తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారత్ దారులన్నీ తిరుమలకే

By Pratap
|
Google Oneindia TeluguNews

Tirumala
సమయమూ డబ్బులూ ఉండి ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటే భారతీయులు దేనికి ప్రాధాన్యం ఇస్తారో తెలుసుకోవాలని ఉందా, అది గోవానో, ఆగ్రానో అనుకునేరు. కాదట, శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల కొండకట. ఆంధ్రప్రదేశ్ లోని తిరుమలకు భారత పర్యాటకులకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు అ అధ్యయనంలో తేలింది. గత మూడేళ్లుగా తిరుమల ప్రథమ స్థానంలో ఉంది. రెండో స్థానం ఆగ్రాకు లభిస్తోంది. తాజ్ మహల్ అందుకు కారణం. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ మార్కెట్ పరిశోధన విభాగం అధ్యయనంలో ఈ విషయం తేలింది. 2009లో దేశీ పర్యాటకులు 65 కోట్ల మంది వివిధ ప్రాంతాలను సందర్శించగా, ఆ సంఖ్య 2008లో 56.3 కోట్లు, 2007లో 52.7 కోట్లు ఉంది. 2010లో ఇది 20 శాతం పెరగగలదని అంచనా.

దేశీయ పర్యాటకులు 2009లో సందర్శించిన పది రాష్ట్రాలు వరుసగా ఇలా ఉన్నాయి - ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్. మొత్తం పర్యాటకుల్లో 88 శాతం మంది ఈ పది రాష్ట్రాలను సందర్శించారు. 2009లో 15.75 కోట్ల మంది భారత పర్యాటకులు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ పర్యాటక ప్రదేశాలను సందర్శించారు. ఇలా ఆంధ్రప్రదేశ్ తిరుమల శ్రీవారి దయ వల్ల ప్రథమ స్థానంలో నిలిచింది. తిరుమల బాలాజీని సందర్శించిన తర్వాత పర్యాటకులు విశాఖపట్నం నగరానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ తర్వాత హైదరాబాదు మూడో స్థానం ఆక్రమిస్తోంది. హైదరాబాదులో కార్పొరేట్ కంపెనీలు ఎక్కువగా ఉండడం వల్ల తమ భవిష్యత్తును వెతుక్కుంటూ యువతీయువకులు హైదరాబాదు వస్తున్నట్లు చెబుతున్నారు. హైదరాబాదులో 500కు పైగా కంపెనీలున్నాయి. పర్యాటకుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2009లో 400 కోట్ల రూపాయలు ఆర్జించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X