వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్ రౌండప్ ఆఫ్ శ్రీకృష్ణ కమిటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

VK Duggal
మే
01- శ్రీశ్రీ శత జయంతి ఉత్సవాలు ప్రారంభం
02- వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవాసాంధ్రులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటన
- నెల్లూరులో ఆరో విడత భూమి పంపిణీ ప్రారంభం
- దివంగత ముఖ్యమంత్ర వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర పాఠ్యాంశంగా ప్రవేశ పెడతామని ప్రభుత్వం ప్రకటన
03- విశాఖపట్నం సమీపాన అచ్యుతాపురంలో ఏర్పాటు చేసిన బ్రాండిక్స్ ఇండియా అప్పెరల్ సిటీకి ముఖ్యమంత్రి రోశయ్య శంకుస్థాపన చేశారు
04- ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంతరానికి 200 మెగావాట్ల వాయు విద్యుత్ ఉత్పత్తి కాగలదని విండ్ టర్పైన్ మాన్యుఫాక్చరింగ్ తెలిపింది.
05- ముగిసిన శ్రీకృష్ణా ట్రిబ్యునల్ విచారణ
06- అంతర్జాతీయ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు సిఎం రోశయ్య ప్రకటన
- ఆధార్ ఫైలట్ ప్రాజెక్టులో రాష్ట్రానికి స్థానం కల్పించాలని సిఎం రోశయ్య యుఐడిఏఐ చైర్మన్ కు లేఖ
- రక్షిత మంచినీటికి రూ.467.68 కోట్ల నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
07- ఎమ్మెల్యే బస్వరాజు సారయ్యపై కిరోసిన్ తో దాడి చేసిన తెలంగాణ వాదులు
- పరిశ్రమలకు విద్యుత్ కోత పూర్తిగా ఎత్తివేసినట్లుగా ప్రభుత్వం ప్రకటన
సమగ్ర శిశు అభివృద్ధి పథకం పనితీరు మెరుగు పర్చేందుకు మంత్రివర్గం ఉపసంఘం ఏర్పాటు
08- హైదరాబాదు, రంగారెడ్డి స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలు ముగింపు
- కెజి బేసిన గ్యాస్ ను ప్రైవేటు పరం చేయవద్దంటూ సుప్రీంకోర్టు తీర్పు
09- ప్రజాపథం విజయవంతం అయినట్లు ప్రకటించిన సిఎం రోశయ్య
10- గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బ్యారేజీలను అడ్డుకుంటామని సిఎం రోశయ్య ప్రకటన
- ప్రాంతీయ సమస్యల పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదని అది కేంద్రం చూసుకునే వ్యవహారమని ముఖ్యమంత్రి రోశయ్య ప్రకటన
12- నిధుల కొరత ఉన్నా కళారంగాన్ని ప్రోత్సహిస్తామని సిఎం రోశయ్య ప్రకటన
13- 20 లక్షల బోగస్ కార్డులు ఏరివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన
- ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రతా కౌన్సిల్ పునరుద్దరిస్తామని ముఖ్యమంత్రి ప్రకటన
- ప్రభుత్వ ఉద్యోగులకు ఎపిజిఎల్ఐ పాలసీల జారీ
14- ఆరోగ్య విభాగాల కూటమికి ఆరోగ్యరక్షను రూపకల్పన చేసినట్లు ప్రభుత్వం ప్రకటన
- ప్రతిభ కలిగిన విదార్థులకు కార్పోరేట్ విద్యను కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటన
