వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కమ్రాన్ ఖాన్ అద్భుత కథ

By Staff
|
Google Oneindia TeluguNews

Kamran Khan
అతనికి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అనుభవం లేదు. అయితే ఒక్కసారిగా అతను వార్తల్లోకి ఎక్కాడు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపియల్) మ్యాచులో కోల్ కత్తా నైట్ రైడర్స్ పై రాజస్థాన్ రాయల్స్ విజయంతో అతని గురించి ఒక్కసారిగా చర్చ మొదలైంది. అతను 18 ఏళ్ల కమ్రాన్. రాజస్థాన్ రాయల్స్ లో పెద్ద స్టార్ ప్లేయర్లు ఎవరూ లేరు. స్టార్ ప్లేయర్లు లేని జట్టును షేన్ వార్న్ ముందుండి నడిపిస్తున్నాడు. అంతేకాదు, అనూహ్యంగా తొలి ఐపియల్ టైటిల్ గెలిచాడు. అయితే జట్టులోని సభ్యుల ప్రతిభ తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. అలా బయటపడిన ప్రతిభావంతుడైన ఆటగాళ్లలో కమ్రాన్ ఒక్కడు.

కమ్రాన్ తండ్రి ఉత్తరప్రదేశ్ లోని ఆజంఘర్ లో వుడ్ కట్టర్. ఆజంఘర్ నేరాలకు పెట్టింది పేరు. అయితే కమ్రాన్ ఇంటి నుంచి పారిపోయి ముంబయి చేరుకున్నాడు. జాతీయ జట్టుకు ఆడాలనే కలను సాకారం చేసుకోవడానికి అతను అలా పారిపోయి వచ్చాడు. ఏడుగురు అన్నదమ్ముల్లో కమ్రాన్ ఆఖరు వాడు. ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు. తన చిన్నప్పుడే కమ్రాన్ తండ్రిని కోల్పోయాడు.

ముంబయి చేరుకున్న కమ్రాన్ కు చాలా కాలం దిక్కు తోచలేదు. ఇల్లు లేదు, డబ్బు లేదు. దాంతో రైల్వే స్టేషన్లలో నిద్రపోయేవాడు. అయితే తన లక్ష్యాన్ని మాత్రం మరిచిపోలేదు. కోచ్ నౌషాద్ ఖాన్ అతన్ని గుర్తించి, దగ్గరకు తీసుకున్నాడు. ముంబయి స్థానిక టోర్నమెంట్లలో బౌలింగ్ చేస్తుండగా అతన్ని రాజస్థాన్ రాయల్స్ కోచ్ డారెన్ బెర్రీ చూశాడు. కమ్రాన్ బౌలింగ్ అతనికి ఎంతో నచ్చింది. వార్న్ కూడా చూశాడు. 140 మించిన వేగంతో బంతి విసిరే కమ్రాన్ యాక్షన్ అతనికి నచ్చింది. వెంటనే అతనికి రాజస్థాన్ రాయల్స్ జట్టులో స్థానం కల్పించారు.

తనపై వార్న్ పెట్టుకున్న విశ్వాసాన్ని కమ్రాన్ వమ్ము చేయలేదు. చివరి సూపర్ ఓవర్ కమ్రాన్ కు ఇచ్చాడు. అదే మ్యాచ్ జయాపజయాలను నిర్ణయించింది. రాజస్థాన్ రాయల్స్ విజయాన్ని అందుకుంది. వార్న్ తనపై నమ్మకం పెట్టుకోవడం గొప్ప విషయమని, తనకు బంతి ఇస్తే తన బాధ్యత నెరవేర్చగలననే నమ్మకం తనకు ఉందని కమ్రాన్ ఐపియల్ తొలి సూపర్ ఓవరులో కోల్ కత్తా నైట్ రైడర్స్ ను రాజస్థాన్ రాయల్స్ ఓడించిన తర్వాత మీడియా ప్రతినిధులతో అన్నాడు. సూపర్ ఓవర్ గురించి ఆందోళన చెందవద్దని, నువ్వు చివరి ఓవర్ అంత బాగా వేసి ఉండకపోతే మనం సూపర్ ఓవర్ అవకాశం వచ్చి ఉండేది కాదని తాను కమ్రాన్ తో చెప్పానని వార్న్ అన్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X