వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్స్ వర్కర్ గా మారిన అథ్లెట్

By Staff
|
Google Oneindia TeluguNews

Athlete
దేశంలోని క్రీడాకారుల పరిస్థితికి అద్దం పడుతూ ఇటీవల ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. క్రికెట్ క్రీడాకారుల పట్ల మరే ఇతర క్రీడలపై ప్రభుత్వాలకు శ్రద్ధలేదనే విషయాన్ని కూడా ఈ సంఘటన బయటపెడుతోంది. ఒక జాతీయ క్రీడాకారిణి ఛత్తీస్ గడ్ లో కుటుంబాన్ని పోషించుకోవడానికి సెక్స్ వర్కర్ గా మారిన వైనం హృదయాలను కలతపెడుతోంది. పేదరికం కారణంగా జాతీయ స్థాయి క్రీడాకారిణి సెక్స్ వర్కర్ గా మారింది. ఆమెను రాయపూర్ లోని దేవేంద్ర నగర్ ప్రాంతంలో పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

26 ఏళ్ల నిశా షెట్టి 1998లో అస్సాం నుంచి జాతీయ క్రీడల్లో పాల్గొంది. ఉపాధి లేకపోవడంతో, 2007లో భర్త మరణించడంతో ఆమె సెక్స్ వర్కర్ గా మారింది. తాను, తన ఐదేళ్ల పాప బతకడానికి తాను ఈ పనిలోకి దిగినట్లు ఆమె పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఆమెకు రాయపూర్ కోర్టు పదివేల రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ మొత్తం ఆమె వద్ద లేదు. దీంతో ఆమె జైలులోనే మగ్గాల్సి వస్తోంది. స్తానిక క్రీడాధికారులు ఆమె పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. కనీసం బెయిల్ ద్వారా విడుదల కావడానకైనా సహకరిస్తామని ఛత్తీస్ గడ్ వాలీబాల్ ఆసోసియేషన్ కార్యదర్శి మొహమ్మద్ అక్రం అన్నారు. కానీ అది జరగలేదు.

పూణేలో జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ లో ఆరేళ్ల క్రితం నిషా వెండి పతకం సాధించింది. ఆ ఏడాదే ఆమె సునీల్ షెట్టిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె కుటుంబం ఈ పెళ్లిని వ్యతిరేకించింది. సునీల్ అస్పాం తరఫున ఫుట్ బాల్ కు జాతీయ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించాడు. 2004లో కూతురు పుట్టిన తర్వాత సునీల్ తీవ్ర నిస్పృహకు గురై తాగుడు అలవాటు పడ్డాడని, ప్రభుత్వోద్యోగాన్ని నిర్లక్ష్యం చేశాడని నిషా చెప్పినట్లు పోలీసు వర్గాలు ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికతో చెప్పాయి. మూత్రపిండాలు దెబ్బ తినడంతో సునీల్ 2007 ఫిబ్రవరిలో మరణించాడు. దాంతో నిషా జీవితం వీధిన పడింది. స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం దొరకలేదు. ఉద్యోగాన్వేషణలో ఆమె ఏడాది క్రితం ముంబై వెళ్లి, ఏమీ దొరక్క సెక్స్ వర్కర్ గా మారిపోయింది. నిషా, మరో ఇద్దరు స్త్రీలు 50 వేల రూపాయలకు ముగ్గురు వ్యాపారవేత్తలతో గడపడానికి అంగీకరించారు. ఆ వ్యాపారవేత్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X