వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2010 - ఆంధ్రప్రదేశ్ రౌండప్

By Srinivas
|
Google Oneindia TeluguNews

United Andhra
ఆంధ్రప్రదేశ్ పరిణామాలు 2010 ఒక రకంగా శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటుతో ప్రారంభమై ఆ కమిటీ నివేదిక సమర్పణతో ముగుస్తున్నట్లు చెప్పుకోవచ్చు. అయితే, శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పణ తర్వాత రాష్ట్రంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకోవచ్చుననే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఈ ఏడాదిని అనిశ్చితి సంవత్సరంగా పరిగణించవచ్చు. ఉద్రిక్తతలకు, ఆందోళనకు, రాజకీయ ఒడిదొడుకులకు ఉదాహరణగా నిలిచింది.

జనవరి
01- సిఎం రోశయ్యపై కోమటిరెడ్డి వ్యాఖ్యలకు షోకాజ్ జారీ చేసిన హైకమాండ్
02- పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుగు లగడపాటి, మధుయాష్కీలకు షోకాజ్ నోటీసులు
- తెలంగాణ సభకు అనుమతిచ్చిన కోర్టు
03- రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్ర బంద్
- తెలంగాణ ఏర్పాటుకు ఏకాభిప్రాయమే కాంగ్రెస్ వైఖరి: డిఎస్
04- తెలంగాణ ఏర్పాటుకు గడువు లేదు: ఏఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ
05- తెలంగాణ ఏర్పాటు రాత్రికి రాత్రే సాధ్యం కాదు: ప్రణబ్ ముఖర్జీ
06- ఆర్టీసీలో పెరిగిన బస్సు ఛార్జీలు
07- దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఆర్ మృతిపై మిస్టరీ అంటూ ప్రకటించిన ది ఎగ్జెల్ వెబ్ సైట్
08- వైఎస్ మృతి కుట్ర అంటూ కథనాలను ప్రసారం చేసిన ఛానెల్ జర్నలిస్టుల అరెస్టు
- రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలీయో చుక్కల కార్యక్రమం
10- సిఎం పదవి ఇచ్చినా ఉద్యమం ఆగదు, ప్రలోభాలకు లొంగను: నాగం జనార్ధన్ రెడ్డి
12- తెలంగాణ రాజకీయ జెఏసిలో విబేధాలు.. రసాభాసగా మారిన సమావేశం
13- శబరిమల బస్సుకు ప్రమాదం.. 11 మంది కృష్ణా జిల్లావాసుల దుర్మరణం
14- తెలంగాణ జెఏసిలో చీలిక.. విడిపోయిన ప్రజా సంఘాలు
15- కోట్లాదిమందికి కనువిందు చేసిన అరుదైన సూర్యగ్రహణం
19- ఓయులో వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య.. తెలంగాణ బంద్
20- వేణుగోపాల్ రెడ్డి మృతితో రణభూమిగా మారిన ఓయు
21- తెలంగాణ జెఏసి సమావేశానికి కాంగ్రెస్ డుమ్మా
22- రాష్ట్ర గవర్నర్ గా నరసింహన్ ప్రమాణ స్వీకారం
23- రాజీనామా చేయం, అధిష్టానంపై ఒత్తిడి తీసుకు వస్తాం: ఎంపీ పొన్నం ప్రభాకర్
25- రాష్ట్ర విభజన యత్నాలు అడ్డుకోండి, కేంద్రానికి విజ్ఞప్తి చేసిన చిరంజీవి
27- ప్రభుత్వ ఉద్యోగులకు 39శాతం ఫిట్మెంట్ కు ఒప్పందం
