వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'రియల్' బూమ్: గణేషుడి లడ్లు

By Staff
|
Google Oneindia TeluguNews


హైదరాబాద్ శివార్లలోని గణేష్ లడ్డుల ధర ఈ ఏడాది గణనీయంగా తగ్గుముఖం పట్టింది. నిరుడు వేలం పాటల్లో విశేషంగా గణేషుడి లడ్లు ధరలు పలికాయి. ఈసారి ఆ స్పందన కనిపించలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గుముఖం పట్టడమే దీనికి కారణమని భావిస్తున్నారు. హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లాలోని భూములకు ఎక్కడ లేని గిరాకీ వచ్చింది. భూముల విక్రయంతో స్థానికులు ఉన్న ఫళాన సంపన్నులైపోయారు. కార్లు, బంగారం నగలు కొనుక్కుని తమ సంపన్నతను చాటుకోవడమే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో కూడా దాన్ని ప్రదర్శించుకుంటూ వస్తున్నారు. అందువల్లనే నిరుడు వినాయకుని లడ్లకు కూడా విశేషంగా ధరలు పలికాయి. ఈ మధ్య కాలంలో రియల్ వ్యాపారం మందగించింది. ఇది గణేషుడిపై కూడా పడింది.

నిరుడు ఏడున్నర లక్షల రూపాయలు పలికిన మహేశ్వరం వినాయకుడి లడ్డు ఈ ఏడాది లక్షా 20 వేల రూపాయలు మాత్రమే పలికింది. మరో వినాయకుడి లడ్డు నిరుడు 4 లక్షలు రూపాయలు పలికితే ఈ ఏడాది 84 రూపాయలు మాత్రమే పలికింది. అలాగే సర్దార్ నగర్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నిరుడు సర్దార్ నగర్ వినాయకుడి లడ్డు నిరుడు 15 లక్షల రూపాయలు పలికింది. ఈసారి అక్కడ వినాయకుడి మండపం కూడా లేదు. మైలారుదేవుపల్లి వినాయకుడి లడ్డు రెండున్నర లక్షల రూపాయలు పలికింది. శంషాబాద్ లోని రాళ్లగుడాలో వినాయకుడి లడ్డు నిరుడు నాలుగున్నర లక్షల రూపాయలు పలికితే ఈ ఏడాది లక్షా 61 వేల రూపాయలు మాత్రమే పలికింది. శివరాంపల్లి గణేషుడి లడ్డు కోటిన్నర లక్ష రూపాయలు పలికింది. తెల్లాపూర్ లడ్డు రెండున్నర లక్షల రూపాయలు పలికింది. అయితే బాలాపూర్ వినాయకుడి లడ్డు గిరాకీ మాత్రం పెరిగింది. దీనికి ఏర్పడిన పవిత్రతే అందుకు కారణమని భావిస్తున్నారు.

రియల్ ఎస్టేట్ బూమ్ వల్ల రంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల పరిస్థితే మారిపోయింది. మహేశ్వరం లాంటి గ్రామాల్లో ఇంటికో కారు ఉందంటే అతిశయోక్తి కాదు. ఊహించని సంపద హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల ప్రజల చేతికి వచ్చింది. దీంతో ఆ ప్రాంతాల ప్రజల జీవన విధానమే మారిపోయింది. వచ్చిన కోట్లాది రూపాయలతో సామాజిక హోదాను పెంచుకునే ప్రయత్నంలో భాగంగానే స్థానికులు వినాయకుడి లడ్డు వేలం పాటల వంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. అలాగే మెడల్లో, చేతులకు పురుషులు కూడా బంగారు ఆభరణాలు దిగబోసుకోవడం పరిపాటి అయింది. వాటికి తోడు కార్లు విపరీతంగా కొనడం అలవాటు చేసుకున్నారు. నగర శివారుల్లో మద్యం గిరాకీ కూడా గణనీయంగా పెరిగింది. ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కాస్తా మందగించింది. ఇది స్థానికులపై ప్రభావం చూపుతోందనడానికి గణేష విగ్రహాల లడ్ల ధరలు తగ్గడం ఒక ఉదాహరణ.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X