15- వైఎస్ హెలికాప్టర్ ప్రమాదం వెనుక కుట్ర లేదని సబిత ప్రకటన
17- ప్రజాపథం ముగింపు
- నరరూప రాక్షసుడు, గజదొంగ తాడిపర్తి(రుద్రాక్షపల్లి) రామారావు హత్య
- ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు ఆరు లక్షలు దాటినట్లు ముఖ్యమంత్రి రోశయ్య ప్రకటన
19- కోస్తా జిల్లాలలో లైలా తుఫాన్
20- ఇందిరమ్మ పథకంలో 8 ప్రాజెక్టులకు ప్రభుత్వం అంగీకారం
21- కొత్త వర్సిటీలకు నిధులు రాబట్టేందుకు యుడిసితో ప్రభుత్వం చర్చలు
22- టిటిడిలో కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకన్న 60 సంవత్సరాల వయస్సు పైబడిన వారిని ఇంటికి పంపిస్తున్నట్లు టిటిడి పాలకమండలి ప్రకటన
- అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి రోశయ్య ప్రకటన
23- పురాతన చాళుక్యుల దేవాలయం గుంటూరు జిల్లా దుర్గి మండలం తేరాల గ్రామంలో కనుగొన్నారు. 7వ శతాబ్ధానికి చెందినదిగా గుర్తించారు
- తెలుగు గీతాల రచయిత వేటూరి సుందరరామమూర్తి కన్నుమూత
24- వ్యవసాయ రుణ ప్రణాళిక ప్రకటించిన ప్రభుత్వం
25- వైఎస్ఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు ఆగవని ముఖ్యమంత్రి రోశయ్య ప్రకటన
26- సింగపూర్ సంస్థ సహకాలంతో థర్మల్ ప్రాజెక్టు నిర్మాణం, ఒప్పందాలపై సంతకాలు చేసిన సిఎం రోశయ్య
27- 101 గంటల పాటు నిరంతరాయంగా జరిగిన అన్నమయ్య సంకీర్తనార్చనకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. విజయవాడలో ముగిసిన ఈ సహస్రనామ సంకీర్తనార్చనలో ఐదువేల మంది కళాకారులు ఐదురోజుల పాటు 1008 కీర్తనలు ఏకధాటిగా ఆలపించారు.
- కుప్పకూలిన శ్రీకాళహస్తి చారిత్రక గోపురం
28- తెదేపా మహానాడు ప్రారంభం
29- పవర్ పండింగ్ ప్రాజెక్టులు పరిశీలించాలని కేంద్రానికి సిఎం రోశయ్య లేఖ
30- పొగాకు నియంత్రణ కార్యక్రమాలు ఆరు జిల్లాలకు విస్తరిస్తున్నట్లు ఆరోగ్యశాఖ ప్రకటన
31- ఎంసెట్ ప్రశ్నాపత్రం లీక్ కు యత్నం... విద్యార్థి సుబ్బారెడ్డి అరెస్టు

జూన్
01- రాష్ట్రంలో ఐటి పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన
02- ఐటి రంగంలో పదిలక్షలమందికి ఉపాధి కల్పిస్తున్నట్లు సిఎం ప్రకటన
03- అనకాపల్లిలో కూలిన హెలికాప్టర్.. పైలట్ మృతి
04- మార్కెట్ ధరకే రాజీవ్ స్వగృహ కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన
- విద్యుత్ సంస్కరణలకు రూ.388 కోట్లు విడుదల
- హైదరాబాదులో బొటానికల్ పార్కు ప్రారంభం
05- తిరుమలలో డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నట్లు ప్రకటన
- రాష్ట్రంలో తొలిసారిగా పాస్ పోర్టు హ్యాకింగ్ సంచలనం... ముఠాను పట్టుకున్న పోలీసులు
06- ఎంసెట్ స్కాం ప్రధాన సూత్రదారి గురివిరెడ్డి అరెస్టు