- ప్రారంభమైన శ్రీకృష్ణ దేవరాయల పంచ శతాబ్ధి ఉత్సవాలు
29- ప్రజా ఉద్యామాలతో పాలనలో స్తబ్ధత నిజమే: సిఎం రోశయ్య
30- విజయవాడలో నాగవైష్ణవి కిడ్నాప్
31- విశాఖ జిల్లాలో నాటు పడవ బోల్తా.. 12మంది గల్లందు

ఫిబ్రవరి
01- కిడ్నాపైన నాగవైష్ణవి దారుణ హత్య
- లతా మంగేష్కర్ కు అక్కినేని అవార్డు ప్రదానం చేసిన సిఎం రోశయ్య
03- తన తండ్రి వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన కుటుంబాలను పరామర్శిస్తానని ప్రకటించిన జగన్
04- ధరల నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ప్రకటించిన సిఎం రోశయ్య
05- హైదరాబాదులో కుప్పకూలి భవనం.. 13 మంది మృతి
06- ఎటూ మొగ్గు చూపను.. రెండు ప్రాంతాలు సమానమే: చంద్రబాబునాయుడు
07- వరంగల్ లో మందకృష్ణ ప్రసంగాన్ని అడ్డుకున్న కెయు విద్యార్థులు
08- ఆరోపణలు నిరూపించాలంటూ చంద్రబాబుకు కెవిపి లేఖాస్త్రం
10- నిజామాబాద్ లో జిల్లా సమీక్షా సమావేశంలో సిఎం రోశయ్య వాకౌట్
11- వైఎస్ చాపర్ ప్రమాదంలో కుట్ర లేదు.. క్యుములోనింబస్ మేఘాలే కారణం-ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన ద్విసభ్య కమిటీ
12- శ్రీకృష్ణ కమిటీ దిక్కుమాలిన కమిటీ.. కేంద్రం నీతిబాహ్యంగా వ్యవహరిస్తోందంటూ కెసిఆర్ ఆరోపణలు.. తెరాస ఎమ్మెల్యేల రాజీనామా
- రాజీనామాలకు తొందరొద్దన్న తెలంగాణ తెదేపా ప్రజా ప్రతినిధులు
13- రాజీనామాల విషయంలో కాంగ్రెస్ కలకలం.. వద్దని కొంతమంది, చేసేద్దామని ఇంకొంతమంది.
- శ్రీకృష్ణ కమిటీని స్వాగతిస్తున్నాం.. రాజీనామాల వలన ప్రయోజనం లేదు: చిరంజీవి
14- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చేందుకు 15 మంది ఎమ్మెల్యేల రాజీనామా
- రాజనామాలను స్వాగతిస్తూ ఓయూలో ర్యాలీ... అడ్డుకున్న పోలీసులు
15- ఓయూలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య రగడ.. ఇరు వర్గాలకు తీవ్ర గాయాలు
- ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు
16- తెలంగాణ ప్రజలెరవరూ ప్రత్యేక రాష్ట్రం కోరుకోవటం లేదని జయేంద్ర సరస్వతి సంచలన వ్యాఖ్యలు.. ముక్కు మూసుకొని తపస్సు చేసుకోమని మండిపడ్డ తెలంగాణ నేతలు
17- చంద్రబాబునాయుడితో జెసి దివాకర్ రెడ్డి రహస్య భేటీ.. మర్యాద పూరకమేనన్న జెసి
18 తెలంగాణ ప్రజా ప్రతినిధుల రాజీనామాలు చందాల కోసమే - జూబ్లీహిల్సు ఎమ్మెల్యే విష్ణు
19- తెలంగాణ రాజకీయ జెఏసికి కాంగ్రెస్ బైబై
- తెలంగాణ వెనుకబాటుకు పాలకులదే పాపం- శాసనసభలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్
20- రూ.1.13 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన రోశయ్య.. పెదవి విరిచిన విపక్షాలు
