వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంగూలీ శకానికి తెర?

By Staff
|
Google Oneindia TeluguNews

అంతర్జాతీయ క్రికెట్ బెంగాల్ టైగర్ దాదా సౌరవ్ గంగూలీ శకం ముగిసినట్లేనా. క్రికెట్ పండితులు ఈ రకంగానే విశ్లేషిస్తున్నారు. ఇరానీ ట్రోఫీకి ఎంపికి చేసిన రెస్టాఫ్ ఇండియా జట్టులో జాతీయ సెలెక్టర్లు స్థానం కల్పించకపోవడం ఈ విషయాన్నే తెలియజేస్తున్నది. సీనియర్, జూనియర్ తేడా లేకుండా అటలో సామర్థ్యం చూపించడమే ప్రధాన సూత్రంగా సెలెక్టర్లు భావిస్తున్నట్లు చెప్పవచ్చు. గత నెల శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ ఘోరంగా విఫలమయ్యారు. దీంతో భారత్ శ్రీలంకపై టెస్టు సిరీస్ ను 1-2 స్కోరుతో ఓడిపోయింది. అదే సమయంలో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని వన్డే జట్టు శ్రీలంకపై అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి సిరీస్ ను కైవసం చేసుకుంది. సీనియర్లు ఎదుర్కొన్న శ్రీలంక జట్టు, జూనియర్లు ఎదుర్కున్న శ్రీలంక జట్టు ఒకటే కావడం విశేషం. సీనియర్లు విఫలం కాగా, జూనియర్లు సఫలం కావడం భారత సీనియర్లకు ప్రమాదాన్ని తెచ్చి పెట్టింది. సమర్థవంతంగా ఆడడమో తప్పుకోవడమో ఏదో ఒకటి మాత్రమే వారి ముందు మిగిలి ఉంది.

ఆటలో నైపుణ్యం సాధించి ప్రతిభ చూపకపోతే రాహుల్ ద్రావిడ్, వివియస్ లక్ష్మణ్ లకు గంగూలీకి ఎదురైన పరిస్థితే ఎదురు కావచ్చు. వచ్చే ఆస్ట్రేలియా సిరీస్ లో వారు తగిన ప్రతిభను చూపకపోతే కష్టాలనే ఎదుర్కోవాల్సి వస్తుంది. గంగూలీ ఉద్వాసన ఆ విషయాన్ని చెప్పకనే చెబుతున్నది. నిజానికి గంగూలీకి అంతర్జాతీయ క్రికెట్ లో మంచి రికార్డు ఉంది. 36 ఏళ్ల ఎడమచేతి బ్యాట్స్ మన్ గంగూలీపై ఒత్తిడి పెరుగుతున్నది. ఫిట్నెస్ విషయంలోనే కాకుండా యువకుల నుంచి తీవ్ర మైన పోటీ ఉంది. దీంతో గంగూలీని జట్టులోకి తీసుకోవడంపై సెలెక్టర్లు పునరాలోచనలో పడ్డారని చెప్పవచ్చు.

శ్రీలంకతో గత నెలలో జరిగిన మూడు టెస్టుల సిరీస్ లో గంగూలీ విపరీతంగా శ్రమపడాల్సి వచ్చింది. మూడు టెస్టుల్లోనూ అతను 16 సగటుతో కేవలం 96 పరుగులు మాత్రమే చేశాడు. గత 15 ఇన్నింగ్సుల్లోనూ గంగూలీ రెండు అర్థ సెంచరీలు మాత్రమే చేశాడు. ఫైటర్ గా పేరు పొందిన గంగూలీ గతంలో ఉద్వాసనకు గురై తిరిగి జట్టులోకి వచ్చిన సందర్భాలున్నాయి. అయితే దానికి తెర పడినట్లేనని భావిస్తున్నారు. గత ఏడాది కాలంగా అతను వన్డే జట్టుకు ఎంపిక కావడం లేదు. ఇరానీ ట్రోఫీ నుంచి తప్పించారు. అతను తిరిగి ఎంపిక కావడానికి అవసరమైన వేదిక కూడా లేకుండా పోయింది. దీంతో గంగూలీ తిరిగి జట్టులోకి వస్తాడని చెప్పడానికి కూడా వీలు లేని పరిస్థితులు ఏర్పడ్డాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X