07- రాష్ట్రంలో ఆరు కొత్త పాస్ పోర్టు కార్యాలయాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం
-సదరన్ ఇండస్ట్రియల్ కారిడార్ ల ఏర్పాటుకు ఏపి ప్రభుత్వం ప్రతిపాదన
08- అంటువ్యాధులు రాకుండా ముందస్తుగా ప్రతి గ్రామానికి రూ.పదివేల నిధులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన
09- పాఠ్యాంశంగా విపత్తు నిర్వహణ ను ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటన
10- శ్రీకాళహస్తి రాయల రాజగోపురాన్ని పునర్ నిర్మించేందుకు కమిటీని వేసిన ప్రభుత్వం
11- బోధనా ఫీజుల చెల్లింపు అర్హతలకు మార్గదర్శకాలు ప్రకటించి న ప్రభుత్వం
12- టివి ఛానల్సులో రియాల్టీ షోలలో చిన్న పిల్లలచే చేయించే నృత్యాలపై రాష్ట్ర మానవహక్కుల కమిషన నిషేదం
13- చెంచు జాతి పిల్లలకు కార్పోరేట్ విద్య కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన
14- ఫారెస్టు స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ప్రభుత్వం ప్రకటన
15- 2013లో కాకతీయ సామ్రాజ్యం 8వ శతాబ్ధి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన
16- వైఎస్ స్మృతి వనానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి
17- పులికాట్ సరస్సు అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్రం ప్రకటన
18- ఏపి 2010-15 కాలానికి కొత్త పారిశ్రామిక విధానానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం
19- బయటపడిన రైల్వే రిక్రూట్ మెంట్ స్కాం
- టీవీ ఛానల్సులో ప్రసారం చేసే రియాల్టీషో ఆట నిలిపివేస్తూ మానవహక్కుల సంఘం ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే
20- ఈఎంఆర్ఐ పనితీరుపై కమిటీ ఏర్పాటు
21- పది లక్షల మొక్కలు నాటుతున్నట్లు ప్రభుత్వం ప్రకటన
23- రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ ప్రభావం లేదని ఆరోగ్య శాఖ ప్రకటన
24- 7 లక్షల బోగస్ రేషన్ కార్డులు ఏరివేసినట్లు ప్రభుత్వం ప్రకటన
24- నాగార్జున సాగర్ ఆధునీకరణకు క్లియరెన్సు
26- మూడు నెలల పాటు మునిసిపల్ ఎన్నికలు వాయిదా
27- ప్రజా సంక్షేమంకోసమే పెట్రో ఆదాయమని ప్రకటించిన సిఎం రోశయ్య
28- రూ.18.138 కోట్ల పెట్టుబడితో నెలకొల్పే 27 బారీ పరిశ్రమలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశమైన ఏపి ప్రభుత్వం పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అనుమతి ఇచ్చింది.
29- కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
- చిత్తూరు జిల్లా పాకాలా, అనంతపూర్ జిల్లా ధర్మవరం మధ్య కొత్త బ్రాడ్ గేజ్ గా మార్చిన రైలు మార్గాన్ని ముఖ్యమంత్రి రోశయ్య ప్రారంభించారు
30- అల్మట్టి డ్యాం వివాదంపై ఆంధ్రప్రదేశ్ వాదనను కృష్ణా జలాల ట్రిబ్యునల్ కొట్టివేసింది.

