాబాద్‌లోని క్రికెట్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అభిజిత్‌ కాలే భారత సెలెక్టర్లకు లంచం ఇవ్వజూపాడనే ఆరోపణల నేపథ్యంలో మాజీ హైదరాబాద్‌ క్రికెట్‌ క్రీడాకారుడు వంకా ప్రతాప్‌ కొన్ని ఆరోపణలు చేశారు. సెలెక్టర్లకు డబ్బులు ఇవ్వాలని ఒక మధ్యవర్తి తనను సంప్రదించాడని ఆయన ఆరోపించారు. దాంతో ఆగకుండా ఆఫ్‌ స్పిన్నర్‌ నోయల్‌ డేవిడ్‌ను భారత జట్టుకు ఎంపిక చేయడం పట్ల చాలా మంది ఆశ్చర్యపోయారని, హైదరాబాద్‌ జట్టుకు ఎంపిక కావడమే కష్టమైన నోయల్‌ డేవిడ్‌ భారత క్రికెట్‌ జట్టుకు ఎంపికయ్యాడని, ఇది ఆ ఆశ్చర్యానికి కారణమని ప్రతాప్‌ ఆరోపించారు.

ప్రతాప్‌కు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోయేషన్‌ (హెచ్‌సిఎ) షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. అయితే తాను ఎవరి మీదా ప్రత్యేకంగా ఆరోపణలు చేయలేదని వంకా ప్రతాప్‌ ఇప్పుడు అంటున్నారు. ఏమైనా ఆయన తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. హేమీహేమీలందరూ ప్రతాప్‌పై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. దాంతో పాటు నోయల్‌ డేవిడ్‌ తీవ్రంగా మనస్థాపానికి గురై వంకా ప్రతాప్‌పై చర్యకు దిగబోతున్నారు. ఈ విషయమై ఆయన భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు జగ్‌మోహన్‌ దాల్మియాతో మాట్లాడినట్లు సమాచారం. నోయల్‌ డేవిడ్‌ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ వివాదం ఇలా సాగుతుండగానే బిసిసిఐపై ఏదో రూపంలో క్రికెటర్లు తమ అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వీరి తీరు చూస్తుంటే క్రికెటర్ల పట్ల క్రికెట్‌ అసోయేషన్లు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X