వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జర్నలిస్టులకు సదవకాశం

By Pratap
|
Google Oneindia TeluguNews

ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థకు చెందిన వన్ ఇండియా డాట్ ఇన్ కు సంబంధించిన దట్స్ తెలుగు డాట్ కామ్ జర్నలిస్టులకు మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. వార్తలు, ఫీచర్స్, సినిమాలకు సంబంధించిన విభాగాల్లో అనూహ్యమైన, విశేషమైన ఆదరణను పొందుతున్న దట్స్ తెలుగు డాట్ కామ్ విస్తృతస్థాయిలో, ప్రామాణికంగా ఆటోమొబైల్ సెక్షన్ ను పెంచాలని ఆలోచిస్తోంది. ఇందుకు గాను ఆసక్తి గల జర్నలిస్టులు కావాలి. ఆటోమొబైల్ సెక్షన్ కోసం కాపీ రైటర్ గా పనిచేయడానికి ఆసక్తి గలవారు ముందుకు రావాలని కోరుతున్నాం.

ఆటోమొబైల్ రంగంపై తగిన విషయ పరిజ్ఞానం ఉండి, జర్నలిజంలో 2 నుంచి 3 ఏళ్ల అనుభవం గలవారు అయితే మంచిది. అనుభవం లేకున్నా తగిన ఆసక్తి, అభిరుచి, రాయగల సామర్థ్యం ఉన్నా ఫరవా లేదు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేవారు బెంగళూర్ లో పని చేయడానికి సిద్ధపడి ఉండాలి. పనికి, పరిజ్ఞానానికి తగిన వేతనం ఉంటుంది. ప్రింట్, టెలివిజన్ మీడియాలో కన్నా మా పోర్టల్ లో పని పరిస్థితులు, యాజమాన్య ఉద్యోగుల మధ్య సత్సబంధాలు ఉంటాయని గర్వంగా హామీ ఇవ్వగలం. డిసెంబర్ 23వ తేదీలోగా అభ్యర్థులు తమ దరఖాస్తులను (రెజ్యూమ్స్ ను) పంపాలని కోరుతున్నాం. ఆసక్తి గలవారు ఈ కింది మెయిల్ కు మీ రెజ్యూమ్ ను పంపగలరు. [email protected]

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X