జూలై
01- అల్మట్టీపై రీసర్వే సాధ్యం కాదని తేల్చి చెప్పిన కృష్ణా ట్రిబ్యునల్
- సిరిసిల్ల, వేములవాడ ఉప ఎన్నికలకు హైకోర్టు ఆదేశం
- ఐదేళ్ల తర్వాత సిఎంతో చంద్రబాబు భేటీ
02- పెంచిన గ్యాస్ భారం మోయటం సాధ్యం కాదని తెల్చి చెప్పిన ప్రభుత్వం
- జూనియర్ లెక్చరర్ పరీక్షలు వాయిదా
- ప్రభుత్వ ఉద్యోగుల డిఎ పెంపు
- నూతన పారిశ్రామిక విధానం ప్రకటన
03- మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ ఎన్ కౌంటర్
- తెలంగాణలోని 12 నియోజకవర్గాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్
04- ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో తెరాస ఎంపీ విజయశాంతి అరెస్టు
05- 500 ఏళ్ల రాయల ఉత్సవాలు ప్రారంభం
06- డిఎస్సీ-2008లో 30 శాతం రిజర్వేషన్లను సమర్థించిన హైకోర్టు
- పెట్రో ధరలకు నిరసనగా రాష్ట్రంలో బంద్
07- అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం
08- బాబ్లీపై స్తంభించిన శాసనసభ
- శిథిల ఆలయాల అధ్యయనానికి నిపుణుల కమిటీ ఏర్పాటు
09- ముగిసిన ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ
10- వైఎస్ఆర్ ప్రజాపార్టీ రిజిస్ట్రేషన్
- ఇతర రాష్ట్రాల్లోని దూరవిద్య డిగ్రీలు చెల్లవన్న ఉన్నత విద్యామండలి
12- జగన్ వర్గం నేత అంబటికి షోకాజ్ నోటీసు
13- శ్రీహరికోటలో పిఎస్ఎల్వీ ప్రయోగం విజయవంతం
- జనశక్తి మాజీనేత అమర్ అరెస్టు
14- దక్షిణాది రాష్ట్రాల మండలి ఉపాధ్యక్షునిగా రోశయ్య ఎన్నిక
- సిబిఐ ప్రత్యేక డైరెక్టర్ గా బల్వీందర్ సింగ్ నియామకం
- ఎన్నికల నిబంధన ఉల్లంఘనపై డిఎస్ కి ఇసి మందలింపు
15- థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు నిరసనగా సోంపేటలో నిరసన.. కాల్పుల్లో నలుగురు మృతి
- హైదరాబాద్ లో ఉగ్రవాది వికారుద్దిన్ అరెస్టు
16- ముగిసిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
17- ఐకెపి బృందాలకు ప్రభుత్వ భూములు కేటాయించాలని మంత్రివర్గ నిర్ణయం
- సోంపేట కాల్పులపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు
- బాబ్లీపై పోరాటంలో ధర్మాబాద్ లో చంద్రబాబు అరెస్టు
18- చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర బంద్
19- బాబ్లీపై ఢిల్లీకి తెదేపా పార్లమెంటరీ బృందం
20- బాబ్లీపై ఢిల్లీకి తెదేపా పార్లమెంటరీ బృందం
21- తెదేపా నేతలపై మహారాష్ట్ర దాడిని ఖండించిన ప్రభుత్వం
23- బాబ్లీ సమస్యలపై అఖిలపక్షం భేటీ
- సిరిసిల్ల, వేములవాడ ఉప ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
- పరిశ్రమల, వ్యాపార వర్గాలకు విద్యుత్ ఛార్జీలు పెంపు
24- బాబ్లీపై కేంద్రంతో ప్రభుత్వ చర్చలు విఫలం
25- ఉప ఎన్నికల ప్రచారానికి ముగిసిన గడువు
- ఒకే గొడుగు కిందకు పన్నుల విధానానికి ప్రభుత్వ నిర్ణయం
27- బాబ్లీపై ఇరు రాష్ట్రాల సిఎంల సమావేశానికి కేంద్రం హామీ
28- తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన ఉప ఎన్నికలు
29- నాగార్జునసాగర్ స్పిల్వే పనులపై హైకోర్టు స్టే ఎత్తివేత
30- తెలంగాణ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు
- బాబ్లీపై చర్చకు ఇరు రాష్ట్రాలను ఆహ్వానించిన కేంద్రం
31- ఉప ఎన్నికలలో తెరాస ఘనవిజయం

ఆగస్టు
01- తెలంగాణలో ముగిసిన ఉప ఎన్నికల ప్రక్రియ, 13 స్థానాల్లో విజేతల ప్రకటన
