వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐపియల్ ఫిక్సింగ్ లు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Lalit Modi
ఐపియల్ - 2పై కూడా మ్యాచ్ ఫిక్సింగ్ మబ్బులు ఆవరిస్తున్నాయి. ఐపియల్ 2లో మ్యాచ్ ఫిక్సింగ్ లపై 27 మంది క్రికెటర్లను విచారించేందుకు రంగం సిద్దమవుతున్నట్లు ఓ జాతీయ టీవీ చానెల్ తెలుపుతూ వార్తాకథనాన్నిప్రసారం చేసింది. ఈ మేరకు ఆదాయం పన్ను శాఖ అధికారులు ఆర్థిక మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించినట్లు సమాచారం. ఐపియల్ కమిషనర్ లలిత్ మోడీ బెట్టింగ్ వ్యవహారాలపై కూడా ఐటి అధికారులు ఆ నివేదికలో వివరించినట్లు తెలుస్తోంది.

కాగా, ఐపియల్ యజమానులు ఫిక్సింగ్ ఆరోపణలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరుతున్నారు. ఐపియల్ కొచ్చి జట్టు విషయంలో శశి థరూర్ పాత్రను ఐపియల్ కమిషనర్ లలిత్ మోడీ బయట పెట్టడంతో వివాదం రాజుకుంది. ఈ వ్యవహారంతో మంత్రి పదవికి థరూర్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆదే సమయంలో వివిధ రాజకీయ పార్టీ నాయకుల పాత్రపై కూడా ఆరోపణలు మొదలయ్యాయి.

ఐపియల్ వివాదం ఎన్సీపి నేతలను కూడా చుట్టుముట్టింది. ఎన్సీపి చీఫ్ శరద్ పవార్, ఆ పార్టీ నాయకుడు ప్రఫుల్ పటేల్, వారి కుటుంబ సభ్యుల పాత్రపై ఆరోపణలు వచ్చాయి. వారు ఆ ఆరోపణలు ఖండిస్తున్నప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం నమ్మడం లేదు. ఎన్సీపి నేతలను కాపాడడానికి కాంగ్రెసు ప్రయత్నిస్తోందని, యుపిఎలో భాగస్వామ్య పార్టీ కాబట్టి అందుకు ప్రభుత్వం పూనుకుందని ప్రతిపక్షాలు విమర్సిస్తున్నాయి.

ఐపియల్ వివాదం శశి థరూర్, లలిత్ మోడీతో ప్రారంభమై కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వాన్ని చుట్టుముట్టింది. ప్రతిపక్షాల డిమాండ్ మేరకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణకు పూనుకుంటుందా, మరో రకమైన విచారణకు సిద్ధపడుతుందా అనేది ప్రశ్న. ఐటి, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిగినప్పటికీ ప్రతిపక్షాలు రాజకీయపరమైన అంశంగా దాన్ని పరిగణిస్తున్నాయి. అందుకే సంయుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నాయి. అందుకు ప్రభుత్వం అంగీకరించాల్సిన పరిస్థితిలో పడినట్లేనని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X