హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లక్ష్మణ్ ట్వంటీ 20 ఆశలు

By Staff
|
Google Oneindia TeluguNews

VVS Laxman
హైదరాబాదీ స్టయిలిష్ బ్యాట్స్ మన్ వివియస్ లక్ష్మణ్ ఇంకా మంచి ట్వంటీ 20 క్రికెటర్ గా మారాలని ఆశపడుతున్నాడట. నిరుడు లక్ష్మణ్ నాయకత్వంలో ఐపియల్ ట్వంటీ 20లో దక్కన్ చార్జర్స్ ఘోర పరాజయం పాలై చివరి వరుసలో నిలిచింది. ఈసారి ఆడం గిల్ క్రిస్ట్ నేతృత్వంలో ఏకంగా ఐపియల్ టైటిల్ నే గెలుచుకుంది. ఈసారి లక్ష్మణ్ ఏకంగా మైదానంలోకే దిగలేని పరిస్థితి వచ్చింది. తొలుత ఒకటి రెండు మ్యాచ్ లు అడిన లక్ష్మణ్ ఆ తర్వాత మైదానంలో కనిపించలేదు. అయితే ఇంకా మంచి ట్వంటీ 20 క్రికెట్ కావాలని లక్ష్మణ్ ఆశ పడుతున్నాడట. ఈ విషయాన్ని దక్కన్ చార్జర్స్ కెప్టెన్ ఆడం గిల్ క్రిస్ట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇది లక్ష్మణ్ కు ఇమోషనల్ మూమెంట్ అని, అతను తన సేవలను అందిస్తూ ఉండడం గొప్ప విషయమని గిల్లీ అంటున్నాడు.

మ్యాచ్ అడడానికి ముందు ఏదో ఒకటి కాగితం మీద రాసుకుని జేబులో పడేసుకునే చెడ్డ అలవాటు గిల్ క్రిస్ట్ కు ఉంది. సెమీ ఫైనల్ కు ముందు తన జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలుస్తుందని రాసి జేబులో పడేసుకున్నాడు. అదే జరిగింది. ఓజాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వస్తుందని ఫైనల్ మ్యాచుకు మందు రాసి పెట్టుకున్నాడు. ఓజాకు ఆ అవార్డు కొద్దిలో తప్పిపోయింది. తనకు నిద్రపట్టదని, అర్థరాత్రి దాటిన తర్వాత రెండున్నర గంటలకు లేస్తానని, తెల్లవారు జామున 3 గంటల 16 నిమిషాలకు ఓజాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచు వస్తుందని కాగితంపై రాసుకున్నానని, అయితే కొద్దిలో తప్పిపోయిందని, మనిషిగా అన్నింటినీ ముందుగానే అంచనా వేసే శక్తి ఉండదని గిల్ క్రిస్ట్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు.

జట్టు సమిష్టి కృషి వల్ల తాము కప్ ను గెలుచుకున్నామని అతను చెప్పాడు. ఆర్పీ సింగ్ వంటి బౌలర్ వల్ల తమ బౌలింగ్ సైడ్ పటిష్టంగా ఉందని అతను అన్నాడు. తమ జట్టులో పలువురు మంచి ఆటగాళ్లున్నారని అతను చెప్పుకున్నాడు. నిరుటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పుల నుంచి ఫాఠాలు నేర్చుకోవాలనే సంస్కొతిని అలవరుచుకోవాలని ఆయన చెప్పారు. దాన్నే తాను చెబుతూ వచ్చానని, తర్వాతి బంతి మీ జీవితాలను మారుస్తుందని సూచిస్తూ వచ్చానని, అంతకు మించి తాను చేసిందేమీ లేదని అతను అన్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X