వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇలేష్ ను రాఖీ వదిలేస్తుందా?

By Staff
|
Google Oneindia TeluguNews

Rakhi Sawant
రాఖీ కా స్వయంవర్ రియాల్టీ షో ద్వారా సాధించాల్సిందంతా ఇప్పటికే సాధించింది. వివాదాల ద్వారా, రాఖీ సావంత్ స్పైసీ ప్రకటనల ద్వారా టిఆర్పీ రేటింగ్ చాలా పెరిగింది. దాంతో ఆ రియాల్టీ షో సాధించాల్సిన పని అయిపోయినట్లేనని భావిస్తున్నారు. రియాల్టీ షో ద్వారా ఎంపిక చేసుకున్న వరుడు ఇలేష్ పరుజన్ వాలాను ఆమె వదిలేస్తుందని భావిస్తున్నారు. అంతా ముందే రూపొందించుకున్న స్క్రప్టు ప్రకారం జరుగుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

రాఖీ కా స్వయంవర్ ద్వారా ఎంపిక చేసుకున్న వరుడు ఇలేష్ పై రాఖీ చేస్తున్న వ్యాఖ్యలు అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇలేష్ ను పెళ్లి చేసుకోవడానికి బదులు పథకం ప్రకారం అతన్ని వదిలించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలేష్ సోదరి పెళ్లికి ఆమె డుమ్మా కొట్టింది. ఆ తర్వాత గతంలో అతని సంబంధాలను ప్రశ్నించడం మొదలు పెట్టింది. ఇలేష్ కు తాను తగిన దాన్ని కానని చెప్పింది.

రియాల్టీ షో ద్వారా పెళ్లి చేసుకునే ఉద్దేశం రాఖీకి ఎప్పుడూ లేదని అంటున్నారు. రాఖీ, ఇలేష్ తగిన విధంగా విడిపోతారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. రాఖీ తలుచుకుంటే ఏదైనా సాధ్యమని చెప్పడానికి వెనకాడాల్సిన అవసరం ఏమీ లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X