వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐపియల్ పై నీలినీడలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Lalit Modi
క్రికెట్ క్రీడలో విప్లవాత్మక మార్పును తెచ్చిన ట్వంటీ20 మ్యాచులపై నీలినీడలు అలుముకుంటున్నాయి. ఐపియల్ నాలుగో ఎడిషన్ ఉంటుందా, ఉండదా అనే దాకా పరిస్థితి వెళ్లింది. అంతర్జాతీయ క్రికెట్ తారలు, బాలీవుడ్ తారలు ట్వంటీ20 మ్యాచులకు వెలుగు జిలుగులు చేకూరాయి. బోలెడంత డబ్బులు చేతులు మారుతున్న ట్వంటీ20 మ్యాచులు వివాదాలకు కూడా కారణమవుతోంది. భారీ అవినీతి, మనీ లాండరింగ్, పన్ను ఎగవేత, నిజమైన జట్ల యజమానుల పేర్లను దాచిపెట్టడం, అండర్ వరల్డ్ తో సంబంధాలు వంటి పలు ఆరోపణల్లో ఐపియల్ ట్వంటీ20 క్రీడను చుట్టుముట్టాయి. అయితే, ఈ టోర్నమెంటు కొనసాగుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) అధ్యక్షుడు శశాంక్ మనోహర్ అంటున్నారు. తమకు ఐపియల్ అత్యంత విలువైన ప్రాపర్టీ అని, దాని విలువను తగ్గించబోమని ఆయన చెబుతున్నారు. అయితే, ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే నాలుగో ఎడిషన్ లో చీర్ లీడర్స్ కు, రాత్రి పొద్దుపోయిన తర్వాత విందులకు స్వస్తి చెబుతామని ఆయన అంటున్నారు. మైదానం వెలుపల ఏం జరుగుతుందనే దాని కన్నా క్రికెట్ కే ప్రాధాన్యం ఇస్తామని ఆయన చెబుతున్నారు.

ఐపియల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీ వ్యవహారం క్రికెట్ క్రీడను కుదిపేస్తోంది. తీవ్రమైన అవినీతి ఆరోపణల్లో అతను చిక్కుకున్నాడు. అవినీతి ఆరోపణలపై లలిత్ మోడీని బయటకు పంపించేశారు. అతనిపై క్రిమినల్ కేసు పెట్టింది. దాదాపు 4.68 బిలియన్ రూపాయల అవకతవకలకు మోడీ పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. లలిత్ మోడీ దేశం విడిచిపెట్టి పోయాడు. లండన్ లో ఉంటున్నాడు. తనకు ముంబై గ్యాంగస్టర్ నుంచి ముప్పు ఉందని చెబుతున్నాడు. తాజాగా, కొచ్చి జట్టు విషయంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ వివాదం నడుస్తూనే ఉంది. కొచ్చి జట్టులో సునీల్ గవాస్కర్ కు వాటా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. లలిత్ మోడీ భవిష్యత్తు ఏమవుతుందనేది పక్కన పెడితే 2011లో ఐపియల్ సాగుతుందా అనేది చెప్పలేని స్థితి.

ఎనిమిది ఐపియల్ జట్లలో యాజమాన్యానికి సంబంధించి వివరాలు వెల్లడించకపోవడంతో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్లను బిసిసిఐ ఐపియల్ నాలుగో ఎడిషన్ నుంచి తప్పించింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఉద్వాసన చెప్పడం వెనక ఏదైనా మతలబు ఉండవచ్చునని ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వార్న్ అంటున్నాడు. క్రీడాకారుల వేలం ఈ ఏడాది నవంబర్ లో జరగాల్సి ఉంది. అయితే, జనవరిలోగా కూడా జరుగుతుందో లేదో చెప్పలేని స్థితి. దానికి ముందు ఐపియల్ నాలుగో ఎడిషన్ లో ఎన్ని జట్లు పాల్గొంటాయనే విషయాన్ని బిసిసిఐ ముందు తేల్చాల్సి ఉంటుంది. ఐపియల్ ఎక్కడ జరుగుతుందనేది కూడా ఎవరూ చెప్పలేకపోతున్నారు. మొత్తం మీద, ఐపియల్ పై అయోమయం, గందరగోళం నెలకొని ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X