వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధోనీకి యువీ భయం

By Staff
|
Google Oneindia TeluguNews

Mahendra Singh Dhoni
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి యువరాజ్ సింగ్ భయం పట్టుకుంది. తన వన్డేల్లో నెంబర్ స్థానాన్ని యువీ కొల్లగొట్టే ప్రమాదం ఉండడమే ఆ భయానికి కారణం. ఆస్ట్రేలియాలో జరిగే ముక్కోణపు పోటీల్లో యువరాజ్ సింగ్ ధోనీ స్థానానికి ఎసరు పెట్టే అవకాశం ఉంది. ఈ ముక్కోణపు పోటీల్లో భారత్ న్యూజిలాండ్, శ్రీలంక జట్లపై ఆడుతుంది. ధోనీ 44 పాయింట్లతో వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్ లో మొదటి స్థానంలో ఉన్నాడు. యువరాజ్ సింగ్ రెండో స్థానంలో ఉన్నాడు. యువీ కాస్తా మనసు పెట్టి ఆడితే ధోనీని అధిగమించే అవకాశాలున్నాయి.

వారిద్దరితో పాటు ఐసిసి ర్యాంకింగ్ లో టాప్ 20లో మరో ఇద్దరు భారత బ్యాట్స్ మెన్ ఉన్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 12వ స్థానంలో ఉన్నాడు. టాప్ టెన్ లో స్థానం కోసం అతను ప్రయత్నించవచ్చు. మరో బ్యాట్స్ మన్ గౌతం గంభీర్ న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ రాస్ టైలర్ తో 17వ స్థానాన్ని పంచుకుంటున్నాడు.

వన్డే బౌలర్లలో శ్రీలంక బౌలర్ కులశేఖర న్యూజిలాండ్ బౌలర్లు డేనియల్ వెట్టోరీ, కైల్ మిల్స్ ల నుంచి ఒత్తిడి ఎదుర్కుంటున్నాడు. 36 పాయింట్లతో కులశేఖర వెట్టోరీ నుంచి సవాల్ ను ఎదుర్కుంటున్నాడు. భారత బౌలర్లలో హర్బజన్ సింగ్ 23వ స్థానంలో ఉన్నాడు. టాప్ ట్వంటీలో 16వ స్థానంలో ఉన్న జహీర్ ఖాన్ ఈ సిరీస్ లో ఆడడం లేదు. కాగా, భారత్ ఒక పాయింట్ తో నెంబర్ వన్ స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాపై వెనకబడి ఉంది. భారత్ ఈ సిరీస్ లో మూడు మ్యాచులతో పాటు ఫైనల్ కూడా గెలిస్తే రెండు పాయింట్లు సాధిస్తుంది. దీంతో నెంబర్ స్థానంలోకి వస్తుంది. ధోనీ దీనిపై దృష్టి పెట్టే అవకాశం లేకపోలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X