- కెసిఆర్, విజయశాంతిల రాజీనామాల తిరస్కరణ.. కారణాలు సరిగ్గా లేవన్న లోక్ సభ స్పీకరు
21- చిట్ ఫండ్ పేరుతో రూ.100 కోట్లకు టోపీ పెట్టిన జిపిఆర్ అధినేత అరెస్టు
- పెళ్లిళ్ల పేరుతో మహిళలను మోసం చేసిన జగదాంబ జగదీష్ అరెస్టు
22- తెలంగాణ రాజకీయ జెఏసితో తెదేపా తెగతెంపులు.. ఇరు ప్రాంతాల నేతలతో చంద్రబాబు మంతనాలు
23- గడువులోగానే నివేదిక సమర్పిస్తామని హైదరాబాదులో ప్రకటించిన శ్రీకృష్ణ కమిటీ సభ్యుడు దుగ్గల్
24- శాసనమండలి సభ్యులెవరూ ఉద్యమాలలో పాల్గొనవద్దని సిఎం రోశయ్య విజ్ఞప్తి
25- చీమకుర్తిలోని హంస క్యారీలో ప్రమాదం... 22 మంది మృతి
26- ఉప ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేస్తామని ప్రకటించిన డిఎస్
- రాష్ట్రం విడిపోతే తప్పులేదన్న బొత్స సత్యనారాయణ
27- డిఎస్, బొత్సల ప్రకటనలపై ఇరు ప్రాంతాలలో రచ్చ రచ్చ
28- వెనుక బడిన జిల్లాల్లో నూతన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తాం -పెట్టుబడులతో ముందుకు రండంటూ సిఎం రోశయ్య పారిశ్రామిక వేత్తలకు పిలుపు

మార్చి
01- రాజీనామాలు చేయడం తెరాసకు కొత్తేమీ కాదు, ఉద్యమానికి కాంగ్రెస్, తెదేపాలు ద్రోహం చేస్తున్నాయి: ఎంపీ విజయశాంతి
02- 2008 టీవీ నందుల అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం
03- బేగంపేట ఎయిర్ షోలో ప్రమాదం... ఓ ఇంటిపై కూలిన నేవీ విమానం... పైలట్, కో పైలట్ మృతి
- బ్రాహ్మణీ స్టీల్ ప్లాంట్ కు నీటి కేటాయింపుపై శాసనసభలో రగడ
04- తెలంగాణ తెదేపా ఫోరం ఏర్పాటు.. రెండుగా చీలిన తెదేపా ఎమ్మెల్యేలు
- హైదరాబాదులో శ్రీకృష్ణ కమిటీ పర్యటన.. సామాన్యులతో మాట్లాడుతామన్న సభ్యులు
06- ధరల పెరుగుదలపై తెదేపా, వామపక్షాలు ఇందిరా పార్కు వద్ద ధర్నా.. దద్దరిల్లిన తెలంగాణ నినాదాలు
07- నల్గొండలో చెరువులో బోల్తా పడిన ట్రాక్టర్.. 12మంది మృతి
08- న్యాయస్థానాలలో విధులను బహిష్కరించిన లాయర్లు.. కఠిన చర్యలు తీసుకుంటామని హైకోర్టు సిజె హెచ్చరిక
09- విద్యుత్ సరఫరా సక్రమంగా లేదంటూ విద్యుత్ సౌధ ముందు ధర్నా చేసిన చిరంజీవి
10- లక్ష్మీపార్వతి నివాసానికి వెళ్లిన బాలకృష్ణ.. గంటన్నర పాటు మంతనాలు
- నేర కథనాలను కట్టిపెట్టమంటూ ఛానెళ్లకు హైకోర్టు నోటీసులు
11- రాయల తెలంగాణ ఆలోచన వద్దు- నిరసన వ్యక్తం చేసిన తెలంగాణ మంత్రులు
12- ప్రభుత్వ ఉదాసీనత వల్లనే పైరసీ పెరుగుతోందంటూ అసెంబ్లీలో ఆందోళన వ్యక్తం చేసిన చిరంజీవి
- పోలీసు కాల్పుల్లో నేలకొరిగిన మావో అగ్రనేతలు శాఖమూరి, టెక్ రమణలు
13- సెంట్రల్ యూనివర్శిటీలో కేంద్రమంత్రి కపిల్ సిబాల్ ను అడ్డుకున్న తెలంగాణ వాదులు
- రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణలో ఉగ్రవాదం పెరిగిపోతోంది: లగడపాటి
14- తిరుమల శ్రీనివాసుని కైంకర్యంలో సేవలందించిన పెద్ద జియ్యంగార్ కన్నుమూత
15- మాజీ ఉప ముఖ్యమంత్రి కోనేరు రంగారావు అస్తమయం
16- పోలీసు నియామకాలలో హైదరాబాదు ఫ్రీజోనే- స్పష్టం చేసిన సుప్రీం కోర్టు
- నంది అవార్డుల ప్రధానోత్సవంలో పైరసీ నుండి పరిశ్రమను ఆదుకుంటామన్న సిఎం రోశయ్య
17- హైదరాబాదు ఫ్రీజోన్ పై అసెంబ్లీలో ఏకవాక్య తీర్మానానిక సై అన్న ప్రభుత్వం... చర్చ లేకుండా ఆమోదానికి అంగీకరించమన్న విపక్షాలు
18- ఫ్రీజోన్ తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం.. రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని పేరా 14ఎఫ్ ను తొలగించాలని కేంద్రానికి విజ్జప్తి చేసిన ప్రభుత్వం
19- చేనేతలకు రూ.312 కోట్ల రుణమాఫీ ప్రకటించిన ప్రభుత్వం
20- నెల్లూరులో లీక్ అయిన ఇంటర్ క్వశ్చన్ పేపర్... విద్యార్థుల ఆందోళన.. ఏడుగురు అరెస్టు
21- మంత్రి డికె అరుణపై కోడిగుడ్లతో దాడి చేసిన తెలంగాణవాదులు
22- క్యాంప్ ఆఫీసులో ప్రవేశించి రోశయ్య
24- చర్లపల్లి జైలు వద్ద చంద్రబాబునాయుడి కాన్వాయ్ ని అడ్డుకునే యత్నం చేసిన తెలంగాణవాదులు
- తెరపైకి మరో ప్రజాసంఘాల జెఏసి.. గద్దర్ సారధ్యంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్
26- దుర్మమ్మకు వైభవంగా బ్రహ్మోత్సవం.. పులకించిన ఇంద్రకీలాద్రి
27- అశోక్ గజపతి రాజుతో వియ్యమందిన మాజీ డిజిపి ఎస్ఎస్పీ యాదవ్... ఆశోక్ గజపతి కుమార్తెతో యాదవ్ కుమారునికి వివాహం.. హాజరు కాని యాదవ్
- తిరుమల అవినీతిపై భక్తులే తిరగబడాలి: తితిదే చైర్మన్ ఆదికేశవులునాయుడు
28- హైదరాబాదు పాతబస్తీలో అల్లర్లు.. రాళ్ల వర్షం.. దహనాలు.. లాఠీఛార్జ్
- గండిపేటలో తెదేపా మహానాడు సంబరాలు ప్రారంభం
29- పాతబస్తీలో పెరిగిన ఉద్రిక్తత.. కర్ఫ్యూ.. చెలరేగిన అల్లరిమూకలు
30- ముగిసిన శాసనసభ బడ్జెట్ సమావేశాలు...
- నా వివాహం నా వ్యక్తిగతం.. షోయబ్ మాలిక్ అల్లా ఇచ్చిన వరుడు: సానియా మీర్జా

ఏప్రిల్
01- మూడవ దశ ఎమ్మెల్యేల నివాస గృహ సముదాయానికి ముఖ్యమంత్రి రోశయ్య శంకుస్థాపన
- రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా రమణమూర్తి నియామకం
02- హైదరాబాదు పాతబస్తీలో అల్లర్లు, కర్ఫ్యూ
- తిరుమల తిరుపతి దేవస్థానాల పెద్ద జియ్యర్ స్వామీగా శ్రీశఠగోప రామానుజ జియ్యర్ స్వామీ పట్టాభి,ికులైయ్యారు
- అత్యంత శక్తివంతమైన గంగాదేవి అనే ఇన్షార్ పెట్రోల్ వెసేల్ ను బంగాళాఖాతంలో ప్రవేశపెట్టారు.
