• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హిందీ తారల పెళ్లి తంతులు

By Pratap
|
Shilpa Shetty
ముంబై: పెళ్లి విషయంలో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి గత అగ్రతారల అడుగు జాడల్లోనే నడుస్తోంది. ఇంతకు ముందు పెళ్లయిన పురుషులనే బాలీవుడ్ తారలు పెళ్లి చేసుకున్న సంప్రదాయాన్ని ఆమె కొనసాగిస్తేంది. శ్రీదేవి, హేమమాలిని, రవీనా టాండన్ వంటి అగ్ర తారలు కూడా ఇంతకు ముందు పెళ్లయిన పురుషులనే వివాహం చేసుకున్నారు. శిల్పా శెట్టి లండన్ కు చెందిన వ్యాపార వేత్త రాజ్ కుంద్రాను ఈ నెల 22వ తేదీన పెళ్లి చేసుకుంటోంది. బ్రిటన్ లోని సెలిబ్రిటీ బిగ్ బ్రదర్ రియాల్టీ షోతో శిల్పా శేట్టికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈ గుర్తింపు తర్వాతనే ఆమెకు 34 ఏళ్ల కుంద్రాతో పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమగా మారింది. శిల్పాను కలిసే నాటికే కుంద్రా తన భార్య కవితతో విడిపోయాడు. అయితే తన పెళ్లి పెటాకులు కావడానికి శిల్పా శెట్టియే కారణమని కవిత బహిరంగంగా విమర్శలు చేసింది. అయితే అధికారికంగా విడాకులు తీసుకున్న తర్వాతనే కుంద్రాతో డేటింగ్ కు శిల్పా పట్టు పట్టింది.

తాను కుంద్రాతో ప్రేమలో పడిన మాట వాస్తవమేనని, అయితే అధికారికంగా కవితతో విడాకులు తీసుకున్న తర్వాతనే తమ ప్రేమ సంబంధం మొదలవుతుందని, లేదంటే అది స్నేహంగానే ఉంటుందని తాను స్పష్టంగా చెప్పినట్లు శిల్పా ది డైలీ మెయిల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. మొదటి భార్యలతో విడిపోయిన, విడిపోని పురుషులను ఇంతకు ముందు బాలీవుడ్ తారలు పెళ్లిళ్లు చేసుకున్న సందర్భాలున్నాయి.

ధర్మేంద్ర ప్రకాష్ కౌర్ ను పెళ్లి చేసుకుని నలుగురు పిల్లలను కన్నారు. ఇద్దరు కూతుళ్లు, సన్నీ, బాబీ డయెల్ కుమారులు. ఆ తర్వాతనే 1980లో హేమమాలిని ధర్మేంద్రను పెళ్లి చేసుకుంది. వీరికి ఈషా, అహనా అనే ఇద్దరు కూతుళ్లున్నారు. బాలీవుడ్ మాజీ క్యాబరే డ్యాన్సర్ హెలెన్ స్క్రీన్ రైటర్ సలీం ఖాన్ ప్రేమలో పడింది. అప్పటికే ఆయన సల్మా ఖాన్ (అసలు పేరు సుశీలా చరక్)తో పెళ్లయింది. సల్మాతో ఆయనకు సల్మాన్, సోహైల్, అర్బాజ్, అల్విరా అనే పిల్లలున్నారు. హెలెన్ సలీం ఖాన్ ను 1980తో వివాహమైంది.

లామ్హే, మిస్టర్ ఇండియా సినిమాల్లో నటించిన శ్రీదేవి అప్పటికే పెళ్లయిన నిర్మాత బోనీ కపూర్ ను పెళ్లి చేసుకుంది. ప్రముఖ నటీమణి షబానా ఆజ్మీ అప్పటికే పెళ్లయిన రచయిత జావెద్ అక్తర్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. మొదటి భార్య హానీ ఇరానీ ద్వారా అక్తర్ కు పర్షాన్, జోయా అనే ఇద్దరు పిల్లలు కలిగారు. షబానా అక్తర్ ను 1984లో పెళ్లి చేసుకుంది. నాటాషా షిప్పిని పెళ్లాడిన చిత్ర పంపిణీదారు అనిల్ తండానీని రవీనా టాండన్ వివాహం చేసుకుంది.

మొదటి భార్యతో విడాకులు తీసుకున్న డిల్లీ వ్యాపారవేత్త సంజయ్ కపూర్ ను ప్రముఖ నటీమణి కరిష్మా కపూర్ వివాహమాడింది. అప్పటికే పెళ్లయిన ఆర్కిటెక్ట్ బాబీ ముఖర్జీని మహిమా చౌదరి వివాహమాడింది. ప్రస్తుతం విడాకులు తీసుకున్న వ్యక్తి సైఫ్ అలీఖాన్ తో కరీనా కపూర్ డేటింగ్ చేస్తోంది. ఇంతకు ముందు సైఫ్ కు అమృతా సింగ్ తో వివాహమైంది. అమలను వివాహం చేసుకున్న టాలీవుడ్ నటుడు నాగార్జునతో టబూ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి సంబంధాలు, వివాహాలు కేవలం బాలీవుడ్ కు మాత్రమే పరిమితం కాలేదు. ఇతర భాషలకు చెందిన సినీ రంగంలోనూ ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X