02- మహారాష్ట్రలో అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకునే అంశంపై సిఎంతో అఖిలపక్ష నేతల భేటి
03- జనాభా ప్రాతిపదికన బార్ల పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఎస్కెయూ విసి కుసుమకుమారిపై వేటు వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
- ఉప ఎన్నికల్లో గెలిచిన తెరాస ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం
04- ఆంధ్ర ప్రాంత మంత్రులతో శ్రీకృష్ణ కమిటీ భేటీ
05- కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖకు అధిష్టానం షోకాజ్ నోటీసు
ఉన్నత విద్యా మండలి చైర్మన్ కెసి రెడ్డి పదవీకాలం పొడిగింపు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజుల సెలవు ప్రకటించిన ప్రభుత్వం
06- వృత్తి విద్యా ఫీజులను పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం
- ప్రణబ్ తో తెలంగాణ ఎంపీల భేటీ
ప్రభుత్వంతో వైద్యుల చర్చలు విఫలం
- శ్రీరాంసాగర్ నీటి విడుదలకు ప్రభుత్వ కమిటీ ఏర్పాటు
07- బాబ్లీపై పోరుకు 9 మందితో తెదేపా కమిటీ
08- హైదరాబాద్ పై ఉగ్రవాదుల కన్నుందని నిఘా వర్గాల హెచ్చరిక
10- ఐసెట్, ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ తేదీలు ఖరారు
- ముంపు ప్రాంతాల పునరుద్దరణ వేగవంతం అధికారులకు సిఎం ఆదేశం
11- తితిదేలో ప్లాస్టిక్ వాడకం నిషేధించాలని సిఎం ఆదేశం
- హైదరాబాదులో దక్షిణాది రాష్ట్రాల డిజిపిల సమావేశం ప్రారంభం
12- ఎస్కెయు విసి తొలగింపుపై హైకోర్టు స్టే
13- ఐసెట్ నోటిఫికేషన్ విడుదల
- సిఎం రోశయ్యకు స్వైన్ ఫ్లూ పరీక్షలు
14- ఎమ్మార్ అక్రమాలపై విచారణ నిర్వహించాలని ప్రభత్వ నిర్ణయం
15- హైదరాబాదు చేరుకున్న కామన్వెల్తు క్రీడాజ్యోతి
- ఆర్డీఎస్ తూముల ధ్వంసం
- రాష్ట్రవ్యాప్తంగా తితిదే ఆధ్వర్యంలో కళ్యాణమస్తు వివాహాలు
16- సోని ఇండియన్ ఐడల్ గా శ్రీరామ్ గెలుపు
- మున్సిపల్ ఎన్నికలు నిరవధిక వాయిదా
- స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో సమాచార శాఖ శకటానికి ప్రథమ బహుమతి
17- కృషి బ్యాంకు డిపాజిట్లు చెల్లింపుకు హైకోర్టు అనుమతి
- మావోలపై నిషేధం పొడిగిస్తూ ప్రభుత్వ నిర్ణయం
- తితిదే టిక్కెట్ల కుంభకోణంపై సిఎంకు విజిలెన్స్ నివేదిక
18- ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా జయప్రకాశ్ రావు నియామకం
19- సత్యం మాజీ చైర్మన్ రామలింగరాజుకు బెయిలు మంజూరు
20- హైదరాబాద్ సరోజినీదైవి కంటి ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో కంటి చూపు కోల్పోయిన ఐదుగురు
21- భూకబ్జాలు, మైనింగ్ పై పోరాటానికి ప్రతిపక్షాల నిర్ణయం
24- తితిదేకి పాలకమండలి బదులు స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు
25- రాష్ట్రంలో కొత్త ఐటిఐల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
26- భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం, జలాశయాల్లో గరిష్ట స్థాయికి జలాశయాలు
27- బయ్యారం మైనింగ్ అనుమతుల రద్దుకు కేంద్రం ఆదేశం
28- ముఖ్యమంత్రితో కేంద్ర కేబినెట్ సెక్రటరీ భేటీ
31- కొత్త డిజిపిగా అరవిందరావు నియామకం

1</a> | 2 | <a href=3" title="1 | 2 | 3" />1 | 2 | 3

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X