03- 350 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సమాజిక ఆరోగ్య కేంద్రాలలో ఎయిడ్స్, హెచ్ఐవి కౌన్సెలింగ్, పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రోశయ్య ప్రకటన
04- విశాఖపట్నం పాత జైలు ప్రాంగణంలో వైఎస్ఆర్ పార్కుకు ముఖ్యమంత్రి రోశయ్య శంకుస్తాపన
05- ఆంధ్రప్రదేశ్ లో 5వేల కోట్లతో కొత్త రైలు మార్గాలు ఏర్పాటు చేస్తామని రైల్వే సహాయమంత్రి మునియప్ప హామీ
06- సింగరేణి మెయిన్ స్టోర్లో అగ్ని ప్రమాదం
07- రాష్ట్రవ్యాప్తంగా సిటీ బస్సుల ఛార్జీలు తగ్గింపు
- దంతెవాడలో నక్సల్స్ నరమేధం.. 83 మంది జవాన్ల మృతి
08- రచయిత భరాగో కన్నుమూత
09- సినీ నటి రంభ వివాహం
10- పది యూనివర్శిటీల పాలక మండళ్ల రద్దు
11- హైదరాబాదు పాతబస్తీలో కర్ఫ్యూ ఎత్తివేత
- రహదారుల అక్రమాలపై హైకోర్టులో పిటిషన్
12- ప్రముఖ నక్సలైట్, న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పైలా వాసుదేవరావు మృతి
- టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా, షోయబ్ మాలిక్ ల వివాహం.
13- సత్యం రామలింగరాజు ఆరోగ్యంపై నివేదిక ఇవ్వమని వైద్యులను ఆదేశించిన సిబిఐ ప్రత్యేక కోర్టు
14- స్త్రీలపై యాసిడ్ దాడులకు పాల్పడితే కఠిన చర్యలని ప్రకటించిన ప్రభుత్వం, బాధితులకు తక్షణ సాయంగా రూ.50వేల ప్రకటన
- పరిశ్రమలకు విద్యుత్ కోత ఎత్తివేసినట్లు ప్రభుత్వం ప్రకటన
15- తిరుమల తిరుపతి దేవస్థానంలో 8 నుండి 16వ శతాబ్ధం వరకు ఉన్న పురాతన శాసనాలను పదిలం చేస్తున్నట్లు టిటిడి ప్రకటన
- ఇస్రో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జిఎస్ఎల్వీ జిడి 3 రాకెట్ ప్రయోగం విఫలం
16- ప్రాణహిత చేవెల్ల ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది.
- 2010-11 సంవత్సరానికి రూ.36,800 కోట్ల ప్రణాళికా కేటాయింపులకు ప్రణాళికా సంఘం ఆమోదం
17- రహదార్ల అభివృద్ధికి నిధులిస్తామని కేంద్రమంత్రి కమలనాథ్ హామీ
18- హజ్మత్ అగ్నిమాపక శకటాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి
19 ప్రజల సమస్యలు తమ వద్దే పరిష్కరించేందుకు, గ్రామాలకు పాలనా యంత్రాంగాన్ని తీసుకెళ్లే ప్రజాపథం కార్యక్రమం ప్రకాశం జిల్లా వేటపాలెం మండలంలోని కటారివారిపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి రోశయ్య ప్రారంభించారు
21- చిన్న తరహా పరిశ్రమలకు విద్యుత కోత కుదింపుపై ప్రభుత్వ ప్రకటన
22- ఎంబిబిఎస్ పట్టభద్రులు ఒక సంవత్సరం పాటు గ్రామాల్లో తప్పనిసరిగా పని చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
23- ట్రిపుల్ ఐటీ సీట్లలో 50శాతం కోత విధింపునకు ప్రభుత్వం ఆమోదం
24- ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ) రెండో క్యాంపస్ ను అనంతపురం జిల్లాలో ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది.
25- కృష్ణా ట్రిబ్యునల్ లో వాదనలు పూర్తి, దండావతిపై ట్రిబ్యునల్ ఆగ్రహం
28- అవయవ మార్పిడితో జీవన్ దానం కొత్త పథకం ప్రారంభిస్తున్నట్లు ప్రకటన

2</a> | <a href=3" title="2 | 3" />2 